ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వేదికల తాజా సమాచారం
ఆరోగ్య సంరక్షణ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కింద చేపట్టిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (ఈహెచ్‌ఆర్) ప్రమాణాల ఉద్దేశం
ఏబీడీఎం వ్యవస్థతో అనుసంధానంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ యాప్‌లను నియంత్రించడానికి అనేక మార్గదర్శకాలు, ప్రకటనలు జారీ చేసిన జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ)
Posted On:
01 AUG 2023 2:17PM by PIB Hyderabad
దేశంలో సమీకృత డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు మద్దతునిచ్చే కీలక వ్యవస్థను అభివృద్ధి చేయడం, పౌరుల కోసం సంపూర్ణ ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డును (ఈహెచ్‌ఆర్) సృష్టించడం లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను (ఏబీడీఎం) భారత ప్రభుత్వం ప్రారంభించింది. వివిధ ఆరోగ్య ఐటీ వ్యవస్థల ద్వారా ఆరోగ్య సంరక్షణ సమాచారాన్ని సులభంగా తెలుసుకులా సమాచార ప్రమాణాలను నెలకొల్పేందుకు ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డు ప్రమాణాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఏబీడీఎం వ్యవస్థతో అనుసంధానంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ అప్లికేషన్‌లను నియంత్రించడానికి అనేక మార్గదర్శకాలు, ప్రకటనలను జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) జారీ చేసింది. వాటిలో, ఆరోగ్య సమాచార నిర్వహణ విధానం, సమాచార గోప్యత విధానం, ఏబీడీఎం ఆరోగ్య రికార్డుల (పీహెచ్‌ఆర్) మొబైల్ యాప్ గోప్యత విధానం ఉన్నాయి. ఇవి పౌరుల సమాచారం గోప్యత, రక్షణ కోసం కనీస ప్రమాణాలను నిర్దేశిస్తాయి.
ఏబీడీఎం వ్యవస్థలో భాగమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ యాప్‌లను ప్రామాణీకరించడానికి ఎన్‌హెచ్‌ఏ కొన్ని విధానాలను కూడా తీసుకొచ్చింది. శాండ్‌బాక్స్ విధానంలో, దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య యాప్‌లను విస్తృతంగా వినియోగించేలా చేయడానికి ఆ అప్లికేషన్లు ఏబీడీఎం విధివిధానాలతో ఏకీకృతం చేయడం జరుగుతుంది.
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయం వెల్లడించారు.
****
(Release ID: 1944851)
Visitor Counter : 100