ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్ కింద మంజూరైన ప్రాజెక్టులు

Posted On: 03 AUG 2023 3:29PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ , ఈశాన్య ప్రాంతం కోసం 3392.99 కోట్ల రూపాయలతో మొత్తం 145 ప్రాజెక్టులను మంజూరు చేసింది.
ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్) కింద , ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ  రూ 3392.99 కోట్ల   రూపాయల విలువగల  మొత్తం 145 ప్రాజెక్టులను
మంజూరు చేసింది. ఈశాన్య ప్రాంతంలో  వివిధ రంగాల అభివృద్ధికి సంబంధించిన వ్యత్యాసాలను చక్కదిద్దేందుకు దీనిని మంజూరు చేశారు.
రాష్ట్రాల వారీగా చేపట్టిన ప్రాజెక్టులు అనుబంధంలో ఉన్నాయి.
ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రాజెక్టులు సత్వరం పూర్తి అయ్యేందుకు మంత్రిత్వశాక పలు చర్యలు తీసుకుంది.
క్షేత్రస్థాయిలో పని పురోగతి, చేసిన   ఖర్చునుబట్టి నిధులను విడుదలచేస్తూ వచ్చారు.  ఈపథకాల కింద మంత్రిత్వశాఖ, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థ (పిఎఫ్ఎంఎస్) కింద విడుదల చేస్తుంది.  సకాలంలో నిధుల విడుదలకు ఇది ఉపకరిస్తుంది.
 దీనికితోడు, ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రప్రభుత్వాలు, వ్యయ, ముందస్తు చెల్లింపు, బదిలీ (ఇ.ఎ.టి) పద్ధతిలో   ప్రాజెక్టులు అమలుచేయాలని, పిఎఫ్ ఎం ఎస్ మాడ్యూళ్లను నిధుల చెల్లింపునకు
 ట్రాకింగ్ గా వాడాలని వాటికి సూచించడం జరిగింది. దీనికితోడు,మంత్రిత్వశాఖ క్రమం తప్పకుండా రాష్ట్రప్రభుత్వాలతో సీనియర్ అధికారుల స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే ఆయా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు  క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తోంది. ప్రతి ఈశాన్య రాష్ట్రానికి , ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మరింత మెరుగైన సమన్వయం ఉండేందుకు వీలుగా నోడల్ అధికారులను, ఛీఫ్ నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఆయా రాష్ట్రాలలో ప్రాజెక్టుల అమలు పురోగతిని వారు పర్యవేక్షిస్తారు. 
ప్రాజెక్టులు పొందడానికి అన్ని ఈశాన్య రాష్ట్రాలకు అర్హత ఉంది. ఎన్ఇఎస్ఐ కింద  వాటికి వర్తించే నార్మటివ్ కేటాయింపుల వరకు మంజూరవుతాయి.

అనుబంధం

 

ఎన్ఇఎస్ఐడిఎస్ ఏర్పడినప్పటినుంచి రాష్ట్రాలవారీఆ మంజూరైన ప్రాజెక్టులు

క్రమసంఖ్య

రాష్ట్రం

ప్రాజెక్టుల సంఖ్య

మొత్తం రూ కోట్లలో

 

1

అరుణాచల్ ప్రదేశ్

29

623.87

2

అస్సాం

33

880.82

3

మణిపూర్

18

341.32

4

మేఘాలయ

12

340.50

5

మిజోరం

17

345.38

6                                            

నాగాలాండ్

17

333.62

7

సిక్కిం

8

214.51

8

త్రిపుర

11

312.97

 

మొత్తం

145

3392.99

  ఈ సమాచారాన్ని కేంద్ర ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

****


(Release ID: 1945682) Visitor Counter : 123
Read this release in: English , Urdu