గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన సంస్కృతిని ప్రోత్సహించేందుకు పలు గిరిజన మేళాలు, ఉత్సవాలకు గిరిజన వ్యవహారాల శాఖ నిధులు

Posted On: 31 JUL 2023 4:49PM by PIB Hyderabad

 

అటవీ సంపదను సేకరించి జీవించే గిరిజన కుటుంబాలు  సహా ప్రాచీన, సాంప్రదాయిక గిరిజన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంది.  ‘‘గిరిజన పరిశోధన సంస్థ మద్దతు’’కు, ‘‘గిరిజన పరిశోధన, సమాచారం, విద్య, కమ్యూనికేషన్లు, సంఘటనల’’ పరిరక్షణకు మంత్రిత్వ శాఖ ఎన్నో పథకాలు నిర్వహిస్తోంది. వాటి కింద గిరిజన భాష, సంస్కృతి, కళాఖండాలు, పురాతన ప్రతులు, ఆచారాలు, సాంప్రదాయాల పరిరక్షణకు మంత్రిత్వశాఖ పలు కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 27 గిరిజన పరిశోధనా సంస్థలు పని చేస్తున్నాయి. అవి నిర్వహించిన పలు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.

         i.            గిరిజన ప్రజల సాహస, దేశభక్తి ప్రపూరితమైన కార్యకలాపాలను గుర్తించి, గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి ‘‘టిఆర్ఐలకు మద్దతు’’ పథకం కింద 10 గిరిజన స్వాతంత్ర్య యోధుల మ్యూజియంలను మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. 

        ii.       అన్ని రకాల పరిశోధన పత్రాలు, పుస్తకాలు, నివేదికలు, పత్రాలు, జానపద గేయాలు, ఫొటోలు/వీడియోలు వెతుక్కోవడానికి వీలుగా డిజిటల్  రిపోజిటరీని ఏర్పాటు చేసింది. ఈ రిపోజిటరీలో గిరిజన పరిశోధన సంస్థలకు చెందిన 10,000 పైగా ఫొటోగ్రాఫ్  లు, వీడియోలు, ప్రచురణలు ఉన్నరాయి. https://repository.tribal.gov.in లింక్ (గిరిజన డిజిటల్ పత్రాల రిపోజిటరీ),  https://tribal.nic.in/repository/  (గిరిజన రిపోజిటరీ) లింక్ ద్వారా వాటిని అన్వేషించవచ్చు.

       iii.       నాగాలాండ్  కు చెందిన హార్న్  బిల్  షెస్టివల్, తెలంగాణకు చెందిన మేడారం జాతరకు టిఆర్ఐ పథకం ద్వారా నిధులు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే జానపద నృత్యాలు, జానపద గీతాలు, వంటకాలు;  నైపుణ్యాన్ని తెలియచేసే వర్ణచిత్రాలు, కళాఖండాలు, వైద్య రీతులను తెలియచేసే ప్రదర్శనలు నిర్వహించడానికి వీలుగా గిరిజన మేళాలు, ప్రదర్శనలు నిర్వహించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులు అందిస్తోంది.

       iv.       ప్రధానమంత్రి జనజాతీయ వికాస్  మిషన్ (పిఎంజెవిఎం) కింద  ట్రైఫెడ్ ఆది మహోత్సవ్ (గిరిజన కళలు, కళారీతులు, వంటకాల ప్రదర్శనకు, గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ కు జాతీయ స్థాయి మేళా); గిరిజన కళాకాలుల మేళాలు (టామ్ లు) నిర్వహిస్తోంది. కొత్త కళాకారులు, కొత్త ఉత్పత్తులను రాష్ర్ట/జిల్లా/గ్రామీణ స్థాయిలోనే ఉత్పత్తి దశలో గుర్తించి గిరిజన ఉత్పత్తుల మూలాలను విస్తరిస్తోంది.

        v.       గిరిజన భాష, మాండలికాలు, రాతప్రతుల సంరక్షణ;  గ్రంథాలయాల ఏర్పాటు, జానపద రీతులు, జానపద గాథల డాక్యుమెంటేషన్  కు, ప్రోత్సాహానికి మంత్రిత్వ శాఖ గ్రాంట్లు అందిస్తోంది. సాహితీ మేళాల నిర్వహణ, అనువాదం, సాహిత్య పోటీలు, సామర్థ్యాల నిర్మాణానికి;   సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు గిరిజన సంస్థలు అందించే ప్రతిపాదనలను ఆమోదిస్తుంది.

       vi.       గిరిజన సమస్యలకు చెందిన పరిశోధనలో వ్యత్యాసాలు పూడ్చేందుకు ఉపయోగపడే ఆడియో విజువల్  డాక్యుమెంటరీలు  సహా ప్రముఖ పరిశోధన సంస్థలు/సంఘాలు/విశ్వవిద్యాలయాలు చేపట్టే పరిశోధన/అధ్యయనాలు/పుస్తక ప్రచురణ/డాక్యుమెంటేషన్  కోసం ‘‘గిరిజన  పరిశోధన,  సమాచారం, విద్య, కమ్యూనికేషన్,  సంఘటనలు (ట్రై-ఇసిఇ)’’ కింద నిర్వహిస్తారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల ప్రోత్సాహం, సామర్థ్యాల  నిర్మాణానికి, సమాచార పంపిణీకి, చైతన్య కల్పనకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పరిశోధన అధ్యయనాలు నిర్వహించడానికి ప్రముఖ సంస్థలకు ఆర్థిక సహాయం స్కీమ్  కింద సహాయం అందిస్తారు.

  1. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణకు తగినన్ని రాజ్యాంగపరమైన, చట్టపరమైన రక్షణలున్నాయి. రాజ్యాంగంలోని ఐదవ అధికరణం షెడ్యూల్డు ప్రాంతాలున్న రాష్ర్టాల్లో గిరిజన సలహా మండలుల ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తోంది. అలాంటి రాష్ర్టాల్లో గవర్నర్లకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తోంది. పంచాయతీ (షెడ్యూల్డ్  ప్రాంతాల విస్తరణ) చట్టం, 1996 గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలు, వారి సాంస్కృతిక గుర్తింపు పరిరక్షణకు గ్రామ సభలు/గ్రామపంచాయతీలకు విస్తృత అధికారాలందిస్తోంది. ఇక అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాలకు వర్తించే రాజ్యాంగంలోని ఆరవ అధికరణం సామాజిక ఆచారాల విషయంలో జిల్లాలు, ప్రాంతీయ మండలులకు సాధికారత కల్పిస్తోంది. ఇది ట్రై, ట్రై-ఇసిఇలకు మద్దతు ఇస్తోంది.
  2. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన సంస్కృతి సహా దేశంలో భిన్న ప్రాంతాల సంస్కృతిని ప్రోత్సహించడానికి నోడల్  ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతీయ కేంద్రాలను - పాటియాలా, నాగపూర్, ఉదయ్  పూర్, ప్రయాగ్  రాజ్, కోల్కతా, దిమాపూర్, తంజావూర్ – ఏర్పాటు చేసింది. ఈ సాంస్కృతిక కేంద్రాలు వివిధ సభ్య రాష్ర్టాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్  అందిస్తూ క్రమం తప్పకుండా  పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్ షాపులు, ఎగ్జిబిషన్లు, హస్తకళా మేళాలు నిర్వహిస్తూ ఉంటుంది. గిరిజన కళాకారులు రూపొందించే కళాఖండాల ప్రోత్సాహానికి ట్రైఫెడ్  సహకారంతో గిరిజన మేళాలు, జాతీయ గిరిజనోత్సవాలు, శిల్పగ్రామ్ ఉత్సవాలు, లోకోత్సవ్, నరేలి  పూర్ణిమ, మెర్జర్  దినోత్సవం, బనేశ్వర్  మేళా, రాష్ర్టీయ శిల్ప మేళాలు, గిరిజన సంగీత, నృత్యోత్సవాలు నిర్వహిస్తుంది. తూర్పు ప్రాంత రాష్ర్టాల గిరిజన  సంస్కృతికి దర్పణం పట్టే గిరిజనులు ధరించే విశేషమైన దుస్తులు, సంగీత పరికరాలు, నిత్యం వినియోగానికి ఉపయోగపడే పాత్రలు, దేవతా మూర్తులను కోల్కతాలోని తూర్పు జోన్   సాంస్కృతిక కేంద్రం (ఇజడ్  సిసి) ప్రదర్శించింది.
  3. విద్యామంత్రిత్వ శాఖ తెలియచేసిన ప్రకారం జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ భాషలు సహా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భారతీయ భాషల ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంతరించిపోతున్న భాషల పరిరక్షణ, సంరక్షణ (ఎస్ పిపిఇఎల్) పేరిట ఒక ప్రత్యేక పథకం నిర్వహిస్తోంది. ఈ పథకం కింద మైసూరులోని  సెంట్రల్  ఇన్  స్టిట్యూట్  ఆఫ్ ఇండియన్  లాంగ్వేజెస్ (సిఐఐఎల్) దేశంలో 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడే అన్ని మాతృ భాషల సంరక్షణ, పరిరక్షణ, డాక్యుమెంటేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

 

అటవీ హక్కుల చట్టం, 2006 కింద అడవుల్లో నివశించే వారి సాంప్రదాయిక ఆచారాల హక్కులను, గ్రామ సభలను, గ్రామీణ  స్థాయి సంస్థలను సంరక్షించే  నిబంధన ఒకటుంది. అటవీ హక్కులు గల వారు ఎక్కడుంటే అక్కడ వారి  సాంస్కృతిక, వారసత్వ హక్కులను పరిరక్షిస్తారు.

గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుత లోక్  సభకు సమర్పించిన లిఖితపూర్వక  సమాధానంలో ఈ విషయాలు వెల్లడించారు. 


(Release ID: 1944891)
Read this release in: English , Urdu