సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

దేశంలో టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) కేంద్రాలు

Posted On: 07 AUG 2023 3:33PM by PIB Hyderabad

దేశంలో 1967 నుంచి 1999 మధ్య కాలంలో భారత ప్రభుత్వ  సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (MSME) 18  
టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) కేంద్రాలు ఏర్పాటు చేసింది.  అంతకు ముందు వాటిని టూల్ రూమ్స్ (10) మరియు సాంకేతిక అభివృద్ధి కేంద్రాలు (8) అని పిలిచేవారు. దేశవ్యాప్తంగా ఇవి సాధారణ ఇంజనీరింగ్, ఆటోమేషన్, హ్యాండ్ టూల్స్, ప్లాస్టిక్స్, ఆటో విడిభాగాలు, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఫోర్జింగ్ & ఫౌండ్రీ, స్పోర్ట్స్ గూడ్స్, లెదర్ & ఫుట్‌వేర్, సువాసన & రుచులు మొదలైనవి MSMEలు మరియు ఉపకరణాల రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీ కోసం పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి , జిగ్‌లు & ఫిక్చర్‌ రంగాలు మొదలైనవి.   MSMEలకు చిన్న చిన్న పనులు,  ప్రెసిషన్ ప్రొడక్షన్ మరియు టెక్నికల్ కన్సల్టెన్సీలో టెక్నాలజీ కేంద్రాలు మద్దతు ఇస్తున్నాయి
( 18 టెక్నాలజీ కేంద్రాల జాబితా అనుబంధం - ఏ జతచేయడం జరిగింది)  

ఈ టెక్నాలజీ కేంద్రాల (TC) ప్రాథమిక లక్ష్యాలలో  పరిశ్రమలకు, ప్రధానంగా  దేశంలోని MSMEలకు
ఈ కింది మార్గాల ద్వారా మద్దతు ఇవ్వడం:--

అధునాతన తయారీ సాంకేతికతలకు ప్రవేశ సౌలభ్యం కల్పించడం.
సాంకేతిక అభివృద్ధికోసం మానవశక్తికి  నైపుణ్యం అందించడం
MSMEలకు సాంకేతిక మరియు వ్యాపార సలహా మద్దతును అందించడం.
MSMEలకు సేవలందించడంలో ఇప్పటికే ఉన్న18 TCల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా మరిన్ని సాంకేతిక కేంద్రాలను (TCలు) ఏర్పాటు చేయడం ద్వారా TCల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం గట్టి ఆవశ్యకతగా భావించడం జరిగింది.
తదనుగుణంగా టెక్నాలజీ సెంటర్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ (TCSP) కింద, దేశవ్యాప్తంగా 15 కొత్త సాంకేతిక కేంద్రాలను స్థాపించడం జరుగుతోంది (జాబితా అనుబంధం -బిలో  జతచేయడం జరిగింది).


      1967 నుంచి 1999 మధ్య కాలంలో MSME మంత్రిత్వ శాఖ 18 టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) కేంద్రాలు ఏర్పాటుచేసింది.  ఇప్పుడు టెక్నాలజీ సెంటర్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ (TCSP) కింద మరో  15 కొత్త సాంకేతిక కేంద్రాలను స్థాపించడం జరుగుతోంది.  మొత్తం 33 టెక్నాలజీ కేంద్రాలు ఉన్నప్పటికినీ అవి అధిక సంఖ్యలో ఉన్న MSMEలకు సేవలు అందించలేవు.  అందువల్ల అన్ని ఎం ఎస్ ఎం ఈ లకు సేవలు అందించడానికి వీలుగా  "కొత్త టెక్నాలజీ కేంద్రాలు / విస్తరణ కేంద్రాల ఏర్పాటు" పథకాన్ని ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది.   ఆ విధంగా 20 కొత్త టెక్నాలజీ కేంద్రాలు , 100 విస్తరణ కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

     టెక్నాలజీ కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్లు ఈ విధంగా ఉన్నాయి: --

టెక్నాలజీ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం ;
నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీలుగా వివిధ స్థానిక అధికారుల నుంచి  మాస్టర్ ప్లాన్ ఆమోదం,  ఏర్పాటునకు సమ్మతి వంటి నిర్మాణ పూర్వ అనుమతులు పొందడంలో ఆలస్యం;
కోవిడ్ -19 మహమ్మారి  కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా శృంఖల దెబ్బతిన్నది. దీని ఫలితంగా TCSP కింద కొత్త మరియు ఇప్పటికే ఉన్న TCలకు మెషిన్‌ల సరఫరా ఆలస్యం అయింది;
కోవిడ్ -19 వ్యాప్తి మరియు తదుపరి లాక్‌డౌన్‌ల కారణంగా వివిధ నిర్మాణ ప్రదేశాలలో సివిల్ నిర్మాణ పనులపై ప్రభావం పడింది.
సాంకేతిక కేంద్రాలలో పనులకోసం తుది యంత్రాల తయారీకి అవసరమైన వివిధ భాగాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. నౌకల రవాణాకు ఓడరేవులకు చాలా కాలం అనుమతి రాణి  కారణంగా అది  సమయానికి జరగలేదు. దీనివల్ల తుది యంత్రాల తయారీని, వాటిని నిర్మాణ ప్రదేశాలలో అంతిమ డెలివరీ కూడా జాప్యం జరిగింది.

      టెక్నాలజీ సెంటర్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ (TCSP) కింద 15 కొత్త సాంకేతిక కేంద్రాలను స్థాపించడం జరుగుతోంది.  కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రదేశం,  ప్రతి కేంద్రం ఏర్పాటుకు  అయ్యే అంచనా వ్యయం తదితర వివరాల జాబితా అనుబంధం -బిలో  జతచేయడం జరిగింది.

అనుబంధం - ఏ 

 



(Release ID: 1947147) Visitor Counter : 86


Read this release in: Urdu , English , Hindi , Punjabi