వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సుశ్రి శోభా కరంద్లాజే తో చర్చలు జరిపిన మోల్డోవా డిప్యూటీ ప్రధానమంత్రి, వ్యవసాయ,ఆహార పరిశ్రమల మంత్రి,వ్లాదిమిర్ బోలియా
వ్యవసాయంలో సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించిన ఇరు దేశాల మంత్రులు
Posted On:
31 JUL 2023 7:08PM by PIB Hyderabad
ఈరోజు న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రి శోభా కరంద్లాజే తో మోల్డోవా డిప్యూటీ ప్రధానమంత్రి, వ్యవసాయ,ఆహార పరిశ్రమల మంత్రి,వ్లాదిమిర్ బోలియా సమావేశమై చర్చలు జరిపారు.
మోల్డోవా ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన శోభా కరంద్లాజే భారతదేశం, మోల్డోవా మధ్య 31 సంవత్సరాల సన్నిహిత , స్నేహపూర్వక దౌత్య సంబంధాలను ప్రస్తావించారు. న్యూఢిల్లీలో మోల్దోవన్ రెసిడెంట్ మిషన్‌ను ప్రారంభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.భారత ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదన మేరకు 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన అంశాన్ని మంత్రి ప్రస్తావించారు.ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో చిరుధాన్యాలు పోషించే పాత్రను మంత్రి వివరించారు.
విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని ఎక్కువ చేయడానికి గాయాల అవకాశాలు మంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.
భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడం పట్ల వ్లాదిమిర్ బోలియా హర్షం వ్యక్తం చేశారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారతదేశానికి ఆయన అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగంలో రెండు దేశాల మధ్య సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయాలని ఆయన ప్రతిపాదించారు, ఇది రెండు దేశాల మధ్య సహకారానికి సంస్థాగత యంత్రాంగాన్ని అందిస్తుంది.
భారతదేశానికి వంట నూనెలను ఎగుమతి చేయడం,భారతదేశం నుంచి ఎరువులు,క్రిమి సంహారక మందులను దిగుమతి చేసుకోవడంపై మోల్డోవా ఆసక్తి వ్యక్తం చేసింది. . 2027 లో UN భద్రతామండలిలో భారతదేశం సభ్యత్వం పొందడానికి మోల్డోవా మద్దతు ప్రకటించిందని వ్లాదిమిర్ బోలియా తెలిపారు. ఈయు సభ్యత్వం పొందడానికి తమ దేశం కృషి చేస్తోందని తెలిపిన వ్లాదిమిర్ బోలియా తమ దేశ వస్తువులు ఈయు ప్రమాణాల మేరకు ఉంటాయని వివరించారు. తమ దేశ ఉత్పత్తులు సురక్షితంగా వినియోగించవచ్చు అని తెలియజేశారు. వైన్, యాపిల్ ఉత్పత్తులతో ముడిపడి ఉన్న సే మోల్డోవన్ సంస్కృతిని జీవన విధానాన్ని ఆయన వివరించారు. వైన్, యాపి ఉత్పత్తులను భారతదేశానికి ఎగుమతి చేయడానికి మోల్డోవా సంసిద్ధత వ్యక్తం చేసింది.
మోల్డోవా తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధం చేయాలని సుశ్రి శోభా కరంద్లాజే సూచించారు. సాంకేతిక మార్పిడిలో సహకారం కోసం ప్రతిపాదన పంపవలసిందిగా ఆమె మోల్డోవా ప్రతినిధి బృందాన్ని కోరారు. తమ దేశంలో పర్యటించాలని సుశ్రీ శోభా కరంద్లాజే ను మోల్డోవా మంత్రి ఆహ్వానించారు.
***
(Release ID: 1944614)
Visitor Counter : 112