సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన స్వయంప్రతిపత్త సంస్థల ద్వారా దేశంలో కళ, సాహిత్యం మరియు క్రాఫ్ట్‌లను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది.
సాహిత్య అకాడమీ 24 భాషల్లో 7000 పుస్తకాలను ప్రచురించింది
प्रविष्टि तिथि:
07 AUG 2023 4:56PM by PIB Hyderabad
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన స్వయంప్రతిపత్త సంస్థల ద్వారా దేశంలో కళ, సాహిత్యం మరియు క్రాఫ్ట్‌లను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాహిత్య అకాడమీ 24 భాషల్లో 7000 పుస్తకాలను ప్రచురించింది. ప్రతి సంవత్సరం అకాడమీ ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో అనేక సెమినార్లను నిర్వహిస్తుంది. కల్చరల్ ఎక్స్ఛేంజ్ అని పిలవబడే కార్యక్రమాల శ్రేణిని అకాడమీ కలిగి ఉంది. అంతేకాకుండా యువ రచయితలకు ట్రావెల్ గ్రాంట్‌లను కూడా అందజేస్తుంది. ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్-యూఎన్ఎంఈఎస్హెచ్ఏను నిర్వహిస్తుంది.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లలిత కళా అకాడమీ ఆర్ట్ క్యాంపులు, వర్క్‌షాప్‌లు, ఎగ్జిబిషన్‌లు, నేషనల్ పెయింటింగ్ వర్క్‌షాప్‌లు మరియు మెగా ఎగ్జిబిషన్ వంటి కళా ఉత్సవాలను నిర్వహిస్తుంది. సంగీత నాటక అకాడమీ దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. ప్రదర్శన కళలలో పరిశోధన, డాక్యుమెంటేషన్ మరియు ప్రచురణ కోసం గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందిస్తుంది. సబ్జెక్ట్ స్పెషలిస్ట్‌ల సెమినార్‌లు మరియు కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తుంది మరియు సబ్సిడీ కూడా ఇస్తుంది. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్టీ) వివిధ శిక్షణా కార్యక్రమాలను రూపొందించింది. ఇందులో వివిధ థీమాటిక్ వర్క్‌షాప్‌లు భారతీయ సాక్షాత్కార మరియు అవ్యక్త సాంస్కృతిక వారసత్వం, సాహిత్య వారసత్వం, జానపద/గిరిజన కళ మరియు సంస్కృతి మరియు క్రాఫ్ట్ సంప్రదాయాల ప్రచారం మరియు పరిరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తున్నాయి.
చెన్నైకి చెందిన కళాక్షేత్ర ఫౌండేషన్.. వుడ్ బ్లాక్- ప్రింటింగ్, కలంకారి పెయింటింగ్ మరియు నేచురల్ డైయింగ్‌లో వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ సీఈఆర్సీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కళాక్షేత్ర ఫౌండేషన్ తక్కువ- ఆదాయ వర్గాలకు చెందిన మహిళలకు కలంకారి కళలో శిక్షణనిచ్చింది. మంత్రిత్వ శాఖ తన అకాడమీల ద్వారా కళాకారులకు అవార్డులు మరియు స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది మరియు ప్రదర్శన కళలు, జానపద కళలు, గిరిజన కళల యొక్క వివిధ శైలుల నుండి కళాకారులను ప్రదర్శన కోసం ఆహ్వానిస్తుంది.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దాని స్వయంప్రతిపత్త సంస్థల ద్వారా ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో పండుగలు, ఉత్సవాలు మరియు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సంఘటనలు సాంప్రదాయక కళారూపాలు, సంగీతం, నృత్యం, చేతిపనులు మరియు ఇతర సాంస్కృతిక వ్యక్తీకరణలను ప్రదర్శిస్తాయి. సాంప్రదాయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మరియు వైవిధ్యాన్ని దృష్టిని ఆకర్షిస్తాయి. అకాడమీలు ఆర్కైవ్‌ల రిపోజిటరీని కూడా నిర్వహిస్తాయి. అంతేకాకుండా మన సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడంలో క్రమం తప్పకుండా నిమగ్నమై ఉంటాయి. సాంప్రదాయ సంస్కృతిని అవలంబించడానికి దేశంలోని ప్రజలలో అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ శిక్షణ మరియు వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక ఔట్రీచ్ కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కూడా నిర్వహిస్తుంది.
ఈ రోజు లోక్‌సభలో ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక మరియు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ సమాధానం ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 1946847)
आगंतुक पटल : 106