హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న బిఎస్ఎఫ్

Posted On: 09 AUG 2023 5:31PM by PIB Hyderabad

సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) 2020 జనవరి 1వ తేదీ నుండి 2023 జూన్ 30వ తేదీ వరకు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల  అంతర్జాతీయ సరిహద్దుల వారీ వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 (సవరించబడినట్లుగా) సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి విచారణకు గాని వాటిని ధ్వంసం చేయడానికి గాని రాష్ట్ర పోలీసు/నార్కోటిక్స్ నియంత్రణ బ్యూరో/ఇతర డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు (డిఎల్ఈఏలు) కు బిఎస్ఎఫ్ అందజేస్తుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుండి దేశం సరిహద్దును రక్షించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

  1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌లకు నార్కోటిక్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం, 1985 కింద భూతలం, సముద్ర సరిహద్దుల్లో మాదకద్రవ్యాల నిషేధం కోసం అధికారం ఇచ్చారు.

  2. అదనపు ప్రత్యేక నిఘా పరికరాలు, అందుబాటులో ఉన్న ఇతర వనరులను హాని కలిగించే ప్రదేశాల్లో మోహరించడం ద్వారా నిఘాను బలోపేతం చేయడానికి సరిహద్దు వెంబడి వివరణాత్మక దుర్బలత్వ మ్యాపింగ్ జరిగింది.

  3. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్ (హెచ్హెచ్టిఐ), నైట్ విజన్ డివైస్ (ఎన్విడి), ట్విన్ టెలిస్కోప్ యుఏవిలు మొదలైన నిఘా పరికరాలు ప్రభావవంతమైన ప్రాంత ఆధిపత్యం కోసం ఫోర్స్ మల్టిప్లైయర్‌లుగా ఉపయోగిస్త్తున్నారు. దానితో పాటు, లాంగ్-రేంజ్ రికనైసెన్స్ అండ్ అబ్జర్వేషన్ సిస్టమ్ (లారోస్), బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ రాడార్ (బిఎఫ్ఎస్ఆర్) కూడా మోహరించారు. సీసీటీవీ/పిటిజడ్ కెమెరాలు, ఐఆర్ సెన్సార్లు, కమాండ్, కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన ఇన్‌ఫ్రారెడ్ అలారంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ టెక్నాలజీని అంతర్జాతీయ సరిహద్దులోని ఎంపిక చేసిన ప్యాచ్‌లలో కూడా ఏర్పాటు చేశారు.

  4. సరిహద్దుల చుట్టూ నిరంతర నిఘా నిర్వహించడం ద్వారా సరిహద్దులపై ప్రభావవంతమైన ఆధిపత్యం. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పెట్రోలింగ్, నాకాస్ వేయడం, పరిశీలన పహారా కేంద్రాలు నిర్వహించడం.

  5.  అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కంచె, బోర్డర్ అవుట్ పోస్ట్‌లు (బిఓపిలు), బోర్డర్ ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, అంతర్జాతీయ సరిహద్దులోని నదీతీర ప్రాంతాలపై ఆధిపత్యం కోసం వాటర్‌క్రాఫ్ట్ / బోట్లు, ఫ్లోటింగ్ బిఓపిలను ఉపయోగించడం.

  1. రాష్ట్ర పోలీసు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) మొదలైన ఇతర ఏజెన్సీలతో ప్రత్యేక కార్యకలాపాలు, ఉమ్మడి కార్యకలాపాలు సరిహద్దుల వెంబడి నిర్వహించబడుతున్నాయి.

  2. అంతర్జాతీయ ప్రభావాలను కలిగి ఉన్న డ్రగ్స్‌పై వివిధ సమస్యలను పరిష్కరించడానికి పొరుగు దేశాలతో పాటు మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలైన ఇతర దేశాలతో డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు నిర్వహించడం జరిగింది. 

 

****


(Release ID: 1947493) Visitor Counter : 124


Read this release in: English , Urdu