సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

రెండు జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాలను అమలు చేస్తున్న సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ

Posted On: 08 AUG 2023 5:11PM by PIB Hyderabad

 రెండు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ (NOS) పథకాలను సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలుడి నోటిఫైడ్ సంచార, సెమీ సంచార తెగలుభూమిలేని వ్యవసాయ కార్మికులు, సాంప్రదాయ కళాకారుల కోసం సామాజిక న్యాయంసాధికారత విభాగం ఒక పధకాన్ని అమలు చేస్తోంది. అంగ  వైకల్యం కలిగిన విద్యార్థుల కోసం మరో పధకాన్ని  వికలాంగుల సాధికారత విభాగం  అమలు చేస్తుంది.

 

పథకాల కింద అభ్యర్థుల ఎంపిక కోసం అమలు జరుగుతున్న ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి:

(i).  షెడ్యూల్డ్ కులాల కోసం  నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్   మొదలైనవి:

మొదటి 500 క్యూఎస్ ర్యాంక్ పొందిన విదేశీ సంస్థలు/విశ్వవిద్యాలయాలు ప్రవేశానికి షరతులు లేకుండా అందించే అవకాశం ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.  అర్హత పరీక్షలో కనీసం 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ అవసరం. ఇంకాఅన్ని మూలాల నుంచి  అభ్యర్థితో సహా మొత్తం కుటుంబ ఆదాయం మునుపటి ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి  రూ.   8.00 లక్షలు మించకూడదు.  ఎంపిక సంవత్సరం ఏప్రిల్ మొదటి రోజు నాటికి అభ్యర్థి వయస్సు 35 (ముప్పై ఐదు) సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

 

(ii) వైకల్యాలున్న విద్యార్థుల కోసం  నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్  :

పీహెచ్ డీ  కోసం ఫస్ట్ క్లాస్ లేదా 55% (యాభై ఐదు శాతం) మార్కులు లేదా సంబంధిత మాస్టర్స్ డిగ్రీ లో సమానమైన గ్రేడ్ అవసరం.  అదేవిధంగా,  మాస్టర్స్ డిగ్రీ కి 55% (యాభై ఐదు శాతం) మార్కులు లేదా సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ లో సమానమైన గ్రేడ్ అవసరం.  దరఖాస్తు చేసిన సంవత్సరం జనవరి నాటికి అభ్యర్థి వయస్సు  35 (ముప్పై-ఐదు) సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.  తల్లిదండ్రులు/సంరక్షకులు ఆదాయం సంవత్సరానికి రూ.8.00 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.

రెండు పథకాల ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంది:

           i.    షెడ్యూల్డ్ కులాల కోసం  నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్   మొదలైనవి:

 ఫిబ్రవరి మధ్య నుండి మార్చి చివరి వరకు (45 రోజుల వ్యవధిలో) మొదటి రౌండ్‌కు దరఖాస్తుల కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పోర్టల్ ( https://nosmsje.gov.in )  ప్రతి సంవత్సరం అందుబాటులో ఉంటుంది.  ఈ పథకం కింద స్కాలర్‌షిప్ పొందేందుకు అభ్యర్థులు  నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్‌షిప్ అవార్డు కోసం పూర్తి , చెల్లుబాటు అయ్యే ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తారు.  పరిశీలన తర్వాత అర్హులైన అభ్యర్థులందరి దరఖాస్తులు ఎంపిక కోసం వారి సిఫార్సులను చేయడానికి, , స్కాలర్‌షిప్ కోసం 125 మంది అభ్యర్థుల ర్యాంకింగ్‌ను నిర్ణయించడానికి ఎంపిక-కమ్-స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచుతారు. . అభ్యర్థుల ర్యాంకింగ్ అతను/ఆమె ప్రవేశం కోరిన సంస్థ /విశ్వవిద్యాలయం పొందిన క్యూఎస్ ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.  ఎంపిక చేసిన అభ్యర్థులకు తాత్కాలిక స్కాలర్‌షిప్ లేఖలు జారీ అవుతాయి. 

 

(ii) వైకల్యాలున్న విద్యార్థుల కోసం  నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్  :

 పథకం కింద దరఖాస్తులు ఏడాది పొడవునా ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తారు.  దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తులను  సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది.  ఉంచబడతాయి. సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థులకు  స్కాలర్‌షిప్ పత్రాలు జారీ చేస్తారు.

 రెండు పథకాల కింద అభ్యర్థికి చెల్లించే స్కాలర్‌షిప్ మొత్తం/ ఇతర ఖర్చులు (రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన) మొదలైన వాటిని విదేశాంగ మంత్రిత్వ శాఖ  విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ల ద్వారా విడుదల అవుతాయి.  విదేశాంగ మంత్రిత్వ శాఖకు  సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నిధులు విడుదల చేస్తుంది.  జాతీయ స్కాలర్‌షిప్ పొందిన  విద్యార్థికి సంబంధించి సంబంధిత భారతీయ రాయబార కార్యాలయం ద్వారా అండ్ సమాచారం మేరకు విదేశాంగ శాఖకు   నిధులు విడుదల అవుతాయి. 

 

రెండు శాఖల జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాలు కేంద్ర రంగ పథకాలు కాబట్టి  రాష్ట్రాల వారీ, జిల్లాల వారీగా పంపిణీ చేయడం లేదు. గత మూడు సంవత్సరాలుగా పథకాల కింద లబ్ధి పొందిన అభ్యర్థుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది:

సంవత్సరం

డిఓఎస్ జెఈ 

డి ఓ పిడబ్ల్యుడి 

లబ్ధిదారుల సంఖ్య

లబ్ధిదారుల సంఖ్య

2020-21

100

6

2021-22

125

11

2022-23

125

17

 

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణస్వామి ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు

 

***



(Release ID: 1946846) Visitor Counter : 123


Read this release in: English , Urdu