నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రీన్ హైడ్రోజన్ ధరను తగ్గించడానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రయత్నిస్తుంది. ఎలాగంటే..

Posted On: 09 AUG 2023 5:30PM by PIB Hyderabad

పునరుత్పాదక విద్యుత్తును ఉపయోగించి నీటి విద్యుద్విశ్లేషణ ద్వారా మరియు బయోమాస్ నుండి థర్మోకెమికల్ మరియు బయోకెమికల్ మార్గాల ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని కేంద్ర నూతన & పునరుత్పాదక శక్తి మరియు విద్యుత్శాఖ మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం, దేశంలో పునరుత్పాదక వనరుల ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చాలా పరిమితంగా ఉంది. భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా కోసం ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ప్రణాళికలు ప్రకటించాయి. అయితే ఇవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

ఎలక్ట్రోలైజర్‌ల ఖర్చులు మరియు ఇన్‌పుట్ పునరుత్పాదక ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయంలో రెండు ప్రధాన భాగాలు అని మంత్రి తెలియజేశారు. మూలధనం, సరఫరా మరియు నీటి నిర్వహణ, సరఫరా, నిల్వ మరియు పంపిణీ, హైడ్రోజన్‌ను తగిన ఉత్పన్నాలకు మార్చడం మరియు మౌలిక సదుపాయాలను ప్రారంభించడం వంటి ఖర్చులు ఏదైనా నిర్దిష్ట అప్లికేషన్ కోసం గ్రీన్ హైడ్రోజన్ యొక్క తుది డెలివరీ ధరకు దోహదం చేస్తాయి. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ఈ అంశాలలో వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను ఎలా చేపట్టాలని కోరుతుందో మంత్రి వివరించారు.

19,744 కోట్ల రూపాయలతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు 4 జనవరి 2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేశారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. మిషన్‌లో భాగంగా కింది భాగాలు ప్రకటించబడ్డాయి:

ఎగుమతులు మరియు దేశీయ వినియోగం ద్వారా డిమాండ్ సృష్టిని సులభతరం చేయడం;

గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమం కోసం  స్ట్రాటెజిక్ ఇంటర్వెన్షన్ లోభాగంగా ప్రధాన ఆర్థిక చర్యగారూ.17,490 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మద్దతు కోసం రెండు విభిన్న ఆర్థిక ప్రోత్సాహక విధానాలను కలిగి ఉంటుంది.

 

***

 


(Release ID: 1947358) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Punjabi