వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ రంగంలో సమాచార సాంకేతికత

Posted On: 08 AUG 2023 6:39PM by PIB Hyderabad

వ్యవసాయ విలువ వ్యవస్థలో సమాచార సాంకేతికతల వినియోగం పెరుగుతోంది. రైతులు మరింత సమాచారం పొందుతున్నారు. వివిధ డిజిటల్ యత్నాల ద్వారా దేశవ్యాప్తంగా సాంకేతికత మరియు సమాచారానికి ప్రాప్యతను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అవి:

 

నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్లాన్ ఇన్ అగ్రికల్చర్ (NeGP-A), దీనిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ప్రాజెక్ట్ కోసం రాష్ట్రం(లు)/యూ టీ (లు)కి నిధులు అందించబడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( కృత్రిమ మేధ) మెషిన్ లెర్నింగ్ (యంత్ర శిక్షణ) రోబోటిక్స్, డ్రోన్స్, డేటా అనలిటిక్స్, బ్లాక్ చైన్ మొదలైనవి. రాష్ట్రాల నుండి ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత, వివిధ పరిష్కారాల అభివృద్ధికి నిధులు విడుదల చేయబడతాయి.

పంట ప్రణాళిక మరియు ఆరోగ్యం, వ్యవసాయ ఇన్‌పుట్‌లకు మెరుగైన ప్రాప్యత, సంబంధిత సమాచార సేవల ద్వారా రైతు కేంద్రీకృత పరిష్కారాలను ప్రారంభించడానికి ఓపెన్ సోర్స్, ఓపెన్ స్టాండర్డ్ మరియు ఇంటర్-ఆపరేబుల్ పబ్లిక్ గుడ్‌గా వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  అభివృద్ధి కోసం రుణం మరియు బీమా, పంట అంచనాకు సహాయం, మార్కెట్ ఇంటెలిజెన్స్ మొదలైన పలు కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో, ఇప్పటివరకు ఈ క్రింది చర్యలు తీసుకోబడ్డాయి:

మూడు కోర్ రిజిస్ట్రీల ఆర్కిటెక్చర్ అంటే రైతు రిజిస్ట్రీ, గ్రామ మ్యాప్ రిజిస్ట్రీ యొక్క జియో రిఫరెన్సింగ్, విత్తిన పంట రిజిస్ట్రీ ఖరారు చేయబడ్డాయి.

విత్తిన పంట రిజిస్ట్రీని రూపొందించడానికి, ఖరీఫ్ 2023 నుండి 12 రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన డిజిటల్ పంట సర్వే ప్రారంభించబడింది.

పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎంఓయూ కుదిరింది. పైలట్ ప్రాతిపదికన ఎంచుకున్న ప్రాంతాలపై పంట గుర్తింపు మరియు మ్యాపింగ్, పంట ఆరోగ్య పర్యవేక్షణ మరియు నేల సేంద్రీయ కార్బన్ అంచనా కోసం పిక్సెల్ యొక్క హైపర్‌స్పెక్ట్రల్ డేటాతో వినియోగ కేసులను అభివృద్ధి చేయడానికి పరిమితం చేయబడింది.

వ్యవసాయ యాంత్రీకరణపై సబ్ మిషన్ ఏప్రిల్, 2014 నుండి అమలు చేయబడుతోంది. 'కస్టమ్ హైరింగ్ సెంటర్‌లను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ ప్రయోజనాలను  కోర్‌లోని చిన్న మరియు సన్నకారు రైతులకు అందించడం ద్వారా చేరువకాని వారిని చేరుకోవడం' ఈ పథకం లక్ష్యం. హైటెక్ మరియు అధిక విలువ గల వ్యవసాయ పరికరాల కోసం హబ్‌లను సృష్టించడం, వివిధ వ్యవసాయ పరికరాల పంపిణీ, ప్రదర్శన మరియు సామర్థ్య నిర్మాణ కార్యకలాపాల ద్వారా వాటాదారులకు అవగాహన కల్పించడం మరియు దేశవ్యాప్తంగా ఉన్న నిర్దేశిత పరీక్షా కేంద్రాలలో పనితీరు-పరీక్ష మరియు ధృవీకరణను నిర్ధారించడం వీటి కార్యకలాపాలు.

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్  అనేది దేశవ్యాప్త ఎలక్ట్రానిక్ వాణిజ్య పోర్టల్, ఇది వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టించడానికి ప్రస్తుత వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ మండీలను అనుసంధానం చేస్తుంది. ఎఫ్‌పిఓ ట్రేడింగ్ మాడ్యూల్, వేర్‌హౌస్ ఆధారిత ట్రేడింగ్ మాడ్యూల్ వంటి ఇ-నామ్ ప్లాట్‌ఫారమ్‌లోని వివిధ మాడ్యూల్స్ ద్వారా వ్యాపారులు, రైతులు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పిఓ), మాండీలకు డిజిటల్ సేవలు అందించబడతాయి.

 

పీ ఎం  కిసాన్ పథకం కింద, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మోడ్‌లో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేయబడతాయి. పోర్టల్‌లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా రైతులు తమ స్వీయ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిఎం-కిసాన్ మొబైల్ యాప్‌ రైతులకు సాంకేతికను విస్తృతం చేయడానికి ప్రారంభించబడింది, ఇక్కడ రైతులు లబ్ధిదారులు తమ స్థితిని వీక్షించవచ్చు, వారి ఆధార్ కార్డ్ ఆధారంగా పేరును మార్చుకోవచ్చు, నవీకరించవచ్చు లేదా సవరణలు చేయవచ్చు మరియు వారు తమ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడిన ప్రయోజనాల నిధుల చరిత్రను కూడా చూడవచ్చు. ఇటీవల, పీ ఎం  కిసాన్ పథకం మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ( ముఖ గుర్తింపు) ఫీచర్ కూడా చేర్చబడింది.

అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF): దేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రోత్సాహకాలు మరియు  పంటకోత అనంతర నిర్వహణ మౌలిక సదుపాయాలు మరియు కమ్యూనిటీ ఫార్మింగ్ ఆస్తుల ఆర్థిక సహాయం ద్వారా ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడి కోసం మధ్యస్థ - దీర్ఘకాలిక రుణ ఆర్థిక సౌకర్యాన్ని సమీకరించడం కోసం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటయ్యింది. రైతులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), స్వయం సహాయక బృందాలు (SHG) రాష్ట్ర ఏజెన్సీలు/ ఏ పీ ఎం సీ లు వంటి లబ్ధిదారులకు పంట అనంతర నిర్వహణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి వడ్డీ రాయితీ మరియు క్రెడిట్ గ్యారెంటీ రూపంలో ఆర్థిక సహాయం డిజిటల్‌గా అందించబడుతుంది. 

ఉద్యానవనంపై జాతీయ మిషన్: ఇది హార్టికల్చర్ రంగం (వెదురు & కొబ్బరితో సహా) సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది  హార్నెట్ (HORTNET) ప్రాజెక్ట్ ఎం ఐ డి హెచ్ (MIDH) కింద ఆర్థిక సహాయం అందించడానికి వెబ్ ఎనేబుల్డ్ వర్క్ ఫ్లో-ఆధారిత వ్యవస్థ. ఎన్ హెచ్ ఎం (NHM) లో ఇ-గవర్నెన్స్‌ని సాధించడానికి ఇది ఒక ప్రత్యేకమైన జోక్యం, వర్క్‌ఫ్లో యొక్క అన్ని ప్రక్రియలలో మొత్తం పారదర్శకత ఉంది, అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫైల్ చేయడం, ప్రామాణీకరణ, ప్రాసెసింగ్ మరియు డీ బీ టీ (DBT) ద్వారా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ చెల్లింపు.

నేల ఆరోగ్యం మరియు దిగుబడి జాతీయ ప్రాజెక్ట్:-దేశంలోని రైతులకు నేల ఆరోగ్య కార్డుల జారీ, తద్వారా ఫలదీకరణ పద్ధతుల్లో పోషక లోపాలను పరిష్కరించడానికి ఒక సాంకేతిక ఆవిష్కరణ బలాన్ని అందించడం. భూ ఆరోగ్య కార్డ్ (సాయిల్ హెల్త్ కార్డ్ ) పోర్టల్ అందుబాటులో ఉంది, ఇక్కడ రైతులు మట్టి నమూనాల స్థితి ని, నేల ఆరోగ్య స్థితిని ట్రాక్ చేయవచ్చు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద అనేక కొత్త సాంకేతిక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి, అవి సాంకేతికత (ఎస్-టెక్), వాతావరణ సమాచార నెట్‌వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్) పోర్టల్ మరియు ఇంటింటికి చేరే యాప్ ఏ ఐ డి ఈ / సహాయక్ (AIDE/Sahayak) ఆధారంగా దిగుబడి అంచనా వ్యవస్థ.

ఎస్-టెక్ (YES-TECH) సాంకేతికతతో నడిచే దిగుబడి అంచనా వ్యవస్థ, గ్రామ పంచాయతీ స్థాయిలో ఖచ్చితమైన దిగుబడి అంచనాల కోసం విధానాలు, ఉత్తమ పద్ధతులు మరియు సమగ్రత అంతర్దృష్టులను అందిస్తోంది.

విండ్స్ (WINDS) పోర్టల్ అనేది తాలూకా/బ్లాక్ మరియు గ్రామ పంచాయతీ స్థాయిలలో ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లు మరియు వర్షం గేజ్‌ల ద్వారా సేకరించిన స్థానిక వాతావరణ డేటాను హోస్ట్ చేసే, నిర్వహించే మరియు ప్రాసెస్ చేసే కేంద్రీకృత ప్లాట్‌ఫారమ్. ఈ పోర్టల్ పంటల బీమా, వ్యవసాయ సలహాలు మరియు విపత్తు ఉపశమనాలలో ప్రమాద అంచనా మరియు నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది, వ్యవసాయ రంగం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

ఏ ఐ డి ఈ (AIDE) యాప్ నమోదు ప్రక్రియను విప్లవాత్మకంగా మార్చడం, నేరుగా రైతుల ఇంటి వద్దకే తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇంటింటి నమోదు సంపూర్ణ మరియు పారదర్శక ప్రక్రియను నిర్ధారిస్తుంది, ఇది రైతులకు పంట బీమాను మరింత అందుబాటులోకితెస్తూ మరియు సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR)  ఐకర్ (ICAR) రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు అభివృద్ధి చేసిన 100 కంటే ఎక్కువ మొబైల్ యాప్‌లు పంటలు, తోటల పెంపకం, పశు, పాడి, కోళ్లు, చేపలు, ప్రకృతి వనరుల నిర్వహణ  మరియు ఇంటిగ్రేటెడ్ సబ్జెక్టులు వంటి పలు అంశాలపై అభివృద్ధి సంకలనం చేసి తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ మొబైల్ యాప్‌లు రైతులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తాయి, వీటిలో పద్ధతుల ప్యాకేజీ, వివిధ వస్తువుల మార్కెట్ ధరలు, వాతావరణ సంబంధిత సమాచారం, సలహాలు,సేవలు మొదలైనవి ఉన్నాయి. 

ఇంకా, ఐకర్ (ICAR) "కిసాన్ సారథి" పేరుతో డిజిటల్ మల్టీమీడియా ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది, ఇది దేశవ్యాప్తంగా 731 కే వీ కే ల ద్వారా రైతులకు సలహాలను అందించడానికి ఉపయోగించబడుతుంది.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.

 

***



(Release ID: 1946978) Visitor Counter : 179


Read this release in: English , Urdu