ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశాన్ని సందర్శించే విదేశీయులు, ఎన్ఆర్ఐలు యుపిఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు
Posted On:
31 JUL 2023 7:02PM by PIB Hyderabad
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) 2023 ఫిబ్రవరి 10వ తేదీన RBI/2022- 23/176CO.DPSS.POLC.No.S–1907/02.14.006/2022-23 సర్కులర్ ద్వారా విదేశీయులు, ఎన్ఆర్ఐలు దేశాన్ని సందర్శించిన సమయంలో వారు ఇక్కడ ఉన్నన్ని రోజులూ యుపిఐ ద్వారా చెల్లింపులు చేసుకునేందుకు అనుమతించింది. ఇందుకు దీటుగా ఆర్ బిఐ ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (పిపిఐ) మాస్టర్ ఆదేశాల్లో మార్పులు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరద్ లోక్ సభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు.
ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో (బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ) జి-20 దేశాలకు చెందిన ప్రయాణికులకు కూడా తేలిగ్గా చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా ఈ సదుపాయాన్ని విస్తరించారు. అంతే కాదు, తమ ఎన్ఆర్ఇ/ఎన్ఆర్ఓ ఖాతాలను అనుసంధానం చేసుకునే ఎన్ఆర్ఐలకు కూడా యుపిఐ అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఒక నిబంధన కూడా రూపొందించింది. సింగపూర్, ఆస్ర్టేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, కతార్, సౌదీ అరేబియా, యుఏఇ, యుకె వంటి పది దేశాలు ఈ సదుపాయం ఉపయోగించుకునేందుకు అంగీకరించడాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేరషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ) ప్రశంసించింది.
2018 సంవత్సరంలో జరిగిన యుపిఐ లావాదేవీల విలువపరంగా ఈ దిగువ పట్టికలో చూడవచ్చు.
సంవత్సరం
|
మొత్తం (కోట్లలో)
|
విలువ (లక్షల కోట్లలో)
|
2018
|
374.63
|
5.86
|
2019
|
1078.75
|
18.37
|
2020
|
1888.09
|
33.88
|
2021
|
3873.31
|
71.58
|
2022
|
7403.97
|
125.94
|
2023*
|
5183.85
|
83.20
|
* నోట్ - కాలెండర్ సంవత్సరం 2023 జనవరి-జూన్ నెలల మధ్య యుపిఐ డేటా ఆధారం : ఆర్ బిఐ
విదేశాలకు యుపిఐ అనుమతులు 2022 సంవత్సరంలో మాత్రమే ప్రారంభమయ్యాయని మంత్రి మరింత సమాచారం అందిస్తూ తెలిపారు. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ) పూర్తి యాజమాన్య సంస్థ ఎన్ పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ పిఐఎల్) యుపిఐ అంతర్జాతీయీకరణ లక్ష్యంగానే పని చేస్తుంది. సహకారానికి అవకాశం ఉన్న దేశాలకు యుపిఐని విస్తరించే చర్యలను ఆర్ బిఐ చేపడుతుందని మంత్రి చెప్పారు.
***
(Release ID: 1944892)
Visitor Counter : 130