పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ఏనుగుల వేట

Posted On: 07 AUG 2023 4:12PM by PIB Hyderabad

ఏనుగుల వేటకు సంబంధించిన నేరాలతో సహా మానవ-  ఏనుగుల సంఘర్షణను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు,  కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు ప్రధానంగా స్పందించాల్సి ఉంది. ఏనుగులను, వాటి ఆవాసాలను, కారిడార్లను సంరక్షించడం, మానవ-ఏనుగుల సంఘర్షణ సమస్యలను పరిష్కరించడం , ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , ఒడిశాతో సహా దేశంలో బందీగా ఉన్న ఏనుగుల సంక్షేమం వంటి ప్రధాన లక్ష్యాలతో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పథకంప్రారంభించింది. దేశంలో ఏనుగుల వేటతో సహా మానవ-  ఏనుగుల సంఘర్షణను నివారించడానికి మంత్రిత్వ శాఖ ఈ క్రింది చర్యలు తీసుకుంది:

 

I.కేంద్ర ప్రాయోజిత పథకం 'ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్' కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు వేట నిరోధక దళం / శిబిరాల ఏర్పాటు, పెట్రోలింగ్ విధులు, వేటగాళ్ల సమాచారంపై సమాచారం ఇచ్చిన వారికి బహుమతి వంటి వాటితో సహా జాతులు , వాటి ఆవాసాల రక్షణ , సంరక్షణ కోసం మంత్రిత్వ శాఖ ఆర్థిక , సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.

 

ii.వన్యప్రాణుల సంబంధిత నేరాలను ఎదుర్కోవడంతో సహా మానవ-వన్యప్రాణి సంఘర్షణపై మంత్రిత్వ శాఖ 2021 ఫిబ్రవరి 6 న ఒక సలహా పత్రాన్ని జారీ చేసింది.

 

iii.మానవ-ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి , ఏనుగుల ప్రతీకార మారణ కాండను  నివారించడానికి, అడవి ఏనుగుల వల్ల  స్థానిక సమాజాల ఆస్తి , ప్రాణ నష్టానికి పరిహారం ఇస్తారు.

వన్యప్రాణుల దోపిడీకి సంబంధించిన ఎక్స్ గ్రేషియా రేట్లను పెంచుతూ మంత్రిత్వ శాఖ 2018 ఫిబ్రవరి 9 నాటి లెటర్  14-2/2011 డబ్ల్యూఎల్-1 (భాగం) ద్వారా నోటిఫై చేసింది.

 

iv.ఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న అనేక ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు నీటి వనరులను పెంచడం, పశుగ్రాసం చెట్లను నాటడం, వెదురు పునరుత్పత్తి మొదలైన వాటి ద్వారా ఏనుగుల సహజ ఆవాసాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. కాంపెన్సేటరీ ఫారెస్ట్రేషన్ ఫండ్ యాక్ట్ 2016 , దాని కింద రూపొందించిన నిబంధనలు ఏనుగులతో సహా వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు మొదలైన వాటికి ఈ నిధిని ఉపయోగించడానికి కూడా వీలు కల్పిస్తాయి. ఇవి హెచ్ఇసి తగ్గడానికి కూడా దోహదం చేస్తాయి.

 

v.మానవ - ఏనుగుల సంఘర్షణ నిర్వహణ కోసం మంత్రిత్వ శాఖ 6.10.2017 న  మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిని అమలు చేయాలని ఎలిఫెంట్ రేంజ్ రాష్ట్రాలను అభ్యర్థించింది.

 

vi.మానవ-వన్యప్రాణుల సంఘర్షణను ఎదుర్కోవడంపై మంత్రిత్వ శాఖ 2021 ఫిబ్రవరిలో ఒక సలహాను జారీ చేసింది. సమన్వయ అంతర్విభాగ చర్యలు, సంఘర్షణ హాట్ స్పాట్ లను గుర్తించడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కు కట్టుబడి ఉండటం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ల ఏర్పాటు, ఎక్స్ గ్రేషియా రిలీఫ్ పరిమాణాన్ని సమీక్షించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, సత్వర చెల్లింపులకు మార్గదర్శకాలు/ సూచనలు జారీ చేయడం, వ్యక్తులు చనిపోతే, గాయపడితే 24 గంటల్లోగా బాధితులకు చెల్లించాల్సిన ఎక్స్ గ్రేషియా రిలీఫ్ కు తగిన నిధులను సమకూర్చాలని సూచించింది.

 

vii.మానవ-జంతు సంఘర్షణలను తగ్గించే విధంగా విద్యుత్ ప్రసార మార్గాలతో సహా లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనలో ప్రాజెక్ట్ ఏజెన్సీలకు సహాయపడటానికి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పర్యావరణ, అటవీ,  వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ , ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తో సంప్రదించి 'లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభావాలను తగ్గించడానికి పర్యావరణ స్నేహపూర్వక చర్యలు' అనే పత్రాన్ని ప్రచురించింది.

 

viii.రాష్ట్రాలు , ఇతర భాగస్వాముల ప్రయోజనం కోసం మంత్రిత్వ శాఖ "భారతదేశంలో మానవ - ఏనుగుల సంఘర్షణ నిర్వహణ కు ఉత్తమ పద్ధతులు" అనే పుస్తకాన్ని విడుదల చేసింది.

 

ix. 2022 ఏప్రిల్ 29 న స్టీరింగ్ కమిటీ

16 వ సమావేశంలో మానవ - ఏనుగుల సంఘర్షణను నిర్వహించడానికి ఫ్రంట్ లైన్ సిబ్బంది కోసం ఫీల్డ్ మాన్యువల్ ను విడుదల చేసారు.

 

x.వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 మానవ - వన్యప్రాణుల సంఘర్షణ పరిస్థితులను ఎదుర్కోవటానికి నియంత్రణ విధులను అందిస్తుంది.

 

xi.మానవ-ఏనుగుల సంఘర్షణను పరిష్కరించడానికి తూర్పు ప్రాంతం కోసం ప్రాంతీయ సమన్వయ సమావేశం 2023 జనవరి 19 న కోల్కతాలో జరిగింది.

 

xii.వన్యప్రాణుల కేసుల దర్యాప్తు, ఫోరెన్సిక్స్, విజయవంతమైన ప్రాసిక్యూషన్ కోసం ఫ్రంట్ లైన్ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

 

xiii.అదనంగా, మంత్రిత్వ శాఖ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యుసిసిబి) సహకారంతో ఏనుగుల వేటతో సహా వన్యప్రాణుల నేరాలను నివారించడానికి ఈ క్రింది చర్యలు తీసుకుంది:

 

*స్మగ్లింగ్ కు పాల్పడే నేరస్థులను పట్టుకోవడానికి రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించడం.

 

*వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 నిబంధనల ప్రకారం వన్యప్రాణుల కేసుల దర్యాప్తుపై అటవీ , పోలీసు అధికారులకు సామర్థ్యాన్ని పెంపొందించడం.

 

*బోర్డర్ గార్డ్ ఫోర్సెస్, కస్టమ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), న్యాయాధికారులు, ఆర్ పి ఎఫ్, జి ఆర్ పి, , ఇతర భాగస్వాములకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం.

 

*వన్యప్రాణుల వేట, అక్రమ వ్యాపారంపై నివారణ చర్యల కోసం సంబంధిత రాష్ట్ర, కేంద్ర సంస్థలకు హెచ్చరికలు, సలహాలు జారీ చేయడం.   

 

*డబ్ల్యుసిసిబి వైల్డ్ లైఫ్ క్రైమ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అభివృద్ధి చేసి ఆన్ లైన్ చేసింది.  రోజువారీ ప్రాతిపదికన కనుగొనబడిన వన్యప్రాణుల నేరాలకు సంబంధించిన డేటాను అప్ లోడ్ చేయడానికి 970 డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసులు, టైగర్ రిజర్వ్ ల  50 ఫీల్డ్ డైరెక్టర్లు , అటవీ శాఖలోని 37 చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్లు , 34 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తో యూజర్ ఆధారాలను పంచుకుంది.

 

*రాష్ట్ర/ కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల మధ్య చర్యలను సమన్వయం చేయడానికి డబ్ల్యుసిసిబి ప్రత్యేక పాన్ ఇండియా

ఎన్ ఫోర్స్ మెంట్ ఆపరేషన్ ను కూడా నిర్వహించింది.  "ఆపరేషన్ వైల్డ్ నెట్-1, 2, 3, 4"లో ఏనుగు దంతాలు స్వాధీనం అయ్యాయి.

 

*అంతే గాక , ఇంటర్ పోల్ వైల్డ్ లైఫ్ వర్కింగ్ గ్రూప్ తలపెట్టిన ఆపరేషన్ థండర్ బర్డ్, ఆపరేషన్ థండర్స్, ఆపరేషన్ థండర్ ,ఆపరేషన్ థండర్ 2021 వంటి గ్లోబల్ ఆపరేషన్ లలో డబ్ల్యుసిసిబి పాల్గొంది, దీని ఫలితంగా పలువురు నేరస్తుల అరెస్టులు, ఏనుగు దంతాల స్వాధీనం జరిగింది.

 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈ రోజు లోక్ సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

***



(Release ID: 1946548) Visitor Counter : 128


Read this release in: English , Urdu