నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
అత్యధికంగా రూ. 295 పన్ను అనంతర లాభాలను (పిఎటి) సాధించి, నికర ఎన్‌పిఎలను 1.61 శాతం తగ్గించిన ఐఆర్ఇడిఎ
Posted On:
12 AUG 2023 6:50PM by PIB Hyderabad
నూతన, పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వాహక నియంత్రణలోని భారత మినీరత్న (కేటగిరీ-1) సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ) 2023-24 సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 295 కోట్ల పన్ను అనంతర అత్యధిక త్రైమాసిక లాభాల (పిఎటి )ని, రూ. 440 కోట్ల పన్నుకు ముందు లాభాలను (పిబిటి) ఆర్జించి విశేష మైలురాయిని సాధించింది.
గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇదే కాలంతో పోలిస్తే వరుసగా 30% & 29% వృద్ధిని సాధించింది. అంతేకాకుండా, ఐఆర్ఇడిఎ నికర నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఎ)లలో కూడా గణనీయమై తగ్గింపును ప్రదర్శిస్తూ, 2023-24 ఆర్థిక సంవత్సరపు త్రైమాసికంలో వాటిని 2.92% నుంచి 1.61%కి తగ్గించింది. ఇది సంవత్సరాల ప్రాతిపదిక (ఇయర్ ఆన్ ఇయర్) 45% చెప్పుకోదగిన తగ్గింపును సూచిస్తుంది.
కంపెనీ అసాధారణ పనితీరును, స్థిరమైన వృద్ధి పథాన్ని ప్రశంసిస్తూ, శనివారం, 12 ఆగస్టు 2023న నిర్వహించిన సమావేశంలో ఐఆర్ఇడిఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాలను ఆమోదించింది.
గత ఏడాదికన్నా ఐఆర్ఇడిఎ లోన్ బుక్ 30 జూన్ 2022న రూ. 32,679 కోట్ల నుంచి 30 జూన్ 2023 రూ. 47,207 కోట్లకు విస్తరించి, 44% బలమైన వృద్ధిని ప్రదర్శించింది. తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 3,173 కోట్ల రుణ పంపిణీని సాధించి, కార్యకలాపాల నుంచి రూ. 1,143 కోట్ల మొత్తం ఆదాయాన్ని సాధించి, గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే వరుసగా, 272% & 45% పెరుగుదలను ప్రదర్శించింది. గత ఏడాది ఇదే కాలంలో రుణ పంపిణీ రూ. 852 కోట్లు కాగా, కార్యకలాపాల నుంచి సాధించిన మొత్తం ఆదాయం రూ. 786 కోట్లగా ఉంది.
ఆర్ధిక సంవత్సరం 2022-23 తొలి త్రైమాసికంలో సాధించిన చెప్పుకోదగిన ఆర్ధిక విజయాలతో పోలిస్తే ఆర్ధిక సంవత్సరం 2023-24 తొలి త్రైమాసికంలో చెప్పుకోదగిన ఆర్ధిక ముఖ్యాంశాలుః
పన్నుకు ముందు లాభంః గత ఏడాదిలో రూ. 340 కోట్లతో పోలిస్తే రూ. 440 కోట్లు (29% పెరుగుదల)
పన్ను అనంతర లాభాలుః గత ఏడాది రూ. 226కోట్లతో పోలిస్తే రూ. 295 కోట్లు (30% వృద్ధి)
రుణ పంపిణీః రూ. 852 కోట్లతో పోలిస్తే రూ. 3,173 కోట్లు (272% పెరుగుదల)
లోన్ బుక్ః రూ. 32,679 కోట్లకు వ్యతిరేకంగా రూ. 47,207 కోట్లు (44% పెరుగుదల)
నికర విలువః రూ. 5,514 కోట్లతో పోలిస్తే రూ. 6,290 కోట్లు (14% వృద్ధి)
నికర ఎన్‌పిఎలుః 5.38%తో పోలిస్తే 1.61% (శాతపరంగా చూస్తే 45% తగ్గింపు)
స్థూల ఎన్‌పిఎలుః 5.33%కి వ్యతిరేకంగా 3.08% (శాతపరంగా చూస్తే 42% తగ్గింపు)
కంపెనీ వృద్ధిని వాటాదారుల విశ్వాసం, మద్దతు కు ఐఆర్ఇడిఎ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ఆపాదించారు. కేంద్ర విద్యుత్ & నూతన, పునరావృత ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్‌కె సింగ్ కు, నూతన, పునరావృత ఇంధనశాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబాకు, ఎంఎన్ఆర్ ఇ కార్యదర్శి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు వారి నిరంతర మద్దతు, మార్గదర్శనానికి కృతజ్క్షతలు చెప్పారు. ఐఆర్ఇడిఎ చారిత్రిక పనితీరును సాధించేందుకు వారి మద్దతు, మార్గదర్శనాలే కారణమన్నారు.
ఈ చారిత్రాత్మక ఆర్ధిక ఫలితాలకు దారి తీసేందుకు కారణమైన ఐఆర్ఇడిఎ బృందపు అచంచలమైన నిబద్ధత, అవిశ్రాంత ప్రయత్నాలకు, అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు.
***
(Release ID: 1948324)
Visitor Counter : 124