పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఉడాన్ కింద ప్రాంతీయ వాయు కనెక్టివిటీకి ప్రోత్సాహం
Posted On:
31 JUL 2023 4:29PM by PIB Hyderabad
ఆర్సిఎస్ విమానాల నిర్వహణ కోసం ఏరోడ్రోమ్ లైసెన్సింగ్ డీజీసీఏ, బీసీఏఎస్ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్ విమానాల ప్రారంభానికి అవసరమైన ఆమోదాలు, ధృవీకరణను డీజీసీఏ నుండి పొందవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు/యుటిలు, విమానాశ్రయ ఆపరేటర్‌ల ద్వారా రాయితీల ద్వారా ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్‌లకు (ఎస్ఏఓలు) మద్దతు ఇవ్వడం ద్వారా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని ఉడాన్ కింద ప్రోత్సహిస్తారు. ప్రాంతీయ మార్గాల్లో ఎయిర్‌లైన్ కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడానికి, అంతరాన్ని తీర్చడానికి ఆర్థిక (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేదా విజిఎఫ్) మద్దతును అందించడంతో పాటు పథకం కింద అందించే రాయితీలు క్రింది విధంగా ఉన్నాయి:
ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు:
i) ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఆర్సిఎస్ విమానాలపై ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు విధించరు
ii) ఆర్సిఎస్ విమానాలపై ఎటువంటి టెర్మినల్ నావిగేషన్ ల్యాండింగ్ ఛార్జీలు (టిఎన్ఎల్సి)ను ఏఏఐ విధించదు.
iii) రూట్ నావిగేషన్, ఫెసిలిటేషన్ ఛార్జీలు (ఆర్ఎన్ఎఫ్సి) ఏఏఐ ద్వారా ఆర్సిఎస్ విమానాల సాధారణ చార్జీలకన్నా 42.50శాతం తగ్గింపు ప్రాతిపదికన విధిస్తారు.
iv) ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్లు (ఎస్ఏఓ) అన్ని విమానాశ్రయాలలో పథకం కింద కార్యకలాపాల కోసం స్వీయ-గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు అనుమతిస్తారు.
కేంద్ర ప్రభుత్వం:
i) ఈ పథకం నోటిఫికేషన్ తేదీ నుండి మూడు సంవత్సరాల ప్రారంభ కాలానికి ఆర్సిఎస్ విమానాశ్రయాల నుండి ఎస్ఏఓలు కొనుగోలు చేసిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటిఎఫ్)పై 2 శాతం చొప్పున ఎక్సైజ్ సుంకం విధిస్తారు.
ii) ఎస్ఏఓలు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కోడ్ షేరింగ్ ఏర్పాట్లలోకి ప్రవేశించే స్వేచ్ఛను కలిగి ఉంటాయి.
తమ రాష్ట్రాల్లోని ఆర్సిఎస్ విమానాశ్రయాలలో రాష్ట్ర ప్రభుత్వం:
i) 10 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆర్సిఎస్ విమానాశ్రయాలలో ఏటిఎఫ్ పై వ్యాట్ ని 1శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గిస్తారు.
ii) ఆర్సిఎస్ఏ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధికి అవసరమైన కనీస భూమిని ఉచితంగా, భారం లేకుండా అందించడం, అవసరమైన విధంగా బహుళ-మోడల్ హింటర్‌ల్యాండ్ కనెక్టివిటీని అందించడం.
iii) ఆర్సిఎస్ విమానాశ్రయాలలో భద్రత, అగ్నిమాపక సేవలను ఉచితంగా అందించడం.
iv) విద్యుత్, నీరు మరియు ఇతర యుటిలిటీ సేవలను గణనీయంగా రాయితీతోఆర్సిఎస్ విమానాశ్రయాలలో అందించడం
v) నిర్ణయించిన విజిఎఫ్ లో నిర్దిష్ట వాటాను (ఈశాన్య రాష్ట్రాలు కాకుండా 20 శాతం ఇతర రాష్ట్రాలకు నిష్పత్తి 10 శాతం ఉంటుంది) అందించండి.
మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడానికి, మారుమూల ప్రాంతాలలో విమాన ప్రయాణానికి తగిన సౌకర్యాలను నిర్ధారించడానికి తీసుకున్న కొన్ని చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:
i. విమానాశ్రయాలలో అభివృద్ధి/అప్‌గ్రేడేషన్ పనుల పురోగతిపై అన్ని వాటాదారుల కాలానుగుణ సమీక్ష.
ii. ఫిక్స్‌డ్ వింగ్ సీప్లేన్‌లు, హెలికాప్టర్లలో ఎన్ఎస్ఓపి కార్యకలాపాలు అనుమతిస్తారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
(Release ID: 1944520)
Visitor Counter : 91