సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆర్థిక సాధికారత కోసం పథకం
Posted On:
09 AUG 2023 4:10PM by PIB Hyderabad
డి.ఎన్.టి కమ్యూనిటీల సంక్షేమం కోసం "స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డి.ఎన్.టి కమ్యూనిటీస్ (సీడ్)" అనే పథకాన్ని ఈ క్రింది నాలుగు అంశాలతో డిపార్ట్ మెంట్ ప్రవేశపెట్టింది:-
(i) డిఎన్ టి అభ్యర్థులకు పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మంచి నాణ్యతతో కూడిన కోచింగ్ అందించడం;
(ii) వారికి ఆరోగ్య బీమా కల్పించడం;
(iii) కమ్యూనిటీ స్థాయిలో జీవనోపాధి చొరవను సులభతరం చేయడం;
(iv) ఈ వర్గాల సభ్యులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం.
ఈ పథకం కింద సుమారు 4703 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఫిజికల్ వెరిఫికేషన్ కోసం సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించారు.
కేంద్ర సామాజిక న్యాయం, ఆర్థిక శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమిక్ రాజ్యసభకు ఒక లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.
*****
(Release ID: 1947354)
Visitor Counter : 117