వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం
Posted On:
08 AUG 2023 6:41PM by PIB Hyderabad
దేశంలో 2015-16 నుంచి కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం సంప్రదాయ వ్యవసాయాభివృద్ధి పథకం (పికెవివై), ఈశాన్య ప్రాంత సేంద్రియ విలువ శ్రేణి అభివృద్ధి కార్యక్రమం (ఎంఒవిసిడిఎన్‌ఇఆర్) అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ రెండు పథకాల ద్వారా సంపూర్ణ చేయూతనిస్తోంది. ఈ మేరకు ఉత్పత్తి నుంచి శుద్ధి, ధ్రువీకరణ, మార్కెటింగ్, పంట అనంతర నిర్వహణ వరకూ పూర్తిస్థాయిలో సహకరిస్తోంది. అంతేకాకుండా శిక్షణ-సామర్థ్య పెంపు కార్యక్రమాలుసహా సేంద్రియ ఎరువులు/ఎరువుల ఉత్పత్తి-వాడకంపై రైతులకు ప్రోత్సాహకాలు ప్రత్యక్ష-పరోక్ష ఉత్పాదకాలుగా ఈ పథకాల్లో అంతర్భాగంగా ఉంటాయి. అలాగే సేంద్రియ ఎరువులుసహా సేంద్రియ ఉత్పాదకాలు వినియోగించే రైతులకు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డిబిటి) సదుపాయం కూడా కల్పించబడుతుంది. కాగా, ‘పికెవివై’ దేశవ్యాప్తంగా అమలవుతుండగా, ఈశాన్య భారతంలో మాత్రం ‘ఎంఒవిసిడిఎన్‌ఇఆర్’ ప్రత్యేకంగా అమలు చేయబడుతోంది.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం తమిళనాడు, రాజస్థాన్ సహా అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ప్రభుత్వం ‘పికెవివై’ కింద హెక్టారుకు రూ.50,000 వంతున మూడేళ్లపాటు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ నిధులను శిక్షణ-సామర్థ్య వికాసం, సమాచార నిర్వహణ, ‘పీజీఎస్’ ధ్రువీకరణ, విలువ జోడింపు, మార్కెటింగ్-ప్రచారం వంటి విభిన్న కార్యకలాపాల కోసం వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సహాయంలో హెక్టారుకు రూ.31,000 వంతున ప్రత్యక్ష-పరోక్ష సేంద్రియ ఉత్పాదకాల కోసం మూడేళ్లపాటు రైతులకు ‘డిబిటి’ ద్వారా అందజేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ‘ఎంఒవిసిడిఎన్‌ఇఆర్’ కింద హెక్టారుకు రూ.46,575 వంతున మూడేళ్లపాటు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ నిధులను రైతు ఉత్పత్తిదారు సంస్థల సృష్టి, రైతులకు సేంద్రియ ఉత్పాదకాలు, నాణ్యమైన విత్తనాలు/విత్తే పరికరాలు, శిక్షణ, చేయూత, ధ్రువీకరణ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సహాయంలో హెక్టారుకు రూ.32,500 వంతున ప్రత్యక్ష-పరోక్ష సేంద్రియ ఉత్పాదకాల కోసం మూడేళ్లపాటు అందజేస్తుంది. ఈ మొత్తంలో రైతులకు ‘డిబిటి’ ద్వారా రూ.15,000 వంతున బదిలీ చేస్తారు. మిగిలిన రూ.17,500తో రాష్ట్ర ప్రధాన సంస్థ (ఎస్‌ఎల్‌ఎ) ద్వారా రైతులకు విత్తనాలు/నాట్లు వేసే ఉపకరణాలు అందజేస్తారు.
జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వాటికి విలువ జోడింపు, ధ్రువీకరణ, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తోంది. ఈ మేరకు 2001లో జాతీయ సేంద్రియ ఉత్పత్తుల కార్యక్రమం (ఎన్‌పిఒపి) కింద అంతర్జాతీయ మార్కెట్ నిబంధనలకు తగినట్లు తృతీయ పక్షం ధ్రువీకరణను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ‘పికెవివై’ కింద విలువ జోడింపు, మార్కెటింగ్-ప్రచార కార్యక్రమాల కోసం హెక్టారుకు రూ.8,800 వంతున మూడేళ్లపాటు ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తుంది. అలాగే రాజస్థాన్ సహా అన్ని రాష్ట్రాల్లోని రైతులకు ధ్రువీకరణ-శిక్షణ, చేయూత-సామర్థ్య వికాసం కోసం వరుసగా హెక్టారుకు రూ.2,700, రూ.7,500 వంతున మూడేళ్లపాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో ‘ఎంఒవిసిడిఎన్‌ఇఆర్’ కింద శిక్షణ-సామర్థ్య వికాసం, ధ్రువీకరణ నిమిత్తం హెక్టారుకు రూ.10,000 వంతున మూడేళ్లపాటు ఆర్థిక సహాయం అందిస్తుంది.
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం దిశగా 2022-23లో (పికెవివై, ఎంఒవిసిడిఎన్‌ఇఆర్) పథకాలవారీ, రాష్ట్రాలవారీ నిధుల కేటాయింపు, విడుదల, వినియోగం వివరాలను అనుబంధం-Iలో చూడవచ్చు.
సేంద్రియ, సంప్రదాయ విధానాల నిర్వహణపై తులనాత్మక అంచనాల కోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో దీర్ఘకాలిక ప్రయోగం నిర్వహించింది. దీని ప్రకారం ఖరీఫ్, రబీ/వేసవి ముతక పంటలు/బాస్మతి వరి ఆధారిత పంటల వ్యవస్థలు, సోయాబీన్ ఆధారిత వ్యవస్థలలో కర్బన (నిరింద్రియ) పద్ధతుల్లో సాగుకన్నా సేంద్రియ విధానంలో దిగుబడులు గణనీయ స్థాయిలో అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఆ మేరకు దీర్ఘకాలిక సేంద్రియ వ్యవసాయ నిర్వహణ పద్ధతులు ఈ పంటల సాగుకు అనువైనవిగా తేలింది. దీర్ఘకాలిక సేంద్రియ విధానంలో ముతక ధాన్యం, బాస్మతి ధాన్యం, సోయాబీన్ ఆధారిత పంట వ్యవస్థలలో భూసార సేంద్రియ కర్బన స్థాయి హెచ్చుగా ఉన్నట్లు తేలింది.
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోపాటు వ్యవసాయ ఉత్పాదకత, వివిధ సేంద్రియ ఎరువుల వాడకానికి సంబంధించిన సమాచార వ్యాప్తి కోసం జాతీయ సేంద్రియ-ప్రకృతి వ్యవసాయ కేంద్రం (ఎన్‌సిఒఎన్‌ఎఫ్) వివిధ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. వీటిని ఘజియాబాద్, బెంగళూరు, ఇంఫాల్, భువనేశ్వర్‌లలోని తన ప్రాంతీయ కేంద్రాల (ఆర్‌సిఒఎన్‌ఎఫ్) ద్వారా నిర్వహిస్తోంది. ఈ మేరకు రైతుల కోసం ఒకరోజు శిక్షణ, విస్తరణాధికారులు/సిబ్బందికి రెండురోజుల శిక్షణ ‘పీజీఎస్’పై రెండు రోజుల శిక్షణ, 30 రోజుల సర్టిఫికెట్ కోర్సు, అలాగే 500 మందితో ఒక రోజుపాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ సమ్మేళనం, 100 మందితో ఒకరోజు భాగస్వామ్య సంప్రదింపులు/సదస్సులు, ప్రకృతి వ్యవసాయంపై దేశవ్యాప్తంగా అవగాహన, పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించింది. ఇవే కాకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ/జీవ ఎరువుల వాడకంపై ఆన్‌లైన్ అవగాహన-శిక్షణ కార్యక్రమాలను కూడా ‘ఎన్‌సిఒఎన్‌ఎఫ్, ఆర్‌సిఒఎన్‌ఎఫ్’ నిర్వహిస్తున్నాయి.
మరోవైపు ‘ఐసిఎఆర్’ కూడా సేంద్రియ వ్యవసాయం/ఎరువులపై రైతులకు అవగాహన-శిక్షణ, కీలక ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు తదితరాలను నిర్వహిస్తోంది.
సేంద్రియ వ్యవసాయం కింద 2022-23లో పథకాల (పికెవివై, ఎంఒవిసిడిఎన్‌ఇఆర్) వారీ, రాష్ట్రాలవారీగా నిధుల కేటాయింపు, విడుదల, వ్యయం వివరాలిలా ఉన్నాయి:
వ.సం.
|
రాష్ట్రం
|
2022-23
|
కేటాయింపు
|
విడుదల
|
వ్యయం*
|
పికెవివై
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
826.35
|
0.00
|
0.00
|
2
|
బీహార్
|
2830.65
|
1547.68
|
789.75
|
3
|
ఛత్తీస్‌గఢ్
|
3504.93
|
0.00
|
571.03
|
4
|
గుజరాత్
|
20.50
|
0.00
|
0.00
|
5
|
గోవా
|
1025.10
|
0.00
|
283.05
|
6
|
హర్యానా
|
10.25
|
0.00
|
0.00
|
7
|
జార్ఖండ్
|
1397.27
|
0.00
|
0.00
|
8
|
కర్ణాటక
|
1045.61
|
512.55
|
256.35
|
9
|
కేరళ
|
1971.12
|
1712.07
|
647.52
|
10
|
మధ్యప్రదేశ్
|
5925.51
|
0.00
|
1375.93
|
11
|
మహారాష్ట్ర
|
745.90
|
449.67
|
776.74
|
12
|
ఒడిశా
|
741.44
|
370.72
|
311.97
|
13
|
పంజాబ్
|
222.46
|
0.00
|
0.00
|
14
|
రాజస్థాన్
|
2452.64
|
1783.26
|
3363.94
|
15
|
తమిళనాడు
|
704.87
|
0.00
|
170.56
|
16
|
తెలంగాణ
|
30.75
|
0.00
|
0.00
|
17
|
ఉత్తర ప్రదేశ్
|
12972.55
|
5089.32
|
2111.16
|
18
|
పశ్చిమ బెంగాల్
|
555.39
|
555.39
|
240.41
|
19
|
ఈశాన్య(ఆకాంక్షాత్మక-నిబద్ధ బాధ్యత)
|
0.00
|
0.00
|
7.58
|
20
|
హిమాచల్ ప్రదేశ్
|
1121.36
|
0.00
|
1124.32
|
21
|
ఉత్తరాఖండ్
|
6030.68
|
5969.00
|
7652.94
|
22
|
కేంద్రపాలిత ప్రాంతాలు
|
893.02
|
193.55
|
0.00
|
|
మొత్తం
|
45028.35
|
18183.20
|
19683.25
|
ఎంఒవిసిడిఎన్‌ఇఆర్
|
వ.సం.
|
రాష్ట్రం
|
2022-23
|
కేటాయింపు
|
విడుదల
|
వ్యయం*
|
1
|
అస్సాం
|
2681.80
|
2059.15
|
2059.15
|
2
|
మణిపూర్
|
2915.37
|
2915.36
|
2815.36
|
3
|
మేఘాలయ
|
2011.88
|
621.57
|
524.33
|
4
|
నాగాలాండ్
|
1961.01
|
1390.60
|
1289.60
|
5
|
మిజోరం
|
1604.25
|
1140.90
|
876.63
|
6
|
అరుణాచల్ ప్రదేశ్
|
1860.77
|
1642.17
|
1526.26
|
7
|
సిక్కిం
|
4005.10
|
1538.83
|
1398.25
|
8
|
త్రిపుర
|
2759.82
|
3000.26
|
|
*****
(Release ID: 1946983)
Visitor Counter : 182