పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
దేశంలో జంతుప్రదర్శనశాలల స్థితిగతులు
प्रविष्टि तिथि:
03 AUG 2023 5:06PM by PIB Hyderabad
దేశంలో వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972లోని సెక్షన్ 38 - హెచ్ ప్రకారం కేంద్ర జూ అథారిటీ 155 జంతు ప్రదర్శనశాలలను గుర్తించింది. దేశంలో గుర్తించిన జూల సంఖ్యను రాష్ట్ర/ యుటిల వారీగా అనెక్చర్-1లో ఇవ్వడం జరిగింది.
గత ఐదేళ్ళలో వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972లోని సెక్షన్ 38హెచ్ (1-ఎ) ప్రకారం సెంట్రల్ జూ అథారిటీ ద్వారా స్థాపనకు ముందస్తు అనుమతి పొందిన రాష్ట్ర/ యూటీల వారీగా జంతు ప్రదర్శన శాలల సంఖ్యను అనెక్చర్-2లో ఇవ్వడం జరిగింది.
సెంట్రల్ జూ అథారిటీ జంతుప్రదర్శన శాలల నిర్వహణ, సంరక్షణ, విద్య, జంతు సంక్షేమాన్ని మెరుగుపరచడానికి, జూల మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి, వాటిని పూడ్చేందుకు వ్యూహాలను రూపకల్పన చేయడానికి మేనేజ్‌మెంట్ ఎఫెక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఇఇ) ద్వారా జంతుప్రదర్శన శాలల క్రమబద్ధమైన అంచనాను ఏర్పాటు చేసింది.
ఎంఇఇ- జూను ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు. మొదటి దశను 2021లో నిర్వహించగా ఇందులో 39 జూలు (16 భారీ కేటగిరీ జూలు, 23 మధ్యతరహా కేటగిరీ జూలు) ఉన్నాయి.
***
(रिलीज़ आईडी: 1945603)
आगंतुक पटल : 207