పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ కనుమల ప్రాదేశిక నిర్ణయ మద్దతు వ్యవస్థ

Posted On: 07 AUG 2023 4:03PM by PIB Hyderabad

   శ్చిమ కనుమలలో ప్రస్తుతం కొనసాగుతున్న పర్యావరణ పరిశోధనలో తాము నిర్వహిస్తున్న ‘పశ్చిమ కనుమల ప్రాదేశిక నిర్ణయ మద్దతు వ్యవస్థ’ (డబ్ల్యుజిఎస్‌డిఎస్‌ఎస్‌) ఒక భాగం మాత్రమేనని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) తెలిపింది. ప్రాదేశిక ఏకీకరణ ద్వారా అందే సమాచారంతోపాటు సార్వత్రిక వెబ్ సాంకేతికతలలో ఇటీవలి పురోగతిని ఈ వ్యవస్థ పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది. ఇందులో భాగంగా సమాచారాన్ని అనేక భాగాలుగా విభజించి ఆయా స్థాయులకు వర్తింపజేస్తుందని వివరించింది. అయితే, తాజా అటవీ నిర్మూలన ఉదంతాలను క్రమబద్ధంగా పసిగట్టేందుకు తగిన వెసులుబాటు సదరు ‘మద్దతు వ్యవస్థ’కు లేదని స్పష్టం చేసింది.

   భారత అటవీ అధ్యయన సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) రూపొందించిన 2021నాటి భారత జాతీయ అటవీ స్థితిగతుల నివేదిక (ఐఎఫ్‌ఎస్‌ఆర్‌) ప్రకారం- దేశవ్యాప్తంగా అటవీ-వృక్ష విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లు. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతం కాగా, 2019నాటి అంచనాలతో పోలిస్తే, ఈ విస్తీర్ణం పెరుగుదల 2261 చదరపు కిలోమీటర్లుగా నమోదైంది. ఈ మేరకు అడవులపరంగా 1540 చదరపు కిలోమీటర్లు, వృక్ష సంపదపరంగా 721 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. ఇక పశ్చిమ కనుమల పరిధిలోని ఆరు రాష్ట్రాల్లో (గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు) 2019నాటి నమోదిత అటవీ విస్తీర్ణం 1,53,955 చదరపు కిలోమీటర్లు. ఈ నేపథ్యంలో 2021నాటి లెక్కల ప్రకారం ఈ ఆరు రాష్ట్రాల పరిధిలో అటవీ విస్తీర్ణం 1,54,370 చదరపు కిలోమీటర్లు కాగా, 415 చదరపు కిలోమీటర్ల మేర  పెరుగుదల నమోదైంది.

   లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే ఈ సమాచారం వెల్లడించారు.

*****


(Release ID: 1946551)
Read this release in: English , Urdu