పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలలో స్థిరమైన పర్యాటకం

Posted On: 31 JUL 2023 5:45PM by PIB Hyderabad

ఒడిశా ప్రభుత్వం మూడు జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల(బయో డైవర్సిటీ హెరిటేజ్ సైట్స్)ను నోటిఫై చేసింది. కంధమాల్ జిల్లాలోని మందసారు హిల్స్, గణపతి జిల్లాలోని మహేంద్రగిరి కొండలు మరియు బోలంగీర్ మరియు బర్గర్ జిల్లాలోని గంధమర్దన్ కొండలు.

కమ్యూనిటీ ఆధారిత ఎకో-టూరిజం అనేది అటవీ ఆధారిత కమ్యూనిటీలకు జీవనోపాధికి ప్రత్యామ్నాయ వనరు. చుట్టుపక్కల కమ్యూనిటీలు పర్యావరణ -పర్యాటక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి మరియు వారి జీవనోపాధికి అనుబంధంగా ప్రయోజనాలు పంచబడతాయి. మందసారు కొండలు మరియు గంధమర్దన్ కొండలలో ఒడిశా ప్రభుత్వం ఒక ప్రకృతి శిబిరాన్ని అభివృద్ధి చేసింది. వాటర్ ఫాల్స్ సందర్శన, వాచ్ టవర్, సైక్లింగ్, చిల్డ్రన్స్ పార్క్, ప్లాంటేషన్, డైనింగ్ హాల్, నేచర్ వాక్, ట్రెక్కింగ్, బర్డింగ్ మరియు హరిశంకర్ మరియు నృసింహనాథ్ తీర్థయాత్రల సందర్శన వంటి కార్యకలాపాలు ఈ ఎకో-టూరిజం డెస్టినేషన్‌లలో చేపట్టబడతాయి.

నేచర్ క్యాంపుల నిర్వహణ కోసం గ్రామాల్లో ఎకో డెవలప్‌మెంట్ కమిటీలు, వన సంరక్షణ సమితిలు, ఎకో టూరిజం గ్రూపులను ఏర్పాటు చేశారు. 16 మంది ఎకో-టూరిజం గ్రూప్ సభ్యులు మందసారు వ్యాలీ నేచర్ క్యాంప్‌లో నిమగ్నమై ఉండగా,  ఆరుగురు ఎకో-టూరిజం గ్రూప్ సభ్యులు నృసింహనాథ్ నేచర్ క్యాంప్‌లో నిమగ్నమై ఉన్నారు. స్థానిక ప్రజలు వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించే ఎకో-గైడ్‌లుగా కూడా శిక్షణ పొందారు. వివిధ కార్యకలాపాలకు సంబంధించి వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడం కోసం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్,  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్, శానిటేషన్, క్లీనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫుడ్ వంటకాలపై ఎక్స్‌పోజర్, చెక్-ఇన్ మరియు చెక్-అవుట్ ప్రోటోకాల్‌లు  సందర్శన కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

అరుదైన మరియు అంతరించిపోతున్న జాతుల వృక్షజాలం మరియు జంతుజాలం గుర్తింపు కోసం పర్యావరణ- గైడ్‌లను అభివృద్ధి చేయడానికి పర్యావరణ అభివృద్ధి కమిటీలు, వన సంరక్షణ సమితిలు, ఎకో-టూరిజం గ్రూప్ సభ్యుల శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒడిశా బయోడైవర్సిటీ బోర్డు నిధులు అందించింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని పర్యావరణ పర్యాటకులకు మెరుగైన అవగాహన కోసం ట్రైల్స్ మరియు ట్రెక్కింగ్ మార్గాలను నిర్వహించడం వంటి చర్యలు చేపట్టింది.

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 1944884) Visitor Counter : 120


Read this release in: English , Urdu