రైల్వే మంత్రిత్వ శాఖ
వివిధ రాష్ట్రాల్లో కవాచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ టెండర్లు ప్రదానం
Posted On:
02 AUG 2023 5:00PM by PIB Hyderabad
కవాచ్ యొక్క సంస్థాపన మరియు భద్రతా లక్షణాలకు సంబంధించి, వివరాలు:
1. కవాచ్ రక్షణ వ్యవస్థ స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ. కవాచ్ అనేది అత్యంత సాంకేతికత కలిగిన వ్యవస్థ, దీనికి అత్యధిక ఆర్డర్ యొక్క భద్రతా ధృవీకరణ అవసరం.
2. లోకో పైలట్ అలా చేయడంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్లను ఉపయోగించడం ద్వారా నిర్దేశిత వేగ పరిమితుల్లో రైలులో నడుస్తున్న లోకో పైలట్కి కవాచ్ సహాయం చేస్తుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడపడానికి కూడా సహాయపడుతుంది.
3. ప్యాసింజర్ రైళ్లలో కవచ్ మొదటి ఫీల్డ్ ట్రయల్స్ ఫిబ్రవరి 2016లో ప్రారంభించబడ్డాయి. తద్వారా పొందిన అనుభవం మరియు 3వ పక్షం (ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్సర్: ఐఎస్ఏ) ద్వారా సిస్టమ్ యొక్క ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ ఆధారంగా 2018-19లో మూడు సంస్థలు కవచ్ సరఫరా చేసేందుకు ఆమోదించబడ్డాయి.
4. తరువాత జూలై 2020లో కవాచ్ జాతీయ ఏటీపీ వ్యవస్థగా స్వీకరించబడింది.
5. దక్షిణ మధ్య రైల్వేలో కవచ్ వ్యవస్థను 1465 రూట్ కిమీ (ఆర్.కె.ఎం.) మరియు 121 లోకోమోటివ్లు (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్లతో సహా) మోహరించారు. ఇందులో ఇప్పటివరకు తెలంగాణ (684 రూట్ కి.మీ.), ఆంధ్ర ప్రదేశ్ (66 రూట్ కి.మీ.), కర్ణాటక (117 రూట్ కి.మీ.) & మహారాష్ట్రలో (598 రూట్ కి.మీ.) మేర మొహరించారు.
6. ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా కారిడార్లకు (సుమారు 3000 రూట్ కిమీ) కవాచ్ టెండర్లు ఇవ్వబడ్డాయి. పశ్చిమ బెంగాల్ (229 రూట్ కి.మీ.), జార్ఖండ్ (193 రూట్ కి.మీ.), బీహార్ (227 రూట్ కి.మీ.), ఉత్తర ప్రదేశ్ (943 రూట్ కి.మీ.), ఢిల్లీ (30 రూట్ కి.మీ.), హర్యానా (81 రూట్ కి.మీ.), రాజస్థాన్ (425 రూట్ కి.మీ.), మధ్యప్రదేశ్ (216 రూట్ కి.మీ.), గుజరాత్ (526 రూట్ కి.మీ.), మహారాష్ట్ర (84 రూట్ కి.మీ.) రాష్ట్రాలలో పనులు కొనసాగుతున్నాయి.
7.భారతీయ రైల్వేలు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) మరియు మరో 6000 రూట్ కి.మీ.కోసం వివరణాత్మక అంచనాను సిద్ధం చేస్తోంది.
8.ప్రస్తుతం కవాచ్ కోసం ఆమోదించబడిన మూడు భారతీయ ఓఈఎంలు ఉన్నాయి. కెపాసిటీని పెంపొందించడానికి మరియు కవాచ్ అమలును పెంచడానికి మరింత మంది విక్రేతలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
9.కవాచ్ స్టేషన్ ఎక్విప్మెంట్తో సహా ట్రాక్ సైడ్ను అందించడానికి అయ్యే ఖర్చు సుమారు రూ. 50 లక్షలు/కిమీ మరియు లోకోలో కవాచ్ పరికరాలను అందించడానికి అయ్యే ఖర్చు సుమారు రూ.70 లక్షలు/ లోకో. కవాచ్ అమలు కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం రూ. 351.91 కోట్లు. కవాచ్ కోసం 2023-24 సంవత్సరంలో రూ. 710.12 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. భారతీయ రైల్వే ప్రాజెక్ట్లు రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉండవచ్చు కాబట్టి ప్రాజెక్ట్లు జోన్ వారీగా మంజూరు చేయబడ్డాయి. రాష్ట్రాల వారీగా కాదు. అందువల్ల, రాష్ట్రాల వారీగా ఖర్చు వివరాలు నిర్వహించబడవు.
రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభకు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
(Release ID: 1945234)
Visitor Counter : 114