ఆర్థిక మంత్రిత్వ శాఖ
జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 4 చిరుతపులి (పాంథెరా పార్దిస్) చర్మాలను స్వాధీనం చేసుకున్న డైరెక్టొరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ)
Posted On:
13 AUG 2023 11:52AM by PIB Hyderabad
జమ్మూ & కాశ్మీర్ (జె&కె)లోని శ్రీనగర్‌లో కొన్ని ముఠాలు వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో పాలుపంచుకుంటూ, చిరుత పులి చర్మాలను అమ్మేందుకు సంభావ్య కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నాయనే సమాచారం మేరకు కొంత కాలంగా నిర్ధిష్ట నిఘాను పెంపొందించిన తర్వాత డైరెక్టొరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) ఒక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ముఠా సభ్యులను పట్టుకునేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు.
కొనుగోలుదారులుగా నటిస్తూ, ముంబై జోనల్ యూనిట్ (గోవా ప్రాంతీయ యూనిట్) అధికారి ఒకరు జె&కెలోని శ్రీనగర్ చేరుకున్నారు.
అనేక విడతల బేరసారాల అనంతరం, అమ్మకందారులు శ్రీనగర్‌లోని దాల్ గేట్ సమీపంలో ముందస్తుగా నిర్ణయించిన ప్రాంతానికి తొలి పులి చర్మాన్ని తీసుకువచ్చారు. అనుకున్న ప్రాంతంలో పులి చర్మాన్ని తీసుకువెడుతున్న వ్యక్తిని నిఘాలో ఉన్న అధికారులు అడ్డుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా, అతడి సహచరుడిని శ్రీనగర్‌లోని ఒక బహిరంగ ప్రదేశంలో అటకాయించారు.
తొలి ముఠాను బందీ చేసిన తర్వాత మరొక విక్రయదారుల ముఠాతో తీవ్ర బేరసారాలను పలు విడతలలో నిర్వహించారు. రాత్రంతా బేరసారాలు సాగించిన తర్వాత, ముందస్తుగా అనుకున్న ప్రదేశానికి 3 పులి చర్మాలను తీసుకువచ్చేందుకు విక్రయందారులు తీసుకువచ్చేందుకు అంగీకరించారు. నిషిద్ధ వస్తువులను (3 పులి చర్మాలను) తీసుకుని వస్తున్న ముగురు వ్యక్తులను అధికారులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలో ఉన్న ఒక బహిరంగ ప్రదేశంలో ఈ లావాదేవీకి సంబంధించిన మరో ముగ్గురు వ్యక్తులు ఎదురుచూస్తున్నారనే వారి దగ్గర నుంచి సేకరించిన సమాచారం ద్వారా తెలిసింది. వెంటనే 2 అధికారుల బృందాన్ని పంపగా, వారు బహిరంగ ప్రదేశంలో ఎదురుచూస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చట్టవ్యతిరేక వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఒక సర్వీస్ కానిస్టేబుల్ సహా మొత్తం ఎనిమిదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, మొత్తం 4 పులి చర్మాలను (పాంథెరా పార్దస్)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పులులను లడాఖ్, దోడా, ఉడిల నుంచి వేటాడినట్టు తొలి దర్యాప్తులో తెలిసింది.
వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972లోని సవరించిన సెక్షన్ 50 (1) (సి) కింద నాలుగు చిరుతపులి చర్మాలను స్వాధీనం చేసుకున్నారు.
వన్యప్రాణ (సంరక్షణ) చట్టం, 1972 కింద స్వాధీనం చేసుకున్న8 మంది నేరస్థులను, నిషిద్ధ వస్తువలను , వన్యప్రాణుల (రక్షణ) చట్టం,1972 కింద ప్రాథమిక దర్యాప్తులను పూర్తి చేసి వన్యప్రాణ సంరక్షణ విభాగం అధికారులకు అందచేశారు.
***
(Release ID: 1948395)
Visitor Counter : 142