సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల వాడకం తగ్గించడానికి చర్యలు
Posted On:
08 AUG 2023 5:10PM by PIB Hyderabad
ఆధ్యాత్మికత , సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పెద్ద సంఖ్యలో సభ్యులు కలిగి ఉన్న ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత విభాగం అమలు చేస్తోంది. తమ సంస్థల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు స్వస్తి చెప్పండి నినాదాన్ని ప్రచారం చేయాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత విభాగం కోరింది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని పాఠశాల/కళాశాల/విద్యాసంస్థల్లో యువతకు సందేశం ఇవ్వాలని సంస్థలను మంత్రిత్వ శాఖ కోరింది. తమ సభ్యుల సహాయంతో కార్యక్రమాలు, ఉపన్యాసాలు నిర్వహించి మాదకద్రవ్య వినియోగానికి వ్యతిరేకంగా సందేశాన్ని వ్యాప్తి చేయడం, ప్రాజెక్టు అమలు జరుగుతున్న ప్రాంతాలలో ర్యాలీలు, సెమినార్లు, వర్క్షాప్లుఇతర కార్యక్రమాలు నిర్వహించాలని సంస్థలను మంత్రిత్వ శాఖ కోరింది. మత/ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో యువత, మహిళలు, స్వయం సహాయక బృందాలు నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద కార్యక్రమాలు చేపట్టాలని నాయకత్వం వహించిన చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. యువత, మహిళలు, విద్యార్థులు, విద్యాసంస్థలు మొదలైన వారితో నిషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ బ్రహ్మ కుమారీలు, సంత్ నిరంకారీ మండల్ , ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణస్వామి ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో .ఈ సమాచారాన్ని అందించారు
(Release ID: 1946865)
Visitor Counter : 182