రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వేమౌలిక సదుపాయాల పెంపు, గిరిజన మెజారిటీ ప్రాంతాలలో రైలు అనుసంధానతను పెంచేందుకు ,జనజాతీయ గౌరవ కారిడార్


– గత మూడు సంవత్సరాలలో పూర్తిగా లేదా పాక్షికంగా ఒడిషాలో 1467 కిలోమీటర్ల పొడవు గల 32 సర్వేలు ( 19 కొత్త రైలుమార్గాలు, 13 డబ్లింగ్ పనులు) పూర్తి అయ్యాయి.

Posted On: 09 AUG 2023 4:34PM by PIB Hyderabad

రైల్వే ప్రాజెక్టులు జోనల్ రైల్వే వారిగా మంజూరవుతాయి. అంతేకాని  ఇవి రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా మంజూరు చేయరు. దీనికి కారణం,
ఈ ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల సరిహద్దులు దాటి వెళుతుంటాయి కనుక ఇలా జోనల్ రైల్వే వారీగా మంజూరవుతాయి.
 రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం కాని ప్రాంతాలకు కొత్తరైల్వే  లైన్ల మంజూరు, జనజాతీయ కారిడార్ ఏర్పాటు వంటివి భారతీయ రైల్వేలో నిరంతరం కొనసాగే ప్రక్రియ.
గిరిజన మెజారిటీ ప్రాంతాలలో రైల్వే మౌలికసదుపాయాలను మరింత పెంచేందుకు, రాగల సంవత్సరాలలో ఇలాంటి ప్రాంతాలలో రైలు అనుసంధానత పెంచేందుకు 70,000 కోట్ల రూపాయల ఖర్చు కాగల,
 జనజాతీయ గౌరవ్ కారిడార్ ను , ప్రభుత్వ అనుమతులకు లోబడి 2023–24 బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఈజనజాతీయ గౌరవ్ కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు రిపోర్టులు
 (డిపిఆర్)లు , అలాగే  ఒడిషా పరిధిలోకి పూర్తిగా లేదా పాక్షికంగా వచ్చే ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి వివిధ భాగస్వాములతో సంప్రదింపులు చేపట్టడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు, రైల్వే సేవలు ఉపయోగించుకునేవారు, గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారు.
  ఈ ప్రాజెక్టులను సవివరమైన ప్రాజెక్టు నివేదిక ఆధారంగా అంచనా వేయడం జరుగుతుంది. వివిధ మార్గాలలో ట్రాఫిక్, సామాజిక ఆర్ధిక ప్రయోజనాలు వంటి అంశాలను పరిగణన లోకి తీసుకుంటారు.

గడచిన మూడు  సంవత్సరాలలో అంటే 2020–21, 2021–22,2022–23 ఆర్థిక సంవత్సరాలలో  అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2‌‌023–24 లో 32 సర్వేలు ( 19 కొత్త లైన్లు, 13 డబ్లింగ్ పనులు) మొత్తం 1467కిలోమీటర్ల పొడవు కలిగినవి  పూర్తిగా లేదా పాక్షికంగా ఒడిషా రాష్ట్రంలో చేపట్టిన పనులు పూర్తి అయ్యాయి.
కొత్త రైల్వే లైను ప్రాజెక్టులు, జనజాతీయ గౌరవ్ కారిడార్ తో సహా  పలు ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. వీటిని రాబడి, చిట్టచివరి ప్రాంతానికి సైతం అనుసంధానత , ప్రత్యామ్నాయ మార్గాలు, రద్దీ మార్గాలు, సామాజిక, ఆర్థిక అంశాలు వంటి వాటిని ఈ సందర్భంగా పరిగణన లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న   ప్రాజెక్టులను  దృష్టిలో  పెట్టుకుని, మొత్తం నిధుల  అందుబాటు, డిమాండ్, ను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాజెక్టుల అమలు అనేది నిరంతరాయ ప్రక్రియగా ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర  రైల్వే , కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ , లోక్సభకు ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

 

***

 



(Release ID: 1947363) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Odia