మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యా రంగం పరివర్తనకు ఎన్ఇపి 2020 కింద పలు కీలక చొరవలు

Posted On: 07 AUG 2023 4:25PM by PIB Hyderabad

జాతీయ విద్యావిధానం (ఎన్ఇపి 2020) విద్యా రంగంలో కేంద్ర, రాష్ర్టప్రభుత్వాల పెట్టుబడులు జిడిపిలో 6 శాతానికి పెరిగాలని నిర్ద్వంద్వంగా సూచిస్తోంది. అదే విధంగా విద్యారంగంలో ప్రైవేటు దాతల కార్యకలాపాల పునరుజ్జీవానికి క్రియాశీల ప్రోత్సాహం, మద్దతు అందిస్తోంది. విద్యా మంత్రిత్వ శాఖ విషయానికి వస్తే ఆ రంగానికి బడ్జెట్  కేటాయింపులు రూ.99,311.52 కోట్ల (2021-22) నుంచి రూ.1,12,899.47 కోట్లకు (2023-24) అంటే 13.69 శాతం పెరిగింది. 2018-19 నుంచి 2020-21 మధ్య విద్యారంగంపై మొత్తం బడ్జెట్ వ్యయాల్లో పెరుగుదల ధోరణి కనిపిస్తూ 2020-21 నాటికి 4.64 శాతానికి చేరినట్టు ఒక విశ్లేషణ తెలుపుతోంది.

అత్యున్నత నాణ్యత గల విదేశీ విద్యా సంస్థలతో పరిశోధన/భాగస్వామ్యాలు, ఫ్యాకల్టీ/విద్యార్థుల పరస్పర మార్పిడిని ఎన్ఇపి 2020 ప్రోత్సహిస్తోంది. అలాగే అద్భుతమైన పనితీరు ప్రదర్శించే భారతీయ విశ్వవిద్యాలయాలు ఇతర దేశాల్లో తమ కేంపస్ లు ఏర్పాటు చేయడానికి, అలాగే ఎంపిక చేసిన విదేశీ విశ్వవిద్యాలయాలు అంటే ప్రపంచంలో 100 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు దేశంలో తమ కేంపస్ లు ప్రారంభించడానికి కూడా ఎన్ఇపి ప్రోత్సహిస్తుంది. ఇందుకు అనుగుణంగా యుజిసి ‘‘ద్వంద్వ కోర్సులు, జాయింట్ డిగ్రీలు, డ్యుయల్ డిగ్రీలు నిర్వహించడంలో విదేశీ, దేశీయ విద్యాసంస్థల సహకారంపై నియంత్రణ’’లను 02.05.2022వ తేదీన జారీ చేసింది. అదే విధంగా విదేశీ ఉన్నత విద్యా సంస్థలు భారత ఉన్నత విద్యా సంస్థల్లో విద్య, పరిశోధన ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభించడంలో విద్యా  సహకారానికి కూడా అవకాశం కల్పిస్తోంది. అలాగే అందుబాటు ధరల్లో ప్రపంచ నాణ్యత గల విద్య, పరిశోధన కేంద్రాలు ప్రారంభించేందుకు వీలుగా వరల్డ్  క్లాస్  ఇన్  స్టిట్యూషన్స్  స్కీమ్ ను 2017లో ప్రారంభించారు. ఈ స్కీమ్  కు  సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి 10 వంతున విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసి వాటికి ‘‘ఇన్ స్టిట్యూషన్  ఆఫ్ ఎక్సలెన్స్’’ (ఐఓఇ) హోదా కల్పిస్తారు. ఇప్పటివరకు 12 సంస్థలకు ఐఓఇ హోదా కల్పించారు. వాటిలో 8 ప్రభుత్వ విద్యా సంస్థలుండగా 4 ప్రైవేటు విద్యా సంస్థలు.

దేశంలోని ప్రస్తుత విద్యా వనరులను మరింత పెంచడానికి భారత సంతతికి చెందిన వారితో సహా విదేశాల నుంచి శాస్ర్తవేత్తలు, ఎంటర్ ప్రెన్యూర్ల టాలెంట్ ను ఉపయోగించుకునేందుకు గ్లోబల్  ఇనీషియేటివ్ ఫర్ అకడమిక్  నెట్  వర్క్ (జియాన్) కూడా అమలుపరిచారు.  అదే విధంగా ఉన్నత శ్రేణి భారతీయ ఉన్నత విద్యా సంస్థలు, మంచి ర్యాంకింగ్  ఉన్న విదేశీ విద్యాసంస్థలతో విద్యార్థులు, ఫ్యాకల్టీ పరస్పర మార్పిడి అవకాశం గల ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు చేపట్టడం కోసం విద్యా, పరిశోధనా భాగస్వామ్యాలు చేపట్టడానికి స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్  కొలాబరేషన్ (స్పార్క్) స్కీమ్ కూడా ప్రారంభించారు.

టాంజానియాలోని జంజిబార్  లో ఐఐటి మద్రాస్  కేంపస్ ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తూ భారత విద్యా మంత్రిత్వ శాఖ(ఎంఓఇ), ఐఐటి మద్రాస్, జంజిబార్-టాంజానియా విద్యా, వృత్తి విద్యా శిక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓఇవిటి) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ఒక ఇతర దేశంలో ఐఐటి మద్రాస్  తొలి కేంపస్ ఇదే. అదే విధంగా అబూదభీలో ఐఐటి ఢిల్లీ కేంపస్  ఏర్పాటు చేయడానికి వీలుగా విద్యా మంత్రిత్వ శాఖ,  అబూదభీ విద్యా, నాలెడ్జ్ (ఎడిఇకె) శాఖ, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ (ఐఐటి, ఢిల్లీ) మధ్య కూడా ఎంఓయుపై సంతకాలు జరిగాయి.

ఆర్థిక మంత్రి 2022-23 బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రకటించిన విధంగా గుజరాత్  లోని గిఫ్ట్  సిటీలో (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్  టెక్-సిటీ)  దేశీయ నియమ నిబంధనలకు సంబంధించిన నియంత్రణల నుంచి మినహాయింపుతో ఫైనాన్షియల్ మేనేజ్  మెంట్, ఫిన్ టెక్,  సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్ర్త కోర్సులు ప్రారంభించడానికి ప్రపంచ శ్రేణి విదేశీ విశ్వవిద్యాలయాలు, సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. అయితే ఫైనాన్షియల్  సర్వీసులు, టెక్నాలజీ రంగానికి అత్యున్నత శ్రేణి మానవ వనరులు అందుబాటులో ఉంచడానికి వీలుగా ఇంటర్నేషనల్  ఫైనాన్షియల్  సర్వీసెస్  సెంటర్స్  అధారిటీ (ఐఎఫ్ఎస్ సిఏ) నిబంధనలు మాత్రం వర్తిస్తాయి.

ఎన్ఇపి 2020 ప్రకటించిన తర్వాత గత 3 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు ఈ అనుబంధంలో ఉన్నాయి.

అనుబంధం

       i.         పిఎం శ్రీ కింద పిఎం శ్రీ పాఠశాలల అప్ గ్రేడేషన్  కు తొలి వాయిదాగా  రూ.630 కోట్లు విడుదల చేశారు. మొత్తం 14.500 పిఎం శ్రీ పాఠశాలల్లో 6207 పాఠశాలలను ఇందుకు ఎంపి చేశారు. 5 సంవత్సరాల కాలానికి ఈ  స్కీమ్  కింద మొత్తం రూ.27,360 కోట్ల పెట్టుబడిలో కేంద్ర వాటా రూ.18,128 కోట్లుంది.

     ii.         గ్రేడ్ 3 ముగిసే సమయానికి చదవడం, అంకెలపై మంచి అవగాహన కోసం జాతీయ స్థాయిలో చేపట్టిన (నిపుణ్  భారత్) కార్యక్రమం కింద అక్షరాస్యత, అంకెలపై పునాది ఏర్పడుతుంది.

    iii.         మూడు నెలల కాలపరిమితి గల ఆటల ఆధారిత పాఠశాలల కోసం విద్యా-ప్రవేశ్  మార్గదర్శకాలు జారీ చేశారు.

    iv.         డిజిటల్/ఆన్  లైన్/ఆన్-ఎయిర్ విద్యకు సంబంధించిన కార్యకలాపాల ఏకీకకరణకు పిఎం ఇ-విద్య చేపట్టారు.

     v.         ఇ-పుస్తకాలు, ఇ-కంటెంట్  కింద ఒక జాతి ఒక డిజిటల్  ప్లాట్  ఫారంగా దీక్ష (డిజిటల్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) ప్రారంభించారు.

    vi.         3 నుంచి 8 సంవత్సరాల మధ్య వయస్కులైన బలల కోసం ప్రత్యేకంగా ఆటల ఆధారిత అభ్యాసం బోధన మెటీరియల్  తయారీ కోసం ప్రాథమిక స్థాయిలో నేషనల్  కరికులం ఫ్రేమ్  వర్క్  (ఎన్ సిఎఫ్ ఎఫ్ఎస్) ప్రారంభించారు.

   vii.         ఉపాధ్యాయులు, హెడ్ ఉపాధ్యాయులు/ప్రిన్సిపాల్స్, విద్యా నిర్వహణలో ఇతర భాగస్వాముల కోసం నిష్ఠ (నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్  అడ్వాన్స్  మెంట్) 1.0, 2.0, 23.0 కార్యక్రమాలు ప్రారంభించారు.

 viii.         విద్యా వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి ఉమ్మడి నేషనల్  డిజిటల్ మౌలిక వసతుల కల్పన కోసం నేషనల్  డిజిటల్  ఎడ్యుకేషన్  ఆర్కిటెక్చర్ (ఎన్ డిఏఇఆర్) ప్రారంభించారు.

    ix.         15 సంవత్సరాలు,  ఆ పైబడిన వయసు గల నిరక్షరాస్యుల కోసం ‘‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ లేదా ఉల్లాస్’’ ప్రారంభించారు.

     x.         నేషనల్  క్రెడిట్  ఫ్రేమ్  వర్క్ (ఎన్  సిఆర్ఎఫ్), నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్  వర్క్ (ఎన్ హెచ్ఇక్యుఎఫ్) ప్రారంభించారు.

    xi.         క్రెడిట్ల బదిలీ కోసం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏర్పాటు చేశారు.

   xii.         అండర్  గ్రాడ్యుయేట్  ప్రోగ్రామ్  కోసం కరికులం, క్రెడిట్  ఫ్రేమ్  వర్క్  ప్రారంభించారు.

 xiii.         ఉన్నత విద్యా  సంస్థలు బహుళ ప్రవేశ, నిష్క్రమణ అకడమిక్ ప్రోగ్రామ్  లు ప్రారంభించేందుకు అనుమతించారు.

 xiv.         ఒకే  సారి రెండు అకడమిక్  ప్రోగ్రామ్  లలో భాగస్వాములయ్యేందుకు అనుమతించారు.

  xv.         స్వయం ప్లాట్  ఫారం ఉపయోగించుకుని 40 శాతం క్రెడిట్లు గల కోర్సులకు అనుమతి ఇచ్చేందుకు ఒడిఎల్/ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కు సవరించిన నియంత్రణలు రూపొందించారు.

 xvi.         పరిశ్రమ నిపుణులతో పని చేయడానికి హెచ్ఇఐల కోసం ప్రొఫెసర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.

xvii.         దేశీయ, విదేశీ హెచ్ఇఐల మధ్య అకడమిక్  భాగస్వామ్యానికి నియంత్రణలు జారీ చేశారు.

xviii.         రాష్ర్టాలకకు అటానమస్  స్టాటస్  కు నియంత్రణలు జారీ చేశారు.

xix.         భారతదేశానికి చెందిన హెచ్ఇఐలలో విదేశీ విద్యార్థుల కోసం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్  గ్రాడ్యుయేట్ సీట్లలో ప్రవేశానికి, సూపర్ న్యూమరరీ సీట్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.

  xx.         పిహెచ్ డి డిగ్రీల కోసం కనీస ప్రమాణాలు, విధివిధానాలకు సంబంధించిన నియంత్రణలు జారీ చేశారు.

 xxi.         ఉన్నత విద్యా కరికులంలో భారతదేశానికి చెందిన మేథస్సును ప్రవేశపెట్టడానికి మార్గదర్శకాలు జారీ చేశారు.

xxii.         భారతీయ నాలెడ్జ్  వ్యవస్థలో (ఐకెఎస్) ఫ్యాకల్టీ కోసం శిక్షణ/ఓరియెంటేషన్  మార్గదర్శకాలు జారీ చేశారు.

xxiii.         భారతీయ వారసత్వం, సంస్కృతిపై కోర్సులు  ప్రారంభించడానికి మార్గదర్శకాలు జారీ చేశారు.

xxiv.         ఉన్నత విద్యా సంస్థల్లో ఆర్టిసన్లు/ఆర్టిసన్స్-ఇన్-రెసిడెన్స్  ఎంపానెల్  మెంట్  మార్గదర్శకాలు జారీ చేశారు.

xxv.         ఐకెఎస్  లో వాస్తవ పరిశోధన, విద్య, పంపిణీ కోసం 32 ఐకెఎస్ లు ఏర్పాటు చేశారు. మెటలర్జీ, ప్రాచీన టౌన్  ప్లానింగ్, జలవనరుల నిర్వహణ, పురాతన రసాయనశాస్ర్తంలో 64 అత్యున్నత శ్రేణి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. ఐకెఎస్  పై 3227 ఇంటర్న్ షిప్  లు కూడా అందిస్తున్నారు.

విద్యా శాఖ సహాయమంత్రి డాక్టర్  సుభాష్  సర్కార్  లోక్ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు. 

****


(Release ID: 1946984) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Tamil