భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇ- బస్సుల విస్తరణ
Posted On:
01 AUG 2023 2:20PM by PIB Hyderabad
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్)& ఎలక్ట్రిక్ వాహనాల ( ఎఫ్ఎఎంఇ- ఫేమ్) పథకం (మిశ్రిత & ఎలక్ట్రిక్ వాహనాల త్వరితగత తయారీ, కొనుగోలు లేదా స్వీకారం (ఫేమ్) పథకం) కింద మంజూరుచేసిన ఇ-బస్సుల మోహరింపు కోసం రాష్ట్రాల వారీ ప్రాధాన్యత గడువు ఏదీ లేదు. అయితే, ఇ-బస్సుల సేకరణ కోసం అన్ని ఎంపిక చేసిన నగరాలు / ఎస్‌టియులు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 04 జూన్, 2019 వ తేదీని ఆసక్తి వ్యక్తీకరణ (ఇఒఐ) నెం. 6 (09)/ 2019 ఎన్ఎబి (ఆటో)లో ఇచ్చిన కాలక్రమాన్ని అనుసరించవలసి ఉంటుంది.
శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు, వాహనాల ఉద్గారాల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రభుత్వం మిశ్రిత & ఎలక్ట్రిక్ వాహనాల త్వరితగత తయారీ, కొనుగోలు లేదా స్వీకారం (ఫేమ్) పథకాన్ని 2015లో భారతదేశ వ్యాప్తంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఫేమ్ ఇండియా పథకం ఫేజ్-2ను 01 ఏప్రిల్ 2010 నుంచి ఐదేళ్ళ పాటు, మొత్తం రూ.10,000 కోట్ల బడ్జెట్ తోడ్పాటుతో అమలు చేస్తున్నారు.
ఈ దశ ప్రజా & భాగస్వామ్య రవాణా విద్యుదీకరణకు మద్దతు ఇవ్వడం పై దృష్టిపెట్టడమే కాక సబ్సిడీ ద్వారా 7090 ఇ- బస్సులు, 5 లక్షల ఇ- త్రిచక్ర వాహనాలు, 55000 నాలుగు చక్ర ప్యాసింజర్ కార్లు, 10 లక్షల ద్విచక్రవాహనాలకు మద్దతు ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులలో ఆందోళనను తగ్గించడం కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాల సృష్టికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంకా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది ః
బ్యాటరీ ధరలను తగ్గించేందుకు దేశంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) తయారీకి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ - ఉత్పత్తి లంకెతో ప్రోత్సహకాలు) పథకాన్ని 12 మే, 2021న ప్రభుత్వం ఆమోదించింది.
బ్యాటరీ ధర తగ్గడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్‌ల కోసం ఉత్పత్తి లంకెతో కూడిన చొరవ (పిఎల్ఐ) పథకం కవర్ చేశారు. ఇది 15 సెప్టెంబర్, 2021న ఐదేళ్ళ కాలానికి రూ. 25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఆమోదించింది.
ఇవిల పై జిఎస్టీ 12% నుంచి 5% తగ్గింపు; చార్జర్ల / ఇవిల ఛార్జింగ్ స్టేషన్ల పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించడం జరిగింది.
బ్యాటరీతో నడిచే వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లు ఇవ్వడమే కాక పర్మిట్ అవసరాల నుంచి మినహాయిస్తామని రోడ్డు రవాణా & హైవేల (ఎంఒఆర్‌టిహెచ్) ప్రకటించింది.
ఇవిలపై రహదారి పన్నును మినహాయించాలని రాష్ట్రాలకు సలహా ఇస్తూ ఎంఒఆర్‌టిహెచ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఇవిల ప్రారంభ ధరను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ సమాచారాన్ని భారీ పరిశ్రమల మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ లోక్‌సభకు మంగళవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబులో వెల్లడించారు.
***
(Release ID: 1944866)
Visitor Counter : 100