బొగ్గు మంత్రిత్వ శాఖ
తమిళనాడులో విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా
Posted On:
31 JUL 2023 4:35PM by PIB Hyderabad
తమిళనాడు ఉత్పత్తి యూనిట్లకు రోజుకు 72000 ఎంటి బొగ్గు సరఫరాకు హామీ ఇవ్వవలసింది తమిళనాడు ప్రభుత్వం నుంచి బొగ్గు మంత్రిత్వ శాఖ సూచనలను అందుకుంది. ఇందుకు సంబంధించి సరఫరా స్థితిగతులను తమిళనాడు ప్రభుత్వానికి వివరించడం జరిగింది. ఆర్థిక సంవత్సరం 2023-23లో సానుకూల వార్షిక కాంట్రాక్టు పరిమాణంలో కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) కింద పనిచేస్తున్న టాంగెడ్కో (TANGEDCO ) మొత్తం 4.65 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటి)లో 97% వాస్తవరూపంలో 4.5 ఎంఎంటిల బొగ్గును సరఫరా చేసింది. అంతేకాకుండా, టాంగెడ్కోకు అవగాహనా పత్రం (ఎంఒయు) కింద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కూడా బొగ్గును సరఫరా చేస్తోంది.
విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ అథారిటీ (సిఇఎ), కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), సింగరేణీ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) ప్రతినిధులతో ఏర్పడిన అంతర్ మంత్రిత్వ ఉపబృందం క్రమం తప్పకుండా సమావేశమై థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడంతో పాటు, విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ కేంద్రాలలో కీలకమైన బొగ్గు స్టాకు పరిస్థితిని ఉపశమింపచేయడం సహా ఈ రంగానికి సంబంధించి ఏర్పడే ఏవైనా ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడం వంటి వివిధ కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంది.
దీనికి అదనంగా, రైల్వే బోర్డు చైర్మన్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, బొగ్గు సరఫరా మెరుగుపరచడాన్ని పర్యవేక్షించేందుకు, విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యాన్ని పర్యవేక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ (ఐఎంసి)ని ఏర్పాటు చేసింది. ఐఎంసి అవసరమైనప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా నూతన, పునరుత్పాదక ఇంధన కార్యదర్శిలతో సిఇఎ చైర్‌పర్సన్‌లను అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ (ఐఎంసి)లో చేర్చుకుంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
****
(Release ID: 1944500)
Visitor Counter : 100