నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎంకేయూఎస్యూఎం) యోజన అమలు పురోగతి
Posted On:
09 AUG 2023 5:32PM by PIB Hyderabad
వ్యవసాయ రంగాన్ని డీజీలైజేషన్ చేయడం, రైతులకు నీరు మరియు ఇంధన భద్రతను అందించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడం ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎంకేయూఎస్యూఎం) యొక్క ప్రధాన లక్ష్యాలని కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధనంమరియు విద్యుత్ శాఖ మంత్రి తెలియజేశారు. రూ. 34,422 కోట్ల మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో సౌర విద్యుదుత్పత్తిని 31.3.2026 నాటికి 30.8 గిగావాట్లకు పెంచాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. పథకం యొక్క ఇతర ముఖ్య లక్ష్యాలు క్రింద ఇవ్వబడ్డాయి.
లక్ష్యాలు & ప్రమాణాలు, విభాగాలు
డిమాండ్ ఆధారంగా దేశంలోని రైతులందరి కోసం పథకంలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఈ స్కీం అమలు చేయబడుతుంది.
కాంపోనెంట్ ఏ:
బంజరు భూములు, బీడు భూములు, పచ్చిక మైదానాలు, చిత్తడి నేలలు, సాగుచేయదగిన భూమిలో 10,000 మెగావాట్ల డీసెంట్రలైజ్డ్ గ్రౌండ్ లేదా స్టిల్ట్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం. ఇటువంటి ప్లాంట్లను వ్యక్తిగత రైతులు, సోలార్ పవర్ డెవలపర్, సహకార సంఘాలు, పంచాయతీలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు.
అందుబాటులో ఉన్న ఆర్థికసాయం..
ఈ పథకం కింద సోలార్/ఇతర పునరుత్పాదక శక్తిని కొనుగోలు చేయడానికి డిస్కమ్‌లకు కిలోవాట్కు 40పైసలు లేదా సంవత్సరానికి మెగావాట్కు రూ. 6.60 లక్షల.. ఏది ఎక్కువైతే అది ప్రొక్యూర్మెంట్ బేస్డ్ ఇన్సెంటివ్ కింద అందజేస్తారు. ప్లాంట్ యొక్క కమర్షియల్ ఆపరేషన్ తేదీ నుండి ఐదు సంవత్సరాల కాలానికి ప్రొక్యూర్మెంట్ బేస్డ్ ఇన్సెంటివ్ డిస్కమ్‌లకు ఇవ్వబడుతుంది. కాబట్టి, డిస్కమ్‌లకు చెల్లించాల్సిన మొత్తం ప్రొక్యూర్మెంట్ బేస్డ్ ఇన్సెంటివ్మెగావాట్కు రూ.33 లక్షలు.
కాంపోనెంట్ బి:
ఆఫ్ గ్రిడ్ ప్రాంతాల్లో 20 లక్షల స్టాండ్- అలోన్ సోలార్ పంపుల ఇన్‌స్టాలేషన్.
అందుబాటులో ఉన్న ఆర్థిక సాయం..
ఎంఎన్ఆర్ఈ ద్వారా జారీ చేయబడిన బెంచ్‌మార్క్ ధరలో 30% సీఎఫ్ఏ లేదా టెండర్‌లో గుర్తించిన సిస్టమ్‌ల ధరలు.. ఏది తక్కువగా ఉంటే అది అందించబడుతుంది. అయితే, సిక్కిం, జమ్మూ & కశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, లక్షద్వీప్ మరియు అండమాన్అండ్ నికోబార్ దీవులతో సహా ఈశాన్య రాష్ట్రాలలో ఎంఎన్ఆర్ఈ జారీ చేసిన బెంచ్‌మార్క్ ధరలో 50% సీఎఫ్ఏ లేదా టెండర్‌లో గుర్తించిన సిస్టమ్‌ల ధరలు, ఏది తక్కువైతే అది అందించబడుతుంది. అదనంగా, సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం కనీసం 30% ఆర్థిక సహాయాన్ని అందించాలి. బ్యాలెన్స్ ఖర్చు లబ్దిదారు ద్వారా అందించబడుతుంది.
అగ్రికల్చర్ ఫీడర్ సోలారైజేషన్ కోసం ఒక్కో మెగావాట్‌కు రూ. 1.05 కోట్ల సీఎఫ్ఏ అందించబడుతుంది. భాగస్వామ్య రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుండి తప్పనిసరి ఆర్థిక సహాయం అవసరం లేదు. ఫీడర్ సోలారైజేషన్ సీఏపీఈఎక్స్ లేదా ఆర్ఈఎస్సీఓ మోడ్‌లో అమలు చేయబడుతుంది.
కాంపోనెంట్ -సీ కింద కాంపోనెంట్- బీ మరియు వ్యక్తిగత పంప్ సోలారైజేషన్ కోసం:
కాంపోనెంట్ సి: (i) వ్యక్తిగత పంప్ సోలారైజేషన్ మరియు (ii) ఫీడర్ లెవల్ సోలారైజేషన్ ద్వారా 15 లక్షల గ్రిడ్ కనెక్ట్ చేయబడిన అగ్రికల్చర్ పంపుల సోలారైజేషన్.
కాంపోనెంట్- బి మరియు కాంపోనెంట్ -సి కింద లబ్ధిదారులు వ్యక్తిగత రైతు, నీటి వినియోగదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు మరియు సంఘాలు/క్లస్టర్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలు కావచ్చు.
గత రెండు సంవత్సరాలలో మరియు ప్రస్తుత సంవత్సరంలో 30.06.2023 వరకు వ్యక్తిగత సోలార్ పంపుల ఏర్పాటు మరియు ప్రస్తుత వ్యవసాయ పంపుల సోలారైజేషన్ కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పథకం కింద ప్రభుత్వం అందించిన మొత్తం క్రింద ఇవ్వబడినట్లు మంత్రి తెలియజేశారు.
(డుదలైన మొత్తాలు రూ.కోట్లలో..)
క్రమసంఖ్య రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు 2020–-21 2021–-22 2022–-23 2023–-24 నుండి 30.06.2023 వరకు
1. అరుణాచల్ ప్రదేశ్ 0 0 0.82
0
2. అస్సాం 0 0 0 0
3. గుజరాత్ 3.95 0 7.83 0
4. హర్యానా 51.33 161.12 137.95 25.15
5. హిమాచల్ ప్రదేశ్ 2.8 0 5.85 0
6. జమ్మూ & కాశ్మీర్ 0 0 15.69 0
7. జార్ఖండ్ 16.05 0 20.03 0
8. కర్ణాటక 1.26 0 0 2.38
9. మధ్యప్రదేశ్ 0 0 0 0
10. మహారాష్ట్ర 0 9.6 247.60 93.47
11. మణిపూర్ 0.36 0 0.23 0
12. మేఘాలయ 0.28 0 0 0.31
13. నాగాలాండ్ 0 0 0.20 0
14. ఒడిషా 0.77 0 0 0
15. పంజాబ్ 8.28 23.7 31.11 0
16. రాజస్థాన్ 52.06 153.49 247.64 0
17. తమిళనాడు 0 20.3 0 0
18. త్రిపుర 3.96 7.36 0.12 0
19. ఉత్తరాఖండ్ 0 0 4.00 0
20. ఉత్తర ప్రదేశ్ 15.34 13.73 82.29 9.82
21. ఇతరులు 0 16.75 0 0
మొత్తం 156.43 406.04 801.36 131.13
నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ పథకం అమలును సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి రైతులతో సహా వాటాదారులతో నిరంతరం నిమగ్నమై ఉందని మంత్రి తెలియజేశారు. ఇటీవల, మంత్రిత్వ శాఖ 12.07.2023న పథకం మార్గదర్శకాలను సవరించింది. అంతేకాకుండా పథకం యొక్క కాంపోనెంట్ ‘సి’ కోసం భూమి లీజు రేట్లను ప్రకటించడానికి రాష్ట్రాలను అనుమతించింది.
పథకం యొక్క కాంపోనెంట్ 'బి' కింద నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ జారీ చేసిన బెంచ్‌మార్క్ ధరలో 30% లేదా టెండర్‌లో గుర్తించిన సిస్టమ్‌ల ధరలలో ఏది తక్కువైతే అది అందించబడుతుందని మంత్రి తెలియజేశారు. . అయితే, సిక్కిం, జమ్మూ & కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, లక్షద్వీప్ మరియు అండమాన్ నికోబార్ దీవులతో సహా ఈశాన్య రాష్ట్రాలలో నూతన& పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ జారీ చేసిన బెంచ్‌మార్క్ ఖర్చులో 50% సీఎఫ్ఏ లేదా గుర్తించిన వ్యవస్థల ధరల టెండర్.. ఏది తక్కువైతే అది అందించబడుతుంది. అదనంగా, సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం కనీసం 30% ఆర్థిక సహాయాన్ని అందించాలి. బ్యాలెన్స్ ఖర్చు లబ్దిదారులు భరించాలి.
ప్రస్తుతం సోలార్ పంపులపై రైతులకు అందిస్తున్న సబ్సిడీని మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్కే సింగ్, ఆగస్టు 8, 2023న రాజ్యసభలో రెండు ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఇది కూడా చదవండి: పీఎంకుసుమ్ పథకం ద్వారా దాదాపు 2.46 లక్షల మంది రైతులు లబ్ది పొందారు: కేంద్ర విద్యుత్ మరియు నూతన& పునరుత్పాదక ఇంధన మంత్రి
***
(Release ID: 1947353)
Visitor Counter : 206