సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కళ మరియు సంస్కృతి యొక్క ప్రచారం మరియు పరిరక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని పెంచడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన వివిధ పథకాల ద్వారా స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇస్తుంది.

Posted On: 07 AUG 2023 4:57PM by PIB Hyderabad

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అన్ని రకాల కళలు మరియు సంస్కృతి యొక్క మొత్తం ప్రచారంలో పాల్గొనడానికి వివిధ పథకాల ద్వారా ప్రభుత్వేతర సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలకు మద్దతునిస్తోంది. అన్ని రకాల కళలు మరియు సంస్కృతిని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రచారం చేయడంతో సహా ఆ కళ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మంత్రిత్వ శాఖలో తగినంత నిధులు అందుబాటులో ఉన్నాయి.

ఎన్జీవోల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి.. ఈ పథకాల మార్గదర్శకాలు మరియు దరఖాస్తు ఫారమ్‌లు మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి. మంత్రిత్వ శాఖ మరియు సంబంధిత నోడల్ ఏజెన్సీకి చెందిన వివిధ వార్తాపత్రికలు, అధికారిక వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ స్కీమ్‌ల క్రింద దరఖాస్తులను కోరుకునే ప్రకటనలకు విస్తృత ప్రచారం కూడా ఇవ్వబడుతుంది.

గురు-శిష్య పరంపర ప్రమోషన్ కోసం ఆర్థిక సహాయం - ఈ పథకం యొక్క లక్ష్యం.  నాటక బృందాలు, థియేటర్ గ్రూపులు, సంగీత బృందాలు, పిల్లల థియేటర్ మొదలైన అన్ని రకాల ప్రదర్శన కళల కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం మరియు గురు-శిష్య పరంపరకు అనుగుణంగా క్రమం తప్పకుండా సంబంధిత గురువులతో కళాకారులకు శిక్షణ ఇవ్వడం వంటివి ఈ పథకంలోభాగంగా చేపడతారు.   పథకం మార్గదర్శకాల ప్రకారం..  నాటక రంగంలో 1 గురువు మరియు గరిష్టంగా 18 మంది శిష్యులకు మరియు సంగీతం & నృత్య రంగంలో 1 గురు మరియు గరిష్టంగా 10 మంది శిష్యులకు మద్దతు అందించబడుతుంది.

జాతీయ స్థాయిలో సాంస్కృతిక సంస్థలకు ఆర్థిక సహాయం - జాతీయస్థాయిని కలిగి ఉన్న ప్రసిద్ధ సాంస్కృతిక సంస్థలకు (లాభాపేక్ష లేని సంస్థలు, ఎన్జీవోలు, సొసైటీలు, ట్రస్ట్‌లు, విశ్వవిద్యాలయాలు మొదలైనవి) ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం.
దేశంయొక్క కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా దేశ  కళను,  సంస్కృతిని వ్యాప్తి చేయడం మరియు ప్రచారం చేయడం.  నిబంధనల ప్రకారం ఏర్పాటైన మేనేజింగ్ బాడీని కలిగి ఉండి, భారతదేశంలో రిజిస్టర్ చేయబడి, దాని  జాతీయస్థాయిలో  ఉనికిని  కలిగి ఉండి, తగిన పని బలంతో మరియు సాంస్కృతిక కార్యక్రమాలపై గత 5 సంవత్సరాల్లో ఏదైనా 3 సంవత్సరాల్లో  కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసిన సంస్థలకు ఈ గ్రాంట్  అందజేస్తారు.

కల్చరల్ ఫంక్షన్ & ప్రొడక్షన్ గ్రాంట్ (సీఎఫ్పీజీ)- సెమినార్లు, కాన్ఫరెన్స్, రీసెర్చ్, వర్క్‌షాప్‌లు, ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్‌లు, సింపోసియా, డ్యాన్స్,  డ్రామా, థియేటర్, సంగీతం మొదలైనవాటి కోసం ఎన్జీవోలు/సొసైటీలు/ట్రస్ట్‌లు/యూనివర్శిటీలు  మొదలైన వాటికి ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం  యొక్క లక్ష్యం. -కల్చరల్ ఫంక్షన్ & ప్రొడక్షన్ గ్రాంట్ (సీఎఫ్పీజీ)-  కింద అందించబడిన గరిష్ట గ్రాంట్ రూ.5 లక్షలు.  అసాధారణ పరిస్థితుల్లో దీనిని రూ.20 లక్షలకు పెంచవచ్చు.

హిమాలయాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం & అభివృద్ధి చేయడం కోసం ఆర్థిక సహాయం- ఆడియో విజువల్ ప్రోగ్రామ్‌ల ద్వారా పరిశోధన, శిక్షణ మరియు వ్యాప్తి ద్వారా హిమాలయాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం మరియు సంరక్షించడం ఈ పథకంయొక్క లక్ష్యం. హిమాలయ ప్రాంతంలోని జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలలోని సంస్థలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. నిధుల పరిమాణం  ఒక సంస్థకు సంవత్సరానికి రూ.10.00 లక్షలు,అసాధారణమైన సందర్భాల్లో  దీనిని పెంచవచ్చు రూ.30.00 లక్షలకు పెంచవచ్చు.

బౌద్ధ/టిబెటన్ సంస్థ పరిరక్షణ & అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం కోసం- ఈ పథకం కింద బౌద్ధ/టిబెటన్ సాంస్కృతిక మరియు సంప్రదాయం మరియు సంబంధిత రంగాలలో పరిశోధన యొక్క ప్రచారం మరియు శాస్త్రీయ అభివృద్ధిలో నిమగ్నమైన మఠాలతో సహా స్వచ్ఛంద బౌద్ధ/టిబెటన్ సంస్థలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. పథకం  కింద నిధుల పరిమాణం సంవత్సరానికి 30.00 లక్షలు. అసాధారణ పరిస్థితుల్లో  కోటి రూపాయలకు పెంచొచ్చు.

స్టూడియో థియేటర్‌లతో సహా బిల్డింగ్ గ్రాంట్‌ల కోసం ఆర్థిక సహాయం అందజేయడం- ఈ పథకం యొక్క లక్ష్యం.  ఎన్జీవోలు, ట్రస్టులు, సొసైటీలు, ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాల మొదలైన వాటికి  సాంస్కృతిక మౌలిక సదుపాయాల కల్పన మరియు విద్యుత్, ఎయిర్ కండిషనింగ్, ధ్వని, కాంతి మరియు సౌండ్ సిస్టమ్స్ వంటి సౌకర్యాల ఏర్పాటు కోసం ఆర్థికసాయం అందించడం. ఈ పథకం కింద, మెట్రో నగరాల్లో గరిష్టంగా రూ.50 లక్షల వరకు గ్రాంట్ ఇవ్వబడుతుంది. నగరాలు మరియు మెట్రోయేతర నగరాల్లో రూ.25 లక్షల వరకు గ్రాంట్ అందజేస్తారు.

ఈ రోజు లోక్‌సభలో ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక మరియు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ సమాధానం ఇచ్చారు.

***


(Release ID: 1946901) Visitor Counter : 114


Read this release in: English , Urdu