వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ మౌలికసదుపాయాల నిధి కింద భారత్ కార్యక్రమ ప్రచారం
Posted On:
08 AUG 2023 6:38PM by PIB Hyderabad
ప్రస్తుతం మౌలిక సదుపాయాల రంగంలో గల లోపాలను చక్కదిద్ది, వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలికసదుపాయాల ఫండ్ (ఎ.ఐ.ఎఫ్)ను 2020 సంవత్సరంలో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్ సదుపాయం కల్పించడం. పంట అనంతర కాల నిర్వహణ మౌలికసదుపాయాలు, కమ్యూనిటీ సేద్యపు ఆస్తుల వంటి సానుకూల ప్రాజెక్టులలో పెట్టుబడికి వీటిని సమకూరుస్తారు. ఈ పథకం కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, లక్ష కోట్ల రూపాయలు రుణాలుగా సమకూరుస్తాయి. సంవత్సరానికి వడ్డీ రాయితీ 3 శాతం వరకు ఉంటుంది. అలాగే, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సిజిటిఎంఎస్‌ఇ) కింద రుణ గ్యారంటీ కవరేజ్ రెండు కోట్ల రూపాయల రుణం వరకు లభిస్తుంది. ఇప్పటివరకు 26,064 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. 33,369 ప్రాజెక్టులు చేపట్టారు. మంజూరైన ప్రాజెక్టులలో వ్యవసాయ రంగం 44, 208 కోట్ల రూపాయలు పెట్టుబడులను సమకూర్చుకున్నాయి.
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద, ఒక సరికొత్త ప్రచారం ‘భారత్’ (బ్యాంక్స్ హెరాల్డింగ్ యాక్సిలరేటెడ్ రూరల్, అగ్రికల్చరల్ ట్రాన్స్‌ఫర్మేషన్`బి.హెచ్.ఎ.ఆర్.ఎ.టి)ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం కల్పించడం, వ్యవసాయ మౌలిక సదుపాయాల పెట్టుబడుల కల్పనకు బ్యాంకులు, రుణ సంస్థలు రుణాల మంజూరులో వాటి మధ్య పోటీ కల్పించడం దీని ఉద్దేశం.
ఇది నెలరోజుల పాటుసాగే ప్రచార కార్యక్రమం. దీనిని 15జూలై 2023న ప్రారంభించారు. ఇది 2023 ఆగస్టు 15 వరకు సాగుతుంది.
వివిధ కేటగిరీల కింద ప్రైవేటు రంగంలోని పెద్ద బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు(ఎస్.ఇ.బి), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు , కో ఆపరేటివ్ బ్యాంకులను ప్రచారం చివర ఎంపిక చేయడం జరుగుతుంది. వారి ప్రత్యేక చొరవకు తగిన గుర్తింపునిస్తారు. 31.07.2023 నాటికి మొత్తం 1239 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకులు 1375 ప్రాజెక్టులను , భారత్ ప్రచార కార్యక్రమం కింద మంజూరు చేశాయి.
ఈ ప్రచారాన్ని 2023 జూలై 12న ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా బ్యాంకింగ్ ఎగ్జిక్యుటివ్‌లు ఎండిలు, ఛైర్మన్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సిలు, ఎంపిక చేసిన సహకార బ్యాంకుల ఎగ్జిక్యుటివ్ డైరక్టర్లు హాజరయ్యారు. దీనికితోడు, ఆయా బ్యాంకులు సమకూర్చిన పెట్టుబడి రుణాలకు సంబంధించి ఏరోజుకారోజు వివరాలను అన్ని బ్యాంకులకు సందేశాల రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇలా రోజువారి సమాచారాన్ని బ్యాంకులకు తెలియజేయడం వల్ల ఆ బ్యాంకులలో , రుణ సదుపాయాలు కల్పించే సంస్థలలో మరింత ఆసక్తి పెరిగి అవి తమ లక్ష్యాలనుమించి పెట్టుబడులు సమకూర్చేందుకు ముందుకురావచ్చు. వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాలను సమకూర్చేందుకు సంబంధించి మంత్రిత్వశాఖ, క్రమం తప్పకుండా బ్యాంకుల ఎగ్జిక్యుటివ్ లతో వివిధ మార్గాలలో కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తున్నది. అలాగే లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న సంస్థలను , ఒప్పించడం, ఇంకా ముందుకు రాని సంస్థలకు తగిన విధంగా ప్రేరణ కల్పించడం వంటివి చేస్తున్నారు.
.వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉన్న సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలను సాధించాల్సిందిగా బ్యాంకులను కోరడం జరిగింది. దీనితో బ్యాంకుల నుంచి స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. మంత్రిత్వశాఖ ఆయా బ్యాంకులకు ఎఐఎఫ్ వార్షిక లక్ష్యాలను ఎప్పటికప్పుడు నిర్దేశిస్తోంది. వాకి క్లయింట్‌లు, భౌతికంగా అవి చేరేప్రాంతం, వ్యవసాయ అడ్వాన్సులలో వాటి వాటా, గత పనితీరు వంటి వాటిని గమనించి లక్ష్యాలను నిర్ణయించడం జరుగుతోంది. మంత్రిత్వశాఖ ప్రతిబ్యాంకుతో , తమ ఎఐశ్రీఫ్ నోడల్ అధికారుల ద్వారా ఎప్పటిప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులతో , ఈ పథకం ప్రగతి గురించి, మద్దతు ఇవ్వడం గురించి , చర్చిస్తోంది. నాబార్డ్ కేంద్ర కార్యాలయంలో 2022 డిసెంబర్ లో బ్యాంకర్స్ కీలక పాత్రధారులు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
దీనికితోడు, మంత్రిత్వశాఖ , బ్యాంకర్స్ శిక్షణా కళాశాలలో ప్రత్యక్షంగా సామర్ధ్యాల నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎఐఎఫ్ పథకం పై బ్యాంకు అధికారులతో , కేంద్ర కార్యాలయం, వివిధ బ్యాంకు ల నియంత్రిత కార్యాలయాలలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిని వర్చువల్ విధానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది బ్యాంకులలో ఉత్సాహంనింపుతోంది. బాగా పనితీరు కనబరుస్తున్న బ్యాంకులక అవార్డులు అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
బ్యాంకుల ఎఐఎఫ్ బృందాలకు చెందిన సామాజిక మాధ్యమ గ్రూపులు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు మరింతగా రుణాలు మంజూరు చేసేందుకు , పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులతో నిరంతరం సంబంధాలు ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఇది చాలావరకు నిర్వహణాపరమైన సమస్యలను అధిగమించడానికి ఉపకరిస్తోంది
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1947276)
Visitor Counter : 186