సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం 1,750 మంది విదేశీ సివిల్ సర్వెంట్లకు ‘ఎన్‌సిజిజి’ శిక్షణ: డాక్టర్ జితేంద్ర సింగ్
సామర్థ్య వికాస కార్యక్రమంతో లాటిన్ అమెరికా...
ఆఫ్రికా సహా పొరుగుదేశాలకు ఎంతో ప్రయోజనం
Posted On:
02 AUG 2023 4:20PM by PIB Hyderabad
దేశంలో 45 అంతర్జాతీయ సామర్థ్య వికాస కార్యక్రమాల ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,750 మంది అంతర్జాతీయ సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ సమాచారం వెల్లడించారు. ఇందుకోసం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.17,60,26,500 మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, కంబోడియా, మారిషస్, శ్రీలంక, మయన్మార్, గాంబియాల నుంచి 1,425 మందికి సామర్థ్య వికాస కార్యక్రమం కింద శిక్షణ ఇస్తారని తెలిపారు. అలాగే ఆఫ్రికా దేశాలతోపాటు ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ (ఎఫ్‌ఐపిఐసి)/ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఒఆర్‌ఎ), లాటిన్ అమెరికా దేశాల (ఎల్‌ఎసి) వారికి బహుళ కోర్సులు మాత్రమేగాక ఒక ‘ఇ-ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్’ (ఐటిఇసి) కోర్సు సహా ‘ఆధునిక పాలన పద్ధతులపై ప్రత్యేక కార్యక్రమం’ కింద శిక్షణ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) వివిధ దేశాల సివిల్ సర్వెంట్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. ఇందుకోసం సంవత్సరం వారీగా ఇప్పటివరకూ మంజూరైన/వెచ్చించిన నిధుల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
మంజూరైన/వెచ్చించిన నిధులు (రూ.లలో)
|
2014-15
|
3,24,79,000/
|
2015-16
|
3,82,76,000/
|
2016-17
|
2,63,01,422/
|
2017-18
|
3,17,25,250/
|
2018-19
|
79,17,832/
|
2019-20
|
4,64,37,450/
|
2021-22
|
1,66,75,200/
|
2022-23
|
6,92,45,117/
|
2023-24 (జూలై 2023దాకా)
|
6,13,67,500/
|
ఇతర దేశాల నుంచి శిక్షణకు వచ్చిన సివిల్ సర్వెంట్ల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:
దేశం
|
శిక్షణార్థుల సంఖ్య
|
బంగ్లాదేశ్
|
2099
|
మాల్దీవ్స్
|
818
|
మయన్మార్
|
97
|
గాంబియా
|
49
|
ఇతర ఆఫ్రికా దేశాలు
(కెన్యా, టాంజానియా, టునీషియా, సీషెల్స్
|
19
|
కంబోడియా
|
30
|
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఎన్‌సిజిజి శాఖ కార్యాలయం ఉండగా దేశంలో ఎక్కడా దీనికి ప్రాంతీయ కార్యాలయాలు/శాఖల ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనా లేదు.
*****
(Release ID: 1945231)