సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బాలురు , బాలికల కోసం మాదకద్రవ్యాల పునరావాస కేంద్రాలు


మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స పునరావాసం కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందిస్తున్న మంత్రిత్వ శాఖ

Posted On: 09 AUG 2023 4:08PM by PIB Hyderabad

ఎన్ ఎ పి డి డి ఆర్  (నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్) పథకం కింద, మాదకద్రవ్యాల వ్యసనపరుల చికిత్స పునరావాసం కోసం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు / ఎన్ జి ఒ లకు నిధులను అందిస్తుంది. కౌన్సెలింగ్/డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం , జైళ్లు, జూవెనల్ హోమ్ లు వంటి మూతబడిన ప్రదేశాలలో అవసరం ఉన్న మహిళలు, పిల్లలు మొదలైన మత్తు పదార్థాల బానిసల కోసం, సంరక్షణ, రక్షణ/చట్టం లేదా మరేదైనా ఇతరత్రా అవసరం ఉన్న మహిళలు ,పిల్లల వంటి ప్రత్యేక సమూహాల కోసం కౌన్సెలింగ్/డీ అడిక్షన్ సౌకర్యాలు కల్పించడం పథకం మార్గదర్శకాలలో ఉన్నాయి. మంత్రిత్వ శాఖ లేదా ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలతో కలసి వివిధ సంస్థలు / ప్రభుత్వ శాఖల ద్వారా ఈ మార్గదర్శకాలు అమలు జరుగుతాయి. 

 

మహిళలు, పిల్లల కోసం చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు కోరుతున్నారు.   ప్రస్తుతం పిల్లలకు చికిత్స సౌకర్యాలు కల్పించే ఐ ఆర్ సి ఎ లేదు. ఏదేమైనా, సామాజిక న్యాయం ,సాధికారత విభాగం 340 ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్ (ఐ ఆర్ సి ఎ) నిర్వహణ లో ఎన్ జి ఒ లకు మద్దతు ఇస్తోంది, ఇవి మగ ఆడ వ్యసనపరులకు కౌన్సెలింగ్ చికిత్సను అందిస్తాయి.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి రాజ్యసభ లో ఒక      లిఖితపూర్వక                    సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.    

 

***


(Release ID: 1947359) Visitor Counter : 103


Read this release in: English , Urdu