సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఖాదీ ఉత్పత్తులపై రాయితీ

Posted On: 03 AUG 2023 5:10PM by PIB Hyderabad

ఖాదీ అమ్మకాలను పెంచడంలో రాయితీ పథకం ప్రభావంపై అనేక కమిటీలు అధ్యయనం చేశాయి. ఆ కమిటీల సిఫార్సుల ఆధారంగా, ఖాదీ ఉత్పత్తుల కోసం 'మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్' (ఎండీఏ) పథకాన్ని 01.04.2021 నుంచి భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఖాదీ సంస్థలకు సాయం చేయడం ద్వారా హస్తకళాకారుల సంపాదన పెంచడం, వినియోగదార్ల నాణ్యమైన ఖాదీని అందించడం దీని లక్ష్యం. ఎండీఏ పథకం కింద, స్పిన్నర్లు, నేత కార్మికులకు 25% సాయం అదనపు ప్రోత్సాహకంగా అందుతుంది, వారి బ్యాంక్/పోస్టాఫీసు ఖాతాల్లోకి చెల్లింపు జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం, 'మోడిఫైడ్‌ మార్కెట్ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌' (ఎంఎండీఏ) పథకాన్ని 2016-17 మూడో త్రైమాసికం నుంచి తీసుకొచ్చింది. నూతన సాంకేతికత, కొత్త ఉత్పత్తులు తీసుకురావడానికి డిజైన్ కన్సల్టెంట్లను నియమించడం, నేత దశలో నూతన సాంకేతికతలు ఉపయోగించడం ద్వారా విలువ జోడింపు, విక్రయ కేంద్రాల ఆధునీకరణ & కంప్యూటరీకరణ, సంచార విక్రయ వాహనం ప్రారంభం, విదేశీ మార్కెటింగ్‌ కన్సల్టెంట్లను నియమించడం, విక్రయ రాయితీలు పొడిగింపు, విక్రయ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడం, హస్తకళాకారులు & కార్యకర్తలకు ప్రోత్సాహకాలు వంటివి ఎంఎండీఏ పథకం లక్ష్యం. సవరించిన మార్గదర్శకాలు 19.10.2022 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఎంఎండీఏ కింద ఇచ్చే ప్రోత్సాహకాలు ఈ విధంగా ఉన్నాయి:

 

వివరాలు

కాటన్ / మస్లిన్ / ఉలెన్ & పాలీవస్త్ర కోసం

పట్టు కోసం

స్పిన్నర్లు / నేత కార్మికులు / ఇతర కళాకారులు

35%

30%

కార్యకర్తల భాగస్వామ్యం

14%

10%

కేఐల వాటా

51%

60%

పథకాలను సమర్థవంతంగా, సకాలంలో అమలు చేయడానికి, జాప్యాన్ని నివారించడానికి, పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశ్యంతో, కేవీఐసీ ద్వారా ఆన్‌లైన్ పోర్టళ్లను అభివృద్ధి చేయడం జరిగింది.

ప్రభుత్వ శాఖలు, రైల్వే, రక్షణ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ, పారామిలిటరీ బలగాలు, ఇతర కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు వంటి టోకు కొనుగోలుదార్ల అవసరాలను కేవీఐసీ తీరుస్తోంది. తద్వారా, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలను పెంచుతోంది. జీఈఎం పోర్టల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత 30 రకాల ఖాదీ ఉత్పత్తులను జీఈఎం పోర్టల్‌లో కేవీఐసీ అప్‌లోడ్ చేసింది.

గత రెండు సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు/సంస్థలకు సరఫరా చేసిన కేవీఐ ఉత్పత్తుల వివరాలు:

                                                                   (రూ. లక్షల్లో)

సంవత్సరం

సరఫరా మొత్తం

2021-22

8765.15

2022-23

9202.27

దేశంలో, విదేశాల్లో కేవీఐ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహించడానికి, పెంచడానికి కేవీఐసీ ద్వారా ప్రభుత్వం తీసుకున్న చర్యలు:

  1. “ఖాదీ ఇండియా” పేరిట ఉన్న 8 డిపార్ట్‌మెంటల్ సేల్స్ ఔట్‌లెట్లు, 18 కేవీఐసీ శాఖలు, దేశవ్యాప్తంగా ఖాదీ సంస్థల (కేఐలు) యాజమాన్యంలో ఉన్న 8,035 విక్రయ కేంద్రాల ద్వారా కేవీఐ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
  2. ఖాదీ, వీఐ ఉత్పత్తుల విక్రయం కోసం khadiindia.gov.in అనే పోర్టల్‌ను కేవీఐసీ రూపొందించింది.
  3. 2022 నవంబర్ 14 నుంచి 27వ తేదీ వరకు, న్యూదిల్లీలో 'ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్' (ఐటీపీవో) నిర్వహించిన ఐఐటీఎఫ్‌ 2022లో కేవీఐసీ పాల్గొంది, ఆ కార్యక్రమంలో రూ.12.10 కోట్ల విక్రయాలు జరిగాయి.
  4. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు, పది ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి కేవీఐసీ రూ.22.68 కోట్ల అమ్మకాలు చేసింది.
  5. కేవీఐసీ పథకాలు, కేవీఐ ఉత్పత్తుల గురించి ప్రచారం, అవగాహన కల్పించడం కోసం, ఇతర ప్రభుత్వ విభాగాలు/ఎన్‌జీవోలు నిర్వహించిన 28 కార్యక్రమాల్లో కేవీఐసీ పాల్గొంది/సహభాగస్వామిగా ఉంది.
  6. 2023 మార్చి 9న, ముంబైలోని జియో వర్డ్ గార్డెన్‌లో రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (ఆర్‌బీఎల్‌), హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెయూఎల్‌) సంయుక్తంగా నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఎఫ్‌డీసీఐ భాగస్వామ్యంతో కేవీఐసీ పాల్గొంది.
  7. "హర్ ఘర్ తిరంగ" కార్యక్రమం కింద అన్ని కేవీఐ విక్రయ కేంద్రాల్లో జాతీయ జెండా విక్రయాల ప్రచారం ఈ నెల 13 నుంచి 15 వరకు జరుగుతుంది.
  8. కేవీఐ సెక్టార్‌తో అనుసంధానమై ఉన్న ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, లింక్డ్‌ఇన్‌, ఓఆర్‌ఎం వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.
  9. అధునాతన ఖాదీ వస్త్రాల ఆకృతి అభివృద్ధి, వస్త్ర అభివృద్ధి కోసం నిఫ్ట్‌తో ఒప్పందం కుదిరింది.
  10. ఖాదీ బ్రాండ్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఖాదీ ట్రేడ్‌మార్క్ నమోదు ప్రారంభమైంది.
  11. ఖాతాదార్లను ఆకర్షించడానికి, ఖాదీ & వీఐ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి వివిధ సందర్భాలు/పండుగల్లో ప్రత్యేక తగ్గింపులు ప్రకటించారు.

కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

*****


(Release ID: 1945681)
Read this release in: English , Urdu