బొగ్గు మంత్రిత్వ శాఖ
7వ విడత బొగ్గు బ్లాక్ వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ
నాలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు బొగ్గు గనుల వేలం
2105.74 మిలియన్ టన్నులకు చేరుకోనున్న మొత్తం భూసంబంధ నిల్వలు
వాణిజ్య వేలం కింద నేటివరకూ వియవంతంగా 92 గనుల వేలం
రూ. 34,185 కోట్ల వార్షిక ఆదాయం, రూ. 34,486 కోట్ల పెట్టుబడి, దాదాపు 3,10,818 ఉపాధి అవకాశాలని అంచనా
Posted On:
04 AUG 2023 3:43PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు గనుల వేలాన్ని 7వ రౌండ్ కింద 6వ రౌండ్ రెండో ప్రయత్నంలో విజయవంతంగా పూర్తి చేసింది.
బిడ్‌ల అంచనా తర్వాత, ఆరు గనుల కోసం ఫార్వార్డ్ ఇ-వేలం 1 ఆగస్టు 2023 నుంచి ప్రారంభమై 3 ఆగస్టు 2023న మొత్తం ఆరు గనుల వేలం విజయవంతమైంది.
వేలం వేసిన బొగ్గు గనుల వివరాలు దిగువన ఇవ్వడం జరిగింది -
వేలం వేసిన గనుల్లో రెండు బొగ్గు గనులు పూర్తిగా అన్వేషించగా, నాలుగు పాక్షికంగా అన్వేషించినవి.
ఈ ఆరు బొగ్గు గనులకు సంబంధించిన మొత్తం జియోలాజికల్ రిజర్వ్ 2,105.74 మిలియన్ టన్నులు.
ఈ బొగ్గు గనులకు సంచిత అత్యధిక రేటెడ్ సామర్ధ్యం (పిఆర్‌సి) 7 ఎంటిపిఎ (పాక్షికంగా అన్వేషించిన బొగ్గు గనులను మినహాయించి).
సగటు రాబడి వాటా మునుపటి విడతలో 22.12% నుంచి 23.71%కి పెరిగింది. ఈ అధిక రాబడి వాటా, వాణిజ్య బొగ్గు గనుల రంగంలో పరిశ్రమలు, పెట్టుబడిదారుల నుంచి బలమైన, నిరంతర ఆసక్తిని, భారతదేశంలో బొగ్గు మైనింగ్ స్థిరమైన భవిష్యత్తును సూచిస్తుంది. ఇది వాణిజ్య బొగ్గు మైనింగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా బొగ్గు రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల విజయాన్ని కూడా సూచిస్తుంది.
వేలం వేసిన గని-వారీ ఫలితాలు ఇలా ఉన్నాయి-
నెం. గనిపేరు రాష్ట్రం పిఆర్‌సి భౌగోళిక నిల్వలు క్లోజింగ్ బడ్
(ఎంటిపిఎ) సమర్పించిన
వారు
1. నార్త్ ధడు జార్ఖండ్ 3.00 434,65 ఎన్ఎల్ సి ఇండియా
(పశ్చిమ భాగం ) లిమిటెడ్
రిజర్వ్ ధర (%) అంతిమ ఆఫర్ (1)
4.00 6.00
2. పథోరా వెస్ట్ ఎంపి --- 81,69 శ్రీబజరంగ్‌పవర్&
ఇస్పాట లిమిటెడ్
రిజర్వ్ ధర (%) అంతిమ ఆఫర్ (1)
4.00 18.25
3. మీనాక్షీ వెస్ట్ ఒడిషా --- 950.00 హిండాల్కోఇండస్ట్రీస్
లిమిటెడ్
రిజర్వ్ ధర (%) అంతిమ ఆఫర్ (1)
4.00 33.75
4. నార్త్ ధడు
(ఉత్తర భాగం) జార్ఖండ్ 4.00 439.00 ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్
రిజర్వ్ ధర (%) అంతిమ ఆఫర్ (1)
4.00 6.00
5. పథోరా ఈస్ట్ ఎంపి --- 10.40 శ్రీబజరంగ్‌పవర్&
ఇస్పాట లిమిటెడ్
రిజర్వ్ ధర (%) అంతిమ ఆఫర్ (1)
4.00 43.75
6. షేర్బంద్ ఛత్తీస్‌గఢ్ --- 90.00 నీలకంఠ్ కోల్‌మైనింగ్
(ప్రైవేట్ లిమిటెడ్)
రిజర్వ్ ధర (%) అంతిమ ఆఫర్ (1)
4.00 34,50
ఈ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి, దిగుమతి చేసుకునే థర్మల్ బొగ్గు కోసం డిమాండ్‌ను తగ్గించడానికి, ప్రభుత్వ రంగ బొగ్గు మైనింగ్ కంపెనీలపై ఆధారపడటం తగ్గడానికి తోడ్పడుతుంది. వాణిజ్య బొగ్గు గనుల వేలం అన్నది బొగ్గు గలిగిన ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాల సృష్టి, మౌలికసదుపాయాల అభివృద్ధిని చేయడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. అంతేకాకుండా, ఈ బొగ్గు గనుల గరిష్ట స్థాయి సామర్ధ్యం (పిఆర్‌సి) వద్ద లెక్కించిన దాదాపు 787 కోట్ల (పాక్షికంగా అన్వేషించిన బొగ్గు గనులనను మినహాయించి) వార్షిక ఆదాయం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్రాల రాబడికి గణనీయంగా దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఈ వేలం దాదాపు రూ. 1,050 కోట్ల మూలధన పెట్టుబడిని ఆకర్షించి, దాదాపు 9,464 ఉద్యోగావకాశాల సృష్టికి దారి తీస్తుంది.
ఈ ఆరు బొగ్గు గనుల విజయవంతమైన వేలంతో వాణిజ్య వేలం కింద వేల వేసిన మొత్తం బొగ్గు గనుల సంఖ్య 92గా ఉంది. ఈ గనులు బొగ్గు గనుల ప్రస్తుత పిఆర్‌సి ప్రకారం గణించిన సుమారు - 34,185 కోట్ల వార్షిక ఆదాయాన్ని (పాక్షికంగా అన్వేషించిన బొగ్గు గనులను మినహాయించి) ఈ గనులు ఉత్పత్తి చేయవచ్చని అంచనా.
ఈ బొగ్గు గనుల నిర్వహణ ద్వారా దాదాపు రూ. 34,486 కోట్ల మూలధన పెట్టుబడికి దారి తీయడమే కాక, సుమారు 3,10,818 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
బొగ్గు మంత్రిత్వ శాఖ వాణిజ్య బొగ్గు గనుల రంగంలో సాధించిన అద్భుతమైన పురోగతిని గుర్తించింది. ఈ వేలం పాటలను విజయవంతంగా పూర్తి చేయడం వల్ల బొగ్గు గనుల పరిశ్రమలో వృద్ధి, సుస్థిరతను పెంపొందించడం, భారతదేశ ఆర్థిక పురో గతిని నడిపించడం, ఇంధన భద్రతకు భరోసా కల్పించడం వంటి ప్రభుత్వ నిబద్ధతను బలపరుస్తుంది.
***
(Release ID: 1945972)