నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు హరిత హైడ్రజన్ ఉత్పత్తి , వినియోగం ద్వారా సంవత్సరానికి 50ఎం.ఎం.టి ల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చు: కేంద్ర నూతన , పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్
Posted On:
01 AUG 2023 5:49PM by PIB Hyderabad
భారత్ జి 20 అధ్యక్షతన 22 జూలై 2023న , జి 20 ఇంధన పరివర్తన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు, సుస్థిర, అందరికీ సమానంగా అందుబాటులో ఉండే అన్ని
దేశాలకు ప్రయోజనం కలిగించే అంతర్జాతీయ హైడ్రో జన్ వ్యవస్థ గురించి చర్చించినట్టు కేంద్ర నూతన , పునరుత్పాదక ఇంధన, విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి,
ఉన్నతస్థాయిలో స్వచ్ఛందంగా హైడ్రోజన్ అందుబాటుకు సంబంధించిన విధానాలు అనుసరించాలని నిర్ణయించారు. ఇందులో హైడ్రోజన్ను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వాణిజ్యానికి అవకాశం కల్పించడం,
ఉద్గారాలు లేని లేదా, తక్కువ ఉద్గారాల సాంకేతికతను అందుబాటులోకి తేవడం ఇందులో ఉన్నాయి. హరిత హైడ్రోజన్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ద్వైపాక్షికంగా పలు దేశాలతో సహకరిస్తోంది. 2023 జనవరి 4న జరిగిన కేంద్ర కేబినెట్లో 19,744 కోట్ల రూపాయల పెట్టుబడితో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రకటించింది.
ఈ మిషన్ కింద వివిధ ఆర్థిక,ఆర్థికేతర అంశాలను ప్రకటించారు. అందులో కింది అంశాలు ఉన్నాయి.
1. దేశీయంగా విరివిగా వాడడం,ఎగుమతుల కారణంగా డిమాండ్ ను సృష్టించడం.
2.హరిత హైడ్రోజన్ పరివర్తన కార్యక్రమం(సైట్) కింద, ఎలక్ట్రొలైజర్లు, హరిత హైడ్రోజన్ తయారీదారులకు ప్రోత్సాహకాలు.
3. స్టీలు, మొబిలిటి, షిప్పింగ్ తదితరాలకు పైలట్ ప్రాజెక్టులు
4.గ్రీన్ హైడ్రోజన్ హబ్ల అభివృద్ది
5.మౌలిక వసతుల అభివృద్ధికి మద్దతు.
6.రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ కు సంబంధించి పటిష్టమైన ప్రేమ్ వర్క్ ఏర్పాటు
7. పరిశోధన ,అభివృద్ధి కార్యక్రమం
8. నైపుణ్యాభివృద్ధి
9. ప్రజాచైతన్య, ఔట్ రీచ్ కార్యక్రమం
గ్రీన్ హైడ్రోజన్ పరివర్తన (సైట్) కార్యక్రమం, 17, 490 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన కీలక ఆర్ధిక వ్యూహాత్మక కార్యక్రమం.
ఈ కార్యక్రమం కింద రెండు ప్రత్యేక ఆర్ధిక ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఇవి దేశీయ ఎలక్ట్రొలైజర్ల తయారీ దారులు, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి దారులకు ఉపకరిస్తాయి. ప్రోత్సాహకాలకు సంబంధించి ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను జారీచేసింది.
ఈ మిషన్ 2030 సంవత్సరం నాటికి సంవత్సరానికి 5 ఎంఎంటి ల హరిత హైడ్రోజన్ సామర్ధ్యంతో దేశం నాయకత్వ స్థానంలో ఉంటుందని మంత్రి తెలిపారు. లక్షిత పరిమాణంలో హరిత హైడ్రోజన్ వాడడం వల్ల,
సంవత్సరానికి 50 ఎంఎంటి కార్బన్ డయాక్సైడ్ విడుదలను అరికట్టవచ్చని మంత్రి తెలిపారు.
ఈ సమాచారాన్ని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం,విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ 2023 ఆగస్టు 1న రాజ్యసభలో ఒక ప్రశ్నకు, ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం లో తెలిపారు.
***
(Release ID: 1944888)
Visitor Counter : 197