కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికమ్యూనికేషన్స్‌లో సాంకేతిక, వ్యవస్థాగత సహకార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంఒయుపై సంతకాలు చేసిన ట్రాయ్, సి-డిఒటి
Posted On:
31 JUL 2023 5:26PM by PIB Hyderabad
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డిఒటి) సోమవారం ఢిల్లీలో ఒక అవగాహనా పత్రం (ఎంఒయు) పై సంతకాలు చేశాయి. టెలికాం విభాగం కార్యదర్శి, ట్రాయ్ కార్యదర్శి, సి-డిఒటి సిఇఒ, ట్రాయ్, సి-డిఒటి ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ట్రాయ్ సిఎస్ ఆర్ డిజి శ్రీ అనిల్ కుమార్, సి-డిఒటి రిజిస్ట్రార్ శ్రీ రాజీవ్ కుమార్‌లు ఎంఒయుపై సంతకాలు చేశారు.
టెలికాం, ప్రసార రంగాలలో సాంకేతిక అధ్యయనాలను సంభావితం చేసేందుకు, సమన్వయం చేయడం, భావగ్రహణం చేసేందుకు ట్రాయ్ సెంటర్ ఆఫ్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (ట్రాయ్ సిఎస్ఆర్)ను ట్రాయ్‌లోని అంతర్భాగ సంస్థగా ప్రారంభించారు. పర రంగ చొరవలను సమన్వయం చేయడం, విజ్ఞానాన్ని పంచుకోవడాన్ని సులభతరం చేయడం ద్వారా భారతదేశం సాంకేతిక ఆధారిత వృద్ధిని సాధ్యం చేయడం దీని లక్ష్యం. టెలికమ్యూనికేషన్స్ రంగంలో దాని అభివృద్ధికి సహకరించే ఉద్దేశంతో, సాంకేతిక, సంస్థాగత సహకార యంత్రాంగాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ట్రాయ్ సిఎస్ఆర్ & సి-డిఒటి నేడు సంతకం చేసిన ఎంఒయు ద్వారా కలిసి పని చేయనున్నాయి. ఉమ్మడి దార్శనికతతో, ఉద్భవిస్తున్న సాంకేతికతల సంభావ్యతను అన్వేషించాలన్నది లక్ష్యం. ఈ ఎంఒయు సహకారం, విజ్ఞానాన్ని పంచుకోవడం, నియంత్రణా అభ్యాసాలపై పరిశోధనను ప్రోత్సహించే పర్యావరణాన్ని పెంపొందించడం, నియంత్రణ అంతరాల అధ్యయనాలు, కీలకమైన అంతర్‌దృష్టులను వ్యాప్తి చేయడం దిశగా ఒక ముఖ్య అడుగు.
ఈ శుభ సందర్భంగా హర్షాన్ని వ్యక్తం చేస్తూ, అధికారిక భాగస్వామ్యం ప్రారంభం కావడం అన్నది కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అర్థం చేసుకునే ప్రయాణాన్ని ప్రారంభించడానికి తమకు శక్తినిస్తుందని ట్రాయ్ చెయిర్‌పర్సన్ డాక్టర్ పిడి వాఘేలా పేర్కొన్నారు. నియంత్రణా పద్ధతులై పరిశోధన, అవగాహనలో ఉన్న అంతరాలను పూరించడంలో సహకారాన్ని ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. జ్ఞానాన్ని పంచుకోవడానికి, సామర్ధ్య నిర్మాణానికి తాము సాంకేతిక సెషన్లను, సెమినార్లను, సమావేశాలను నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఉద్భవిస్తున్న సాంకేతికతలలో గల సంభావ్యత అపరిమతమని, ఇటువంటి బాధ్యత, ముందు చూపుతో తాము ఈ కృషిని చేపట్టామన్నారు. తమ వనరులను, జ్ఞానాన్ని, నైపుణ్యాలను సమన్వయం చేయడం ద్వారా ఈ సాంకేతికతల పరివర్తనా శక్తిని అర్థం చేసుకుని, నియంత్రణ, విధానపరమైన అంతరాలను పరిష్కరించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
ఈ ఎంఒయుపై ట్రాయ్, సి-డిఒటి సంతకాలు చేయడానికి వారు చేసిన కృషిని టెలికమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి శ్రీ కె.రాజారామన్ ప్రశంసించారు. ఈ భాగస్వామ్యం విధాన పరిశోధన, నియంత్రణా అధ్యయనాలు, టెలికాం, ప్రసార రంగాలలో రానున్న సాంకేతికతల విజ్క్షాన వ్యాప్తికి నూతన ద్వారాలను తెరవగలదని అభిలషించారు. ఇది విధాన ఆధారిత ఆవిష్కరణను సాధించేందుకు భారత్ తోడ్పడుతుంది. విధాన పరిశోధనల నిమిత్తం విద్యా వేత్తలకు నిధులు ఇచ్చే అవకాశాన్ని ట్రాయ్ పరిశీలించాలని డిఒటి కార్యదర్శి సూచించారు.
***
(Release ID: 1944527)
Visitor Counter : 131