రైల్వే మంత్రిత్వ శాఖ
2023, జూన్ 30వ తేదీ వరకు 48 గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్స్ ప్రారంభించబడ్డాయి
Posted On:
02 AUG 2023 4:55PM by PIB Hyderabad
కార్గో టెర్మినల్స్ ఏర్పాటులో ఇండస్ట్రీ నుంచి పెట్టుబడులను పెంచడానికి, 'గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ)' పాలసీ ప్రారంభించబడింది, ఇందులో గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్(జీసీటీ)లను రైల్వేయేతర ఏజెన్సీలు అభివృద్ధి చేస్తున్నాయి.
జూన్ 30, 2023 వరకు, దేశవ్యాప్తంగా మొత్తం 48 గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) ప్రారంభించబడ్డాయి. ఇందులో జార్ఖండ్‌లోని 05 గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ)లు ప్రారంభించగా.. అందులో పట్రాటు, సింద్రీ, గొడ్డ, పాకూర్ మరియు థాపర్‌నగర్‌లో ఉన్నాయి.
గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) పాలసీ నిబంధనల ప్రకారం, ప్రైవేట్ పార్టీలు/ఏజెన్సీలు/కంపెనీలు సెటప్ టెర్మినల్స్ కోసం ముందుకు వస్తాయి. గతి శక్తి కార్గో టెర్మినల్ ఆపరేటర్లు 'ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్' మంజూరు అయిన ఇరవై నాలుగు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) విధానం భారతీయ రైల్వేలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. తద్వారా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఉపాధి కల్పనలో గుణకార ప్రభావాన్ని కలిగి ఉన్నందున సంఖ్యను నిర్ధారించలేము.
రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1945226)
Visitor Counter : 104