వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ పరపతి లక్ష్యం
Posted On:
08 AUG 2023 6:37PM by PIB Hyderabad
వనాల పెంపకానికి సంబంధించిన కార్యక్రమం వ్యవసాయక అటవీకరణను నాణ్యమైన మొక్కల పెంపకం పదార్ధాలపై దృష్టిని కేంద్రీకరించి పునర్నిర్మించడం జరిగింది. గతంలో కేంద్ర ప్రాయోజిత పథకం అగ్రో ఫారెస్ట్రీపై ఉప-మిషన్ (SMAF)ను ఇప్పుడు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY)లో భాగం అమలు చేస్తారు. ఇందుకు 15వ ఆర్ధిక సంఘం కాలానికి అంటే 2021-22 నుండి 2025-26 వరకు అయ్యే ఖర్చులో భారత ప్రభుత్వ వాటా కింద రూ. 271.65 కోట్లు ఇస్తారు. ధృవీకృత నాణ్యమైన మొక్కల పెంపకం పదార్ధాల (QPM) ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ICAR)కి చెందిన సెంట్రల్ ఆగ్రో ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CAFRI) సంస్థ ఇందుకు నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. అది సాంకేతిక మద్దతు, సామర్థ్యం పెంపుదల, నర్సరీల ఏర్పాటు, ఉత్పత్తి మరియు నాణ్యమైన మొక్కల పెంపకం పదార్ధాల ధృవీకరణ చేస్తుంది. ఆగ్రోఫారెస్ట్రీపై దేశవ్యాప్తంగా ఉన్న తన పరిశోధనా ప్రాజెక్టు కేంద్రాల ద్వారా CAFRI సహాయాన్ని అందజేస్తుంది. పథకం అమలు కోసం ప్రతి రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం ఒక నోడల్ డిపార్టుమెంటును / ఏజెన్సీని గుర్తించాలి. నాణ్యమైన మొక్కల పెంపకం పదార్ధాల (QPM)ను నోడల్ డిపార్ట్‌మెంట్/ఏజెన్సీ సొంతంగా ఉత్పత్తి చేయడం ద్వారా లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక బృందాలు(SHG) , ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవో) , వ్యవస్థాపకులు/అంకుర సంస్థలు, ఫారెస్ట్/వ్యవసాయ సంస్థలు, రైతులు/సహకార సంస్థలు వంటి వ్యక్తులు/సంస్థలు మొదలైన వాటితో కలిసి ఏర్పాటు చేయడం ద్వారా వాటి లభ్యతను నిర్ధారిస్తుంది.
పథకం కింద సేకరించిన QMPని రైతులు/SHGలకు ఉచితంగా లేదా సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయించిన విధంగా అందుబాటైన ధరల్లో లభ్యమయ్యేట్టు చూడాలి.
పథకం ప్రధాన భాగాలు/కార్యకలాపాలు కింది విధంగా ఉంటాయి:
విత్తేందుకు నాణ్యమైన మొక్కల పెంపకానికి నర్సరీల ఏర్పాటు.
నాణ్యమైన మొక్కల పెంపకానికి కణజాలం పోషణ ప్రయోగశాల
నాపుణ్య వృద్ధి మరియు జాగృతి కోసం ప్రచారం (5% వరకు కేటాయింపు)
పరిశోధన & అభివృద్ధి , మార్కెట్ తో సంబంధాలు
ప్రాజెక్టు యాజమాన్య విభాగం (పిఎంయు) మరియు వ్యవసాయక అటవీకరణకు సాంకేతిక మద్దతు బృందం (టి ఎస్ జి)
స్థానిక ఉపక్రమణ ( ఆమోదిత వార్షిక ప్రణాళికలో 2% వరకు)
పరమార్గత్ కృషి వికాస్ యోజన (పి కె వి వై) పథకం పరిధిలోని ఉప పథకం భారతీయ ప్రాకృతిక్ కృషి పధ్ధతి (బిపికెపి) ద్వారా
2019-2020 నుంచి ప్రభుత్వం ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నది. రసాయనిక ఎరువులు లేని సేద్యమే ప్రకృతి సిద్ధ వ్యవసాయం. దీనిలో పశుగణాల నుంచి వచ్చే జీవ వ్యర్ధాలను, స్థానిక వనరులను ఉపయోగించి సమాకలిత సేద్యం చేస్తారు. పశు
గణాలు విసర్జించే మల మూత్రాలను సేకరించి , పంట పొలాలలో దొరికే జీవద్రవ్యంతో ఏకీకృతం చేస్తారు. జీవద్రవ్యయానికి పశుగణాలు తినగా మిగిలి సగము కుళ్లిన గడ్డిని జతచేసి వాడటం దీనిలో ప్రత్యేకత. .
పరమార్గత్ కృషి వికాస్ యోజన (పి కె వి వై) పథకం పరిధిలోని నమామి గంగే కార్యక్రమం కింద ప్రభుత్వం గంగ నది తీరంలో ప్రభుత్వం రసాయనిక ఎరువులు లేని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నది. 2017-18 నుంచి ఇప్పటి వరకు నమామి గంగే కార్యక్రమం కింద 1.23 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టడం జరిగింది.
బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో గంగా నది తీరంలో 5కిలోమీటర్ కారిడార్లలో 1.48 హెక్టార్ల విస్తీర్ణంలో 2022-23లో ప్రకృతి సిద్ధంగా సేంద్రీయ వ్యవసాయం నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తదనుగుణంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా 52,000, 4000,6400 మరియు 85710 హెక్టార్లలో ప్రకృతిసిద్ధ వ్యవసాయం జేరిపేందుకు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి.
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభకు మంగళవారం ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.
******
(Release ID: 1947031)
Visitor Counter : 165