పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
భూసార క్షీణత, ఎడారీకరణ
Posted On:
07 AUG 2023 4:11PM by PIB Hyderabad
1988 నాటి జాతీయ అటవీ విధానం (ఎన్.ఎఫ్.పి ) ప్రకారం, మొత్తం భూమిలో మూడోవంతు భూమిలో అడవులు లేదా వృక్షాలతో నిండి ఉండాలని
లక్ష్యంగా నిర్ణయించినదానికి అనుగుణంగా అటవీ మంత్రిత్వశాఖ పలు చర్యలు చేపట్టింది. మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంది.
అటవీ , పర్యావరణ మంత్రిత్వశాఖ , ఇతర మంత్రిత్వశాఖల ద్వారా వివిధ పథకాల కింద అడవుల విస్తీర్ణంపెంపు ,అడవులను మెరుగుపరచడం, చెట్ల సంఖ్యను పెంచడం ద్వారా
ఎడారీకరణను ఎదుర్కొవడం జరుగుతోంది.
పర్యావరణం, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వశాఖ, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా (జిఐఎం),అటవీ అగ్నిప్రమాదాల నుంచి రక్షణ,నిర్వహణ పథకం (ఎఫ్.ఎఫ్.పి.ఎం) వంటి ప్రధాన కేంద్ర ప్రాయోజిత పథకాల కింద,అటవీ పరిరక్షణ, అభివృద్ధి, ప్రోత్సాహానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అండగా నిలుస్తోంది.సి.ఎ.ఎం.పి.ఎ పథకం కింద ప్రత్యామ్నాయ అటవీ పెంపకం కింద, దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నారు.రాష్ట్రప్రభుత్వాలు కూడా మొక్కలు నాటేందుకు పలుపథకాలు అమలు చేస్తున్నాయి.
దీనికితోడు, మడ అడవులు,పగడపు దిబ్బల ను పరిరక్షించి , వాటిని కాపాడేందుకు నిర్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకమైన జాతీయ తీర ప్రాంత మిషన్ ద్వారా , ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోంది. ఈ పథకం కింద, మడ అడవుల పరిరక్షణకు వార్షిక యాజమాన్య కార్యాచరణ పథకం (ఎం.ఎ.పి) ని
రూపొందించడం జరిగింది. అలాగే అన్ని కోస్తా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. భూసార క్షీణత, ఎడారీకరణను నిలువరించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
అవి కింది విధంగా ఉన్నాయి.
1) ఎడారీకరణ, భూ సార క్షీణతకు సంబంధించిన భారతదేశ అట్లాస్ను అహ్మదాబాద్ లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కు చెందిన , స్పేస్ అప్లికేషన్ సెంటర్ ( ఎస్.ఎ.సి) రూపొందించింది.
ఇది ఇండియాలో భూ సార క్షీణత, ఎడారీకరణ ఏమేరకు ఉందన్నది తెలియజేస్తుంది. ఈ అట్లాస్ ప్రకారం 2018–19 లో దేశంలో భూసార క్షీణత, ఎడారీకరణ సుమారు 97.84 మిలియన్ హెక్టార్లుగా తేలింది.
రాష్ట్రాల వారీగా భూసార క్షీణతకు గురైన ప్రాంతం గురించిన వివరాలను ఇది అందిస్తుంది. దీనివల్ల ఆయా భూములను తిరిగి మామూలు స్థాయికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టడానికి వీలు కలుగుతుంది.ఈ దిశగా ఇది కీలక సమాచారాన్ని, సాంకేతిక వివరాలను అందజేస్తోంది.
2) అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్.ఎ.సి) సహాయంతో, ఒక ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. దీనిద్వారా దేశంలో భూ సార క్షీణతకు గురైన ప్రాంతం, భూ సారక్షీణతకు దారితీసిన పరిస్థితులు గమనించవచ్చు.
3) డెహ్రాడూన్లోని ఇండియన కౌన్సిల్ ఫర్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసిఎఫ్ఆర్ ఇ) , వర్ధమాన దేశాల మధ్య మరింత విస్తృత సహకారానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది.ఇది సుస్థిర భూ యాజమాన్య వ్యూహాలు,పరివర్తనాత్మక ప్రాజెక్టులు, కార్యక్రమాలు,సామర్ధ్యాల నిర్మాణానికి సంబంధించి
భారతదేశ అనుభవాలను ఇతరులతో పంచుకునేందుకు నిర్దేశించినది.
4) భాన్ ఛాలెంజ్ లక్ష్యంపై ప్రగతిని నివేదించేందుకు ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ సంఘం (ఐయుసిఎన్)– ఇండియా కు రిపోర్టింగ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది.
2015 పారిస్లో వాతావరణ మార్పులపై జరిగిన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి) లో ఇండియా తనంత తానుగా బాన్ చాలెంజ్ ప్రతిజ్ఞలో పాలుపంచుకుంది. దీనికి అనుగుణంగా, 2020 నాటికి భూసార క్షీణత కలిఇగిన, ఎడారీకరణ జరిగిన సుమారు 13 మిలియన్ హెక్టార్లలో అటవీ పునరుద్ధరణకు సంకల్పం చెప్పుకోవడం జరిగింది. దీనికి తోడు 2030 నాటికి అదనంగా 8 మిలియన్ హెక్టార్లను చేర్చాలని నిర్ణయించారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా 2030 నాటికి భూసార పునరుద్ధరణ లక్ష్యం 21 మిలియన్ హెక్టార్ల నుంచి 26 మిలియన్ హెక్టార్ల మేరకు పెంచడం జరిగింది . 2019లో , ఎడారీకరణకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సదస్సు కాప్ 14 సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
20 అంశాల కార్యక్రమం కింద 2011612, 2021–22 మధ్య సుమారు 18.94 మిలియన్ హెక్టార్లలో అటవీ పెంపకం జరిగింది. ఇందులో వివిధ, కేంద్ర పథకాలు,రాష్ట్ర పథకాల కింద
రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మొక్కలపెంపకం కూడా ఉంది.
తమిళనాడు రాష్ట్రం తెలిపిన సమాచారం ప్రకారం, కోస్తా తీరప్రాంత ఆవాస పునరుద్ధరణ,జీవావరణపునరుద్ధరణ కార్యక్రమాన్ని 2023–24 నుంచి 2025–26 వరకు మూడు సంవత్సరాల పాటు
తమిళనాడు లో తంజావవూరు,మైలాదుతురై, నాగపట్టణం తో సహా అన్ని జిల్లాలల దీనిని అమలు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 11.25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మడ అడవుల జీవావరణాన్ని
పునరుద్ధరిస్తారు.అలాగే 3.28 చదరపు కిలీమీటర్ల విస్తీర్ణంలో మడ అడవుల మొక్కలు నాటుతారు. దీనికితోడు జీవావరణానికి రక్షణగా నిలిచే జీడిమామిడి, మడ మొక్కలు, ఇతర ప్రత్యేక రకాలను పెద్ద ఎత్తున అటవీ పెంపకంలో భాగంగా నాటుతారు.
ఇందుకు సంబంధించి స్థానికులలో చైతన్యం కలిగించేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థానిక కమ్యూనిటీని ఇందులో భాగస్వాములను చేస్తారు.
భూసార క్షీణత సమస్యను ఎదుర్కొనేందుకు మంత్రిత్వశాక ఏ , ప్రభుత్వేతర సంస్థతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదు. అయితే మొక్కల పెంపకం,అటవీ పెంపకం అనేది
బహుళ విధ కార్యక్రమం కావడంతో,
వివిధ ప్రభుత్వ విభాగాలు, ఎన్.జి.ఒలు పౌర సమాజం, కార్పొరేట్ సంస్థల ద్వారా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రణాళికలు, ప్రణాళికేతర పథకాల ద్వారా వీటిని చేపట్టడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల శాక సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే లోక్సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1946609)
Visitor Counter : 198