హోం మంత్రిత్వ శాఖ
ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా
నాడు పోస్టు చేయడమైనది:
01 AUG 2023 5:02PM by PIB Hyderabad
పంజాబ్ రాష్ట్రంలో భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు గుండా ఆయుధాలు/మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేయడానికి దేశ వ్యతిరేక శక్తులు /స్మగ్లర్లు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. గత మూడేళ్ల కాలంలో 2023 జూన్ 30 వరకు ఆయుధాలు/మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం డ్రోన్‌లను ఉపయోగించినట్టు గుర్తించడం జరిగింది.
ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:-
i. సరిహద్దుల్లో పట్టు సాధించడానికి సరిహద్దు భద్రతా దళం చర్యలు అమలు చేస్తోంది. సరిహద్దులో 24 గంటలపాటు నిఘా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెట్రోలింగ్, తనికీలు చేయడం , అబ్జర్వేషన్ పోస్ట్‌లను నిర్వహించడం లాంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
ii. అంతర్జాతీయ సరిహద్దు లో సరిహద్దు కంచె ఏర్పాటు.
iii.వెలుతురు సరిగ్గా లేని సమయంలో సరిహద్దు భద్రతా కంచె వెంట బోర్డర్ ఫ్లడ్ లైట్ల ఏర్పాటు.
iv. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ఇతర భద్రతా సంస్థలతో సమన్వయంతో పని చేయడం.
v. వాహనాలు, అదనపు ప్రత్యేక నిఘా పరికరాలు మోహరించడం ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి పంజాబ్ రాష్ట్రంతో సహా ఇండో-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వివరణాత్మక వల్నరబిలిటీ మ్యాపింగ్ నిర్వహించబడింది. సీసీటీవీ /పిటిజెడ్ కెమెరాలు, ఐఆర్ సెన్సార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన ఇన్‌ఫ్రారెడ్ అలారంతో కూడినసమగ్ర అధునాతన సాంకేతిక పరికరాలు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏర్పాటు అయ్యాయి.
vi. డ్రోన్ దాడులు ఎదుర్కోవడానికి పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించారు. యాంటీ-రోగ్ డ్రోన్ ఎస్ఓపీ ని అభివృద్ధి చేసి ఫీల్డ్ యూనిట్లకు పంపిణీ చేయడం జరిగింది.
vii. అంతర్గత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడానికి కోసం డ్రోన్ కదలికలను గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారంఅందించడం జరుగుతోంది. . డ్రోన్ కదలికలు గుర్తించడానికి డ్రాపింగ్ జోన్‌లలో క్రమం తప్పకుండా తనికీలు జరుగుతున్నాయి.
viii. సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు మానవ రహిత వాహనాలు /డ్రోన్ కార్యకలాపాలు, వాటి వల్ల ఎదురయ్యే భద్రతాపరమైన చిక్కులపై అవగాహన కల్పించడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. మానవ రహిత వాహనాలు /డ్రోన్ లకు సంబంధించిన సమాచారాన్ని సరిహద్దు భద్రతా దళం, స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి.
ix. రోగ్ డ్రోన్‌లను ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న సాంకేతికతను అంచనా వేయడానికి రూజ్ డ్రోన్‌లతో వ్యవహరించడంలో దాని ప్రభావాన్ని ధృవీకరించడానికి సరిహద్దు భద్రతా దళం డీజీ పర్యవేక్షణలో యాంటీ రోగ్ డ్రోన్ టెక్నాలజీ కమిటీ ని హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ ఈ వివరాలు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 1944868)
సందర్శకుల సూచీ సంఖ్య : : 136