శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైన్స్, టెక్నాలజీ శాఖ (డి ఎస్ టి) కింద నిధి (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెస్ ఇన్నోవేషన్స్) ప్రోగ్రామ్ దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ లు , స్టార్టప్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ కు మద్దతు ఇవ్వడానికి వివిధ విభాగాలను కలిగి ఉంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సి ఎస్ ఐఆర్ ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా ఇప్పటివరకు 300 స్టార్టప్ లు/ఇంక్యుబేషన్ లకు మద్దతు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 03 AUG 2023 1:56PM by PIB Hyderabad

దేశంలోని స్టార్టప్ లలో సృజనాత్మకతను పెంపొందించడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2016లో నిధి (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్) అనే గొడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) , పి ఎం ఒ,  పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ లు, స్టార్టప్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ కు మద్దతు ఇవ్వడానికి నిధి కార్యక్రమంలో వివిధ భాగాలు ఉన్నాయని రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం లో డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ స్థాయిలో నిధి- ప్రయాస్ (యువ,  ఔత్సాహిక ఆవిష్కర్త లను , స్టార్టప్ లను ప్రోత్సహించడం,  వేగవంతం చేయడం) కార్యక్రమం ఆవిష్కర్తలకు వారి ఆలోచనలను ప్రోటోటైప్ లుగా మార్చడానికి

మార్గదర్శకత్వాన్ని, ఆర్థిక మద్దతును అందిస్తుంది. నిధి ఎంటర్ప్రెన్యూర్స్-ఇన్-రెసిడెన్స్ (ఇఐఆర్) ప్రోగ్రామ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ఎంచుకునే విద్యార్థులకు ఫెలోషిప్పు లను అందిస్తుంది. నిధి సీడ్ సపోర్ట్ ప్రోగ్రామ్ స్టార్టప్ లకు ప్రారంభ దశ సీడ్ సపోర్ట్ ఫండింగ్ లభ్యతను అందిస్తుంది ఇంకా నిధి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ స్టార్టప్ ల పెట్టుబడి సంసిద్ధతను వేగవంతం చేస్తుంది. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లు (టీబీఐలు), సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సి ఒ ఇ ) ద్వారా టెక్నాలజీ రంగాల్లో స్టార్టప్ లను ఇంక్యుబేషన్ చేయడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు నిధి కార్యక్రమం ఎంతగానో దోహదపడింది.

 

సాంకేతిక పరిజ్ఞానం , ఉత్పత్తులను అనువదించడానికి అత్యాధునిక ఇంక్యుబేషన్ సౌకర్యాలను రూపొందించడంలో , అభివృద్ధి చేయడంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా ఎస్ అండ్ టి జోక్యాల ప్రయోజనాన్ని సమాజం, పరిశ్రమ , దేశానికి బదిలీ చేసేలా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ లు, ఎంఎస్ఎం ఇ లకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తుందని మంత్రి చెప్పారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వినూత్న నమూనాలు / విధానాలను ఉపయోగించి తన ప్రయోగశాలలలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న నేడు దేశంలోని ప్రముఖ పరిశోధన - అభివృద్ధి సంస్థలలో సిఎస్ఐఆర్ ఒకటి అని చెప్పారు. వీటితో పాటు

ఎంఎస్ఎం ఇ లు, స్టార్టప్లు, వ్యక్తిగత ఆవిష్కర్తల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల కోసం కొన్ని కామన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్స్ (సి ఆర్ టి డి హెచ్)లను కూడా డి ఎస్ఐఆర్ సహకారంతో సీఎస్ఐఆర్ లో ఏర్పాటు చేశారు.

 

బిఐఆర్ఎసి (బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్) ద్వారా బయోటెక్నాలజీ విభాగం , దాని వివిధ పథకాలు , చొరవలు స్టార్టప్ లు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలను అనువాద పరిశోధన , ఆవిష్కరణలను చేపట్టడానికి ప్రోత్సహిస్తోంది.  ఇది ప్రజలకు తక్కువ ధరలో ఉత్పత్తులు , సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. బిఐఆర్ ఎసి పథకాలు బయోటెక్ సంస్థల స్థాపనను ప్రోత్సహిస్తాయి. బయోటెక్నాలజీ డొమైన్ లో స్టార్టప్ లకు మెంటరింగ్, ఫండింగ్, వాలిడేషన్/పైలట్ టెస్టింగ్, పెట్టుబడిదారులతో అనుసంధానం కావడానికి మద్దతు లభిస్తుంది.

 

ఎంఎస్ఎంఇ లు, స్టార్టప్లు , వ్యక్తిగత ఆవిష్కర్తలు, ఆర్ అండ్ డీ ఇన్స్టిట్యూట్లు,  విద్యావేత్తలతో సహా పరిశ్రమలను భాగస్వామ్యం చేయడం ద్వారా రక్షణ,  ఏరోస్పేస్ లో సృజనాత్మకత , సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి పర్యావరణ వ్యవస్థ సృష్టికి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడిఇఎక్స్) మద్దతు ఇస్తుంది.

ఇంక్యుబేటర్లకు ఆర్థిక, సాంకేతిక సహకారం ద్వారా టెక్నాలజీ ఆధారిత ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించే లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం ఇ ఐ టి వై) టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ (టైడ్ 2.0) పథకాన్ని ప్రారంభించింది.

 

ఐసిఎఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ఫండ్ ఐసిఎఆర్ నెట్వర్క్ లో ఇంక్యుబేషన్ కార్యకలాపాల కింద అగ్రి-టెక్ కు సంబంధించిన స్టార్టప్ లను ప్రోత్సహిస్తుంది, ఇందులో 50 ఇన్స్టిట్యూట్లలో అగ్రి-బిజినెస్ ఇంక్యుబేటర్ (ఎబిఐ) కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడానికి డిఎస్ టి నిధి కార్యక్రమం ద్వారా, వివిధ టెక్నాలజీ డొమైన్ లలో వినూత్న స్టార్టప్ లకు ఇంక్యుబేషన్ , మెంటరింగ్ మద్దతును అందించడానికి 8 నిధి సి ఒ ఇ లు , 40 నిధి టిబిఐలు , 20 నిధి సమ్మిళిత టిబిఐలను అకాడమిక్ సెటప్ లలో ఏర్పాటు చేశారు.

 

సి ఎస్ ఐ ఆర్ ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా ఇప్పటివరకు 300 స్టార్టప్లు/ఇంక్యుబేషన్లకు మద్దతు ఇచ్చామని జితేంద్ర సింగ్ తెలిపారు.

 

దేశంలోని 21 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో బిఐఆర్ఎసి బయోనెస్ట్ ఇ-యువ (ఎంపవర్టింగ్ యూత్ ఫర్ అండర్ టేకింగ్ వాల్యూ యాడెడ్ ఇన్నోవేషనల్ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్) పథకాల ద్వారా మద్దతు పొందిన 75 ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, బయోటెక్ ఇగ్నిషన్ గ్రాంట్ (బిగ్) కింద సుమారు 900 సృజనాత్మక ప్రాజెక్టులకు మద్దతు బిరాక్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ద్వారా సాధించిన పురోగతి.

 

స్టార్టప్ సృష్టికి నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రధానంగా అకడమిక్, రీసెర్చ్, టెక్నికల్, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో టీబీఐలు/ఎస్ టి ఇ పి లకు డీఎస్ టి మద్దతు ఇస్తోంది. ఆతిథ్య సంస్థ (హోస్ట్ ఇనిస్టిట్యూట్) లో నైపుణ్యం, ఎస్ అండ్ టి వ్యవస్థాపక మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఈ ప్రోగ్రామ్ సహాయపడుతుంది. ఇన్నోవేటర్లు, పరిశోధకులు, ఎస్ అండ్ టీ అధ్యాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వినూత్న స్టార్టప్ లను ఏర్పాటు చేయడానికి బలమైన వేదికను అందించడం ద్వారా ప్రణాళిక స్థాయి నుంచి పీఓసీ, ఇంక్యుబేషన్ నుంచి సీడ్ ఫండింగ్ వరకు సంపూర్ణ మద్దతును డీఎస్ టీ అందిస్తుంది.

 

ఎస్ టిఇపిలు , టిబిఐల స్థాపిత నెట్ వర్క్ విజయాన్ని ధృవీకరించడానికి

డిఎస్ టి తీసుకున్న చర్యలలో  దేశవ్యాప్తంగా మెరుగైన ఔట్ రీచ్ కోసం స్టార్టప్ లకు వర్చువల్ ఇంక్యుబేషన్ ద్వారా మద్దతు ఇవ్వడం మొదలైనవి. అదనంగా, నిధి -ప్రోమోటింగ్ , యాక్సిలరేటింగ్ యంగ్ అండ్ అస్పైరింగ్ ఇన్నోవేటర్స్ అండ్ స్టార్టప్స్ (ప్రయస్) ఇన్నోవేటర్‌లకు ప్రీ-ఇంక్యుబేషన్ దశలో మద్దతునిస్తుంది.  ఇంకా స్టార్టప్‌ల బలమైన పైప్‌లైన్‌ను రూపొందించేలా చేస్తుంది. నిధి-సీడ్ సపోర్ట్ ప్రోగ్రామ్ (నిధి-ఎస్ఎస్పి ) ద్వారా ఇంక్యుబేషన్ స్టార్టప్ లకు ప్రారంభ దశ లో నిధుల ను అందించడం, ఇంక్యుబేటర్ లో స్టార్టప్  ల విజయాన్ని బలోపేతం చేయడం ఈ విభాగం తీసుకున్న మరో చర్య. ఉద్యోగార్థుల కంటే ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారడానికి విద్యార్థులను ప్రేరేపించడానికి, నిధి ఎంటర్ప్రెన్యూర్స్-ఇన్-రెసిడెన్స్ (ఇఐఆర్) కార్యక్రమం డిఎస్ టి తీసుకున్న మరో  చర్య. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇన్నోవేషన్, స్టార్టప్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేయడానికి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని విద్యా వ్యవస్థలలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లకు మద్దతు ఇవ్వడానికి నిధి- ఇంక్లూజివ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (ఐటీబీఐ) ప్రోగ్రామ్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని డీఎస్ టి ప్రారంభించింది. భౌగోళికం, లింగ (జండర్),  ప్రత్యేక సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల పరంగా వ్యవస్థాపక సమ్మిళితతను పెంచడానికి ఐటిబిఐ ప్రోగ్రామ్ సహాయపడింది.

 

<><><><><>


(Release ID: 1945490) Visitor Counter : 134


Read this release in: English , Urdu