కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

' 5జీ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ సొల్యూషన్ సహకార అభివృద్ధి'కి పరిశ్రమ భాగస్వాములతో కన్సార్టియం ఒప్పందంపై సంతకం చేసిన సి-డాట్

Posted On: 31 JUL 2023 8:43PM by PIB Hyderabad

టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (డాట్) యొక్క ప్రీమియర్ టెలికాం ఆర్&డి సెంటర్ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్) పరిశ్రమ భాగస్వాములతో కలిసి  'కొలబరేటివ్ డెవలప్‌మెంట్‌ అఫ్ డిసగ్రేటెడ్‌ 5జీ రేడియో యాక్సిస్ నెట్‌వర్క్‌ సోల్యూషన్స్' కోసం కన్సార్టియం ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో లేఖ వైర్‌లెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిగ్నల్‌ట్రాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూక్త కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రిసోనస్‌ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఇందులో ఉన్నాయి. కన్సార్టియం భాగస్వాములు రేడియో కమ్యూనికేషన్ ఉత్పత్తుల అభివృద్ధిలో నిమగ్నమై ఉన్న కంపెనీలు. ఇవి 5జీ, ఎల్‌టీఈ మొదలైన వాటి కోసం రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ పరిష్కారాలను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయి.

 

image.png


ఈ ఒప్పందం 'సి-డాట్ సహకార పరిశోధన కార్యక్రమం 2022 (సిసిఆర్‌పి-2022)' కింద రెండవ చొరవ. ఇది తక్కువ ఖర్చుతో కూడిన దేశీయ టెలికాం ఉత్పత్తులు మరియు పరిష్కారాల ఆవిష్కరణ మరియు అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యాన్ని సాధించడానికి ప్రారంభించబడింది. 5జీ ఓపెన్ రాన్‌ను అభివృద్ధి చేయడానికి వివిడిఎన్‌ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వైసిగ్‌ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఇటువంటి మొదటి ఒప్పందం సంతకం చేయబడింది.

పబ్లిక్ & ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌ల కోసం ఎఫ్‌ఆర్‌1 మరియు ఎఫ్‌ఆర్‌2 బ్యాండ్‌లలో పనిచేసే సామర్థ్యం గల O-రాన్ కంప్లైంట్  5G రాన్‌ సొల్యూషన్‌ను అభివృద్ధి చేయడం కోసం పార్టీల మధ్య ఈ ఒప్పంది. సి-డాట్ టెస్టింగ్, ఇంటర్‌పెరాబిలిటీ, ఫీల్డ్ ట్రయల్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) కోసం నిధులు మరియు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా వ్యాపార ఇంక్యుబేటర్ మరియు ఫెసిలిటేటర్‌గా పనిచేస్తుంది; అందువల్ల ప్రత్యామ్నాయ 5జీ రాన్ దేశీయ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారిస్తుంది.

ఒప్పందంపై సంతకం చేసే కార్యక్రమంలో సి-డాట్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ భారతీయ ఆర్‌&డి యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. పరిశ్రమ అంతటా సాంకేతిక బలాన్ని పెంచుకోవడానికి సహకార విధానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ భాగస్వామ్యం స్టార్టప్ ఎంఎస్‌ఎంఈ పర్యావరణ వ్యవస్థలో మరింత మంది టెలికాం ప్లేయర్‌లను సృష్టించడం ద్వారా 5జీ స్పేస్‌లో భారతదేశ స్వావలంబనకు ఉత్ప్రేరకంగా పని చేస్తుందని గౌరవ ప్రధాన మంత్రి "ఆత్మనిర్భర్ భారత్" దార్శనికతకు దోహదపడుతుందని ఆయన అన్నారు. దేశీయంగా రూపొందించబడిన వాణిజ్యపరంగా లాభదాయకమైన మరియు పరిశ్రమ-గ్రేడ్ డిప్లాయబుల్ 5G రాన్‌ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ యొక్క ఈ అభివృద్ధి మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీని పెంపొందిస్తుంది. భారతీయ మేధో సంపత్తిని పెంచుతుంది మరియు మన దేశం సరసమైన 5జీ పరిష్కారాల యొక్క ప్రముఖ ప్రపంచ సరఫరాదారుగా అవతరిస్తుంది.

ఈ కార్యక్రమంలో శ్రీ రాములు టి శ్రీనివాసయ్య, ఫౌండర్ & డైరెక్టర్- లేఖ వైర్‌లెస్ సొల్యూషన్స్; శ్రీ హిమాంషు ఖాస్నిస్, ఫౌండర్ & డైరెక్టర్- సిగ్నల్‌ట్రాన్ సిస్టమ్స్; శ్రీ బాలాజీ రంగస్వామి, సీఈఓ, సూక్త కన్సల్టింగ్; శ్రీ సుబ్బయ్య కె.వి, సీఈఓ, రెసోనస్ టెక్నాలజీస్‌తో పాటు సి-డాట్ డైరెక్టర్లు  డాక్టర్ పంకజ్ కుమార్ దలేలా, శ్రీమతి శిఖా శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు.

సి-డాట్ మరియు కన్సార్టియం భాగస్వాములు తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యాన్ని ఒక అద్భుతమైన విజయంతో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరియు దేశ డిజిటల్ పరివర్తన కోసం స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడానికి తమ దృఢ నిబద్ధతలను పునరుద్ఘాటించారు.

 

****


(Release ID: 1944526) Visitor Counter : 152


Read this release in: English , Hindi