యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా "ఇంపాక్ట్-విత్-యూత్- కాన్క్లేవ్" లో యువతను ఉత్తేజపరిచిన - కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
12 AUG 2023 8:32PM by PIB Hyderabad
భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి శాఖ, యునిసెఫ్ లోని యువా, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన "ఇంపాక్ట్-విత్-యూత్-కాన్క్లేవ్" లో కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు మరియు సమాచార & ప్రసారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కీలకోపన్యాసం చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, "అభిరుచులను ప్రోత్సహించడం, మార్పును రేకెత్తించడం - దక్షిణాసియాకు చెందిన యువత అభిప్రాయాలను సేకరించి, మార్పును నడిపించడం", అనే ఇతివృత్తంతో, ఈ రోజు చెన్నైలో ఈ సదస్సు జరిగింది.
యువత పోషించాల్సిన కీలక పాత్ర గురించి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ను ప్రముఖంగా పేర్కొంటూ, "యువతే సంరక్షకులు, అతిపెద్ద భాగస్వాములు. ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న దేశాల్లో ఒకటిగా ఉన్న భారతదేశం బాధ్యత అసమానమైనది. యువతకు ఉన్న అద్భుతమైన శక్తిని ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం నొక్కి చెబుతుంది - వారు మన దేశ భవిష్యత్తును రూపొందిస్తారు, శాంతి భవిష్యత్తును పంచుకుంటారు." అని చెప్పారు. సుస్థిర అభివృద్ధికి హరిత నైపుణ్యాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, యువత తమ దృక్పథాన్ని పంచుకోవాలని, అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
అభివృద్ధి చెందుతున్న ఉపాధి మార్కెట్ పై శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు పెరుగుదలతో పాటు, ప్రపంచ కథనాలను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రభావితం చేయడానికి యువత నిర్వహించవలసిన సమిష్టి బాధ్యత గురించి నొక్కి చెప్పారు. ఇటీవలి డ్రోన్ విధానం గురించి, ఆత్మనిర్భర్ భారత్ ప్రాముఖ్యత గురించి ఆయన వివరిస్తూ, నేటి క్రియాశీల ప్రపంచంలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. భారతదేశ నిర్మాణ ప్రయత్నాలకు దోహదపడుతూ, ఒక కారణాన్ని స్వీకరించి, సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని శ్రీ ఠాకూర్ యువతకు పిలుపునిచ్చారు.
ఎన్.వై.కె.ఎస్. డైరెక్టర్ జనరల్ & యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ నితేష్ కుమార్ మిశ్రా; యునిసెఫ్ ప్రతినిధి శ్రీమతి సింథియా మెక్ కాఫ్రీ; యూనిసెఫ్ లో యువా అధిపతి శ్రీ ధువారఖా శ్రీరామ్ ప్రభృతులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
దేశ నిర్మాణంలో యువతను బలోపేతం చేసేందుకు మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను శ్రీ మిశ్రా ప్రధానంగా పేర్కొన్నారు. యువత సమస్యలను లేవనెత్తడంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రాముఖ్యత గురించి కూడా ఆయన ప్రముఖంగా తెలియజేశారు.
శ్రీమతి సింథియా మెక్ కాఫ్రీ స్వాగతోపన్యాసం చేస్తూ, యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై అవగాహన పెంచడం కోసం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని నొక్కి చెప్పారు. భారతదేశ జనాభా భాగస్వామ్యాన్ని ఆమె మెచ్చుకున్నారు. 21వ శతాబ్దపు అవకాశాల కోసం భారతీయ యువతను నిపుణులుగా చేయాలని ఆమె కోరారు.
"ఇంపాక్ట్-విత్-యూత్-కాన్క్లేవ్" అనేది యువకుల స్వరాన్ని విస్తరించడానికి, మార్పును ప్రేరేపించడానికి, దక్షిణాసియాలో పురోగతిని నడిపించడానికి ఒక వేదికగా పనిచేసింది. అభిరుచులను రేకెత్తించడంపై దృష్టి సారించడంతో పాటు, ఈ సదస్సు ఉజ్వల భవిష్యత్తు ను పెంపొందించే యువశక్తి స్ఫూర్తిని కలిగి ఉంటుంది.
"ఇంపాక్ట్-విత్-యూత్-కాన్క్లేవ్" గురించి:
"ఇంపాక్ట్-విత్-యూత్-కాన్క్లేవ్" అనేది భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి శాఖ, యునిసెఫ్ లోని యువా, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. యువతకు సాధికారత కల్పించడం, వారి గొంతులను విస్తరించడం, దక్షిణాసియాలో సానుకూల మార్పును తీసుకురావడం ఈ సదస్సు లక్ష్యం.
యునిసెఫ్ లోని యువా గురించి:
యువకులను శక్తివంతం చేయడానికి, పరివర్తనాత్మక మార్పును ముందుకు నడపడానికి వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి యునిసెఫ్ లోని యువా అంకితం చేయడం జరిగింది. వినూత్న కార్యక్రమాలు, భాగస్వామ్యాల ద్వారా, దేశవ్యాప్తంగా యువతకు ఉజ్వలమైన, మరింత సమ్మిళిత భవిష్యత్తును సృష్టించేందుకు యునిసెఫ్ లోని యువా పని చేస్తుంది.
అంతర్జాతీయ యువజన దినోత్సవం:
ప్రపంచ భవిష్యత్తును రూపొందించడంలో యువకుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
యువతకు సంబంధించిన సమస్యలపై అవగాహన పెంపొందించడానికి, వివిధ రంగాల్లో యువత అందిస్తున్న సహకారాన్ని గుర్తించి, సత్కరించడానికీ, ఈ రోజు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
*****
(Release ID: 1948329)
Visitor Counter : 180