సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవగాహన కార్యక్రమాలు

प्रविष्टि तिथि: 08 AUG 2023 5:13PM by PIB Hyderabad

నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తున్న పథకాలు ప్రచారం చేయడానికి , పారిశుధ్య కార్మికులు, వ్యర్థాలను ఏరుకుని జీవిస్తున్న వారు, వీధులు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నవారు మరియు వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి సంస్థ అమలు చేస్తున్న వివిధ పథకాలపై  అవగాహన కల్పించడానికి , నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్   కింది కార్యక్రమాలనుఅమలు చేస్తోంది. 

 

ఎ .  అవగాహన శిబిరాలు: -  నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తున్న   పథకాల గురించి లక్ష్య బృందానికి అవగాహన కల్పించడానికి,పథకాల  ప్రయోజనాలు పొందేలా వారిని ప్రోత్సహించడానికి  అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అవగాహన శిబిరాలను నిర్వహించడం కోసం ప్రతి అవగాహన శిబిరానికి రూ.30,000/- వరకు నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చెల్లిస్తోంది. 

బి. రుణ మేళాలు:   వివిధ పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రుణ మేళాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పధకాన్ని అమలు చేసే సంస్థలు కూడా కార్యక్రమంలో పాల్గొంటాయి.   నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తున్న పథకాల కింద రుణం పొందడానికి గల అవకాశాలు, రుణ ప్రక్రియ తదితర అంశాలను గుర్తించిన లబ్ధిదారులకు రుణ మేళాల్లో వివరిస్తారు.  

సి  వర్క్‌షాప్‌లు: - ఎంఎస్  చట్టం, 2013  నిబంధనలు, సిబ్బంది శుభ్రం చేసే పనుల వల్ల జరిగే ప్రమాదాలు తగ్గించడానికి,  ప్రమాదకర సంఘటనలు నిరోధించే అంశాలపై  అవగాహన కల్పించడానికి  నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్   వివిధ మునిసిపాలిటీలలో అవగాహన కార్యక్రమాలు,  వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది.

డి. . ప్రీయర్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (RPL) :-  యాంత్రికమెరుగైన, సురక్షితమైన పారిశుద్ధ్య పద్ధతులపై సిబ్బందికి అవగాహన కల్పించడానికి  నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గుర్తించిన  లక్ష్య సమూహానికి  5 రోజుల శిక్షణ కార్యక్రమాలు   నిర్వహిస్తోంది.

 

పైన పేర్కొన్న అంశాలతో పాటు వివిధ  పథకాలపై అవగాహన కల్పించడానికి  క్రింది కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

·      కేంద్ర  సామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఆకాశవాణిలో సావర్తి జయయీన్ జీవన్ కి రాహెన్” కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. 

 

·      శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాల వివరాలతో  కరపత్రాలు/బ్రోచర్‌ల పంపిణీ.

·      శిక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకునే విధంగా సిబ్బందిని ప్రోత్సహించడానికి బస్తీలు/నివాస ప్రాంతంలో శిబిరాలు నిర్వహించి   అవగాహన కల్పించడం.

·      మంత్రిత్వ శాఖ, కార్పొరేషన్  సోషల్ మీడియా హ్యాండిల్ , ప్రింట్ మీడియా ద్వారా సమాచారం/సృజనాత్మక వ్యాప్తి.

కార్యక్రమాలు  అమలు చేస్తున్న సంస్థలు స్వయంగా  వార్తాపత్రికలలో ప్రకటనలుకరపత్రాలు, నోటీసు బోర్డులో నోటీసుల ద్వారా కార్పొరేషన్ పథకాల గురించి అవగాహన కల్పిస్తున్నాయి. 

గత సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరంలో వివిధ అవగాహన  కార్యక్రమాల కింద సాధించిన పురోగతి క్రింది విధంగా ఉంది: -

స.నెం.

విశేషాలు

సంఖ్యలు

1.

ఆరోగ్యం-అవగాహన శిబిరాలు

294

2.

రుణ మేళాలు

43

3.

వర్క్‌షాప్‌లు

1177

4.

ప్రియర్ లెర్నింగ్ (RPL) గుర్తింపు

(అభ్యర్థుల సంఖ్య)

50118

 

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణస్వామి ఈరోజు లోక్‌సభలో ఒక ప్రసన్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు అందించారు.

 

***


(रिलीज़ आईडी: 1946841) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu