కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమ్మకాలపై ఇస్తున్న ప్రోత్సాహకాలను ప్రత్యక్ష పద్ధతిలో చెల్లించే విధానాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పిఎల్ఐ)

Posted On: 07 AUG 2023 7:36PM by PIB Hyderabad

ప్రజలకు బీమా రంగంలో 1884 నుంచి సేవలు అందిస్తూ బీమా రంగంలో తనకంటూ విశిష్ట గుర్తింపు పొందిన లైఫ్ ఇన్సూరెన్స్ (పిఎల్ఐ) మరో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. సంస్థ అభివృద్ధిలో అమ్మకాల విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది పాత కీలకంగా ఉంటుంది. దీనిని గుర్తించిన పిఎల్ఐ సిబ్బందికి అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రత్యక్ష విధానంలో చెల్లించే విధానాన్ని ప్రారంభించింది. ఢిల్లీ , ఉత్తరాఖండ్ సర్కిల్‌లలో "డైరెక్ట్ ఇన్సెంటివ్ డిస్బర్స్‌మెంట్" విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 

పిఎల్ఐ అభివృద్ధి, సాధించిన విజయాలలో అమ్మకాల విభాగం మూలస్తంభంగా నిలిచింది. అంకిత భావంతో పని చేస్తున్న సిబ్బంది ఖాతాదారులను కొత్తగా చేర్చుకోవడం, ఖాతాదారులు కొనసాగేలా చేసే అంశాల్లో సంస్థకు అండగా నిలుస్తున్నారు. సంస్థ బ్రాండ్  అంబాసిడర్‌లుగా అమ్మకాల విభాగం సిబ్బంది గుర్తింపు పొందారు. వ్యక్తిగత సేవలు అందించడం ద్వారా ఖాతాదారులతో సంబంధాలను పెంపొందించడం ద్వారా ఏజెంట్లు స్థిరంగా రాబడి వృద్ధికి సహకరిస్తారు.

అభివృద్ధి పధంలో పయనించడానికి ఏజెంట్ల కోసం  పిఎల్ఐ వినూత్న పథకాన్ని ప్రారంభించింది.  "డైరెక్ట్ ఇన్సెంటివ్ డిస్బర్స్‌మెంట్" పేరుతో ప్రారంభించిన పథకం కింద ఏజెంట్లకు చెల్లించాల్సిన  కమీషన్‌లను సంస్థ  నేరుగా వారి పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది. 

ఈ సంచలనాత్మక కార్యక్రమం వల్ల సంస్థ అమ్మకాల విభాగం తో సంబంధం ఉన్న దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్, డైరెక్ట్ ఏజెంట్లు, ఫీల్డ్ ఆఫీసర్లు,సంస్థ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు.  దేశవ్యాప్తంగా ఉన్న సుమారు రెండు లక్షల మంది సేల్స్ సిబ్బందికి ప్రయోజనం కలుగుతుంది. సురక్షితమైన విధానంలో  తక్షణం నిధులు ఖాతాలకు బదిలీ అవుతాయి. దీనివల్ల కమిషన్ చెల్లింపులో జాప్యం తగ్గుతుంది. భౌతిక తనిఖీల అవసరాన్ని నిర్మూలిస్తుంది. ప్రోత్సాహకాలను పంపిణీ చేసే విధానాన్ని ఆధునీకరించడం ద్వారా ఏజెంట్లతో  బంధాన్ని మరింత  పటిష్టం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. 

పథకం వల్ల కలిగే  ముఖ్య ప్రయోజనాలు:

- వేగంగా నిధులు బదిలీ అవుతాయి. సిబ్బంది పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రోత్సాహకాలు బదిలీ అవుతాయి. 

- సౌకర్యం, ప్రేరణ: పథకం వల్ల సిబ్బంది తమ విధులను సమర్ధంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి తక్షణం ప్రోత్సహకాలు అందుతాయి.  

కార్యక్రమాన్ని  పోస్టల్ శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ అలోక్ శర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో సభ్యుడు (పిఎల్‌ఐ) ,చీఫ్ జనరల్ మేనేజర్ (పిఎల్‌ఐ) పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  అన్ని పోస్టల్ సర్కిళ్ల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పాల్గొన్నారు.

 

***


(Release ID: 1946610) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi