జల శక్తి మంత్రిత్వ శాఖ
జల సంక్షోభం (నీటి కొరత)
Posted On:
03 AUG 2023 3:39PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో.. దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి 2019, ఆగస్టు నుంచి కుళాయి కనెక్షన్ ద్వారా తాగు నీటికి భరోసా కల్పించేందుకు జల్ జీవన్ మిషన్ (జేజేఎం)-హర్ ఘర్ జల్‌ను అమలు చేస్తోంది.
జల్ జీవన్ మిషన్ ప్రకటించిన సమయంలో, 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదించబడింది. ఇప్పటివరకు.. అంటే 31.07.2023 నాటికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన ప్రకారం, దాదాపు 9.46 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించబడ్డాయి. అంతేకాకుండా 31.07.2023 నాటికి, దేశంలోని 19.43 కోట్ల గ్రామీణ కుటుంబాలలో, దాదాపు 12.69 కోట్ల (65.33%) కుటుంబాలు తమ ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నాయని నివేదించబడింది. మిగిలిన 6.74 కోట్ల మందికి ఈ నీటి సరఫరా అందిస్తారు.
జల్ జీవన మిషన్ కింద.. జలవనరుల పునరుర్జీవం (రీచార్జ్) కోసం నిబంధనలు రూపొందించబడ్డాయి. అనగా. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్), ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (ఐడబ్ల్యూఎంపీ), 15వ ఫైనాన్స్ కమీషన్ ఆర్ఎల్బీలు/పీఆర్ఐలు, రాష్ట్ర పథకాలు, సీఎస్ఆర్ నిధులు వంటి ఇతర పథకాలకు అనుగుణంగా ప్రత్యేక బోర్ వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, వర్షపు నీటి రీఛార్జ్, ఇప్పటికే ఉన్న నీటి వనరుల పునరుజ్జీవనం మొదలైనవి నిబంధనల్లో ఉన్నాయి.
అంతేకాకుండా రాష్ట్రాల ప్రయత్నాలకు అనుబంధంగా.. దేశంలో స్థిరమైన భూగర్భ జలాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి:
https://cdnbbsr.s3waas.gov.in/s3a70dc40477bc2adceef4d2c90f47eb82/uploads/2023/02/2023021742.pdf
అంతేకాకుండా నీటి రంగంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నీటి మిషన్ రాష్ట్ర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. రాష్ట్ర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు తప్పనిసరిగా వీటిని కలిగి ఉండాలి.
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం యొక్క ప్రస్తుత నీటి వనరుల అభివృద్ధి మరియు నిర్వహణ, నీటి పాలన, సంస్థాగత ఏర్పాట్లు, నీటి సంబంధిత విధానాలు, సరిహద్దు సమస్యలు మరియు ఒప్పందాలు మొదలైన వాటిపై స్థితి నివేదికను తయారు చేయడం. రాష్ట్రానికి సంబంధించిన నీటి వనరులకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన సమస్యలను కూడా నివేదికలో నిర్వచించాలి.
కీలక సమస్యలు/సమస్య ప్రాంతాలను పరిష్కరించడానికి సంభావ్య పరిష్కారాల సమితిని గుర్తించడం, పరిష్కారాల యొక్క లాభాలు మరియు నష్టాలను తెలియజేస్తుంది.
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ద్వారా అమలు చేయడానికి నేషనల్ వాటర్మిషన్లో గుర్తించబడిన ప్రతి వ్యూహాలు/కార్యకలాపాల కోసం వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం.
దేశంలోని డైనమిక్ భూగర్భ జల వనరులను కేంద్ర భూగర్భ జల సంఘం (సీజీడబ్ల్యూబీ) మరియు రాష్ట్ర ప్రభుత్వాలు క్రమానుగతంగా సంయుక్తంగా అంచనా వేస్తున్నాయి. 2020 అంచనా ప్రకారం, దేశంలోని మొత్తం 6965 అసెస్‌మెంట్ యూనిట్‌లలో (బ్లాక్‌లు/తాలూకాలు/ మండలాలు/ వాటర్‌షెడ్‌లు/ఫిర్కాలు) వార్షిక భూగర్భ జలాల వెలికితీత ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాలు/కేంద్రాపాలిత ప్రాంతాలలో 1114 యూనిట్లు ఏడాదిలో సేకరించాల్సిన భూగర్భ జల వనరుల కంటే. 'ఓవర్ ఎక్స్‌ప్లోయిటెడ్'గా వర్గీకరించబడ్డాయి.
దేశం మొత్తానికి (రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం వారీగా) ఓవర్ ఎక్స్‌ప్లోయిటెడ్ అసెస్‌మెంట్ యూనిట్ల వివరాలతో సహా పూర్తి భూగర్భజల వనరుల సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు:
http://cgwb.gov.in/documents/2021-08-02-GWRA_India_2020.pdf
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు
***
(Release ID: 1945960)
Visitor Counter : 87