మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి మాతృ వందన యోజన లబ్ధిదారులు

प्रविष्टि तिथि: 09 AUG 2023 4:04PM by PIB Hyderabad

గత మూడు సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పిఎంఎంవివై) కింద ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు, పథకం కింద ప్రయోజనం అందుకున్న లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి.

2020-21

2021-22

నమోదైన లబ్ధిదారులు

మాతృత్వ ప్రయోజనం అందుకున్న లబ్ధిదారులు

నమోదైన లబ్ధిదారులు

మాతృత్వ ప్రయోజనం అందుకున్న లబ్ధిదారులు

64,07,657

45,19,454

51,44,981

32,91,186

 

మిషన్ శక్తి కింద సమాజంలోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన గర్భిణీ మహిళలు, బాలింతలకు పిఎంఎంవివైలో కవరేజి కల్పిస్తున్నారు. పిఎంఎంవివైకి చేసిన కేటాయింపులు పిఎంఎంవివై కింద లక్షిత బృందాల్లోని లబ్ధిదారులందరికీ సరిపోవిగా ఉన్నాయి. పిఎంఎంవివై పథకానికి కేటాయింపు 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాల (బిఇ) ప్రకారం రూ.2067.86 కోట్లుంది.

మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు. 

                

 

***


(रिलीज़ आईडी: 1947369) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu