పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆన్ లైన్ మెడికల్ వాల్యూ ట్రావెల్


(ఎం వి టి ) పోర్టల్ ను ఏర్పాటు చేయడం ద్వారా డిజిటలైజేషన్ ప్రారంభించడం అనేది మెడికల్ అండ్ వెల్ నెస్ టూరిజం దిశగా నేషనల్ స్ట్రాటజీ , రోడ్ మ్యాప్ కీలక స్తంభాలలో ఒకటి.

Posted On: 31 JUL 2023 4:52PM by PIB Hyderabad

మెడికల్ టూరిజంతో సహా పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాల బాధ్యత. దేశంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి పర్యాటక మంత్రిత్వ శాఖ మెడికల్ అండ్ వెల్ నెస్ టూరిజం కోసం  జాతీయ వ్యూహాన్ని, రోడ్ మ్యాప్ ను రూపొందించింది

 

జాతీయ వ్యూహం క్రింద ఈ కీలక స్తంభాలను గుర్తించారు :

 

i. వెల్ నెస్ డెస్టినేషన్ గా భారతదేశానికి ఒక బ్రాండ్ ను అభివృద్ధి చేయడం

 

ii. మెడికల్ అండ్ వెల్ నెస్ టూరిజం కోసం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం

 

iii. ఆన్ లైన్ మెడికల్ వాల్యూ ట్రావెల్ (ఎం వి టి ) పోర్టల్ ను ఏర్పాటు చేయడం ద్వారా డిజిటలైజేషన్ ప్రారంభించడం

 

iv. మెడికల్ వాల్యూ ట్రావెల్ కోసం ప్రాప్యతను పెంచడం

 

v. వెల్ నెస్ టూరిజాన్ని ప్రోత్సహించడం

 

vi. గవర్నెన్స్ అండ్ ఇన్ స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్

 

కాగా,పర్యాటక మంత్రిత్వ శాఖ తన కొనసాగుతున్న కార్యకలాపాలలో భాగంగా, దేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాలు,  ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ' ఇన్ క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్-లైన్ కింద విదేశాల లోనూ , అవకాశాలు ఉన్న మార్కెట్ లలో గ్లోబల్ ప్రింట్, ఎలక్ట్రానిక్,  ఆన్ లైన్ మీడియా ప్రచారాలను విడుదల చేస్తుంది. మెడికల్ టూరిజం థీమ్ తో సహా వివిధ అంశాలపై మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా డిజిటల్ ప్రమోషన్లు కూడా క్రమం తప్పకుండా చేపడుతున్నారు.

 

భారత ప్రభుత్వం 30.11.2016 న క్యాబినెట్ ఆమోదం మేరకు ఇ-టూరిస్ట్ వీసా పథకాన్ని సరళీకృతం చేసింది ఇ-టూరిస్ట్ వీసా (ఇటివి) పథకాన్ని ఇ-వీసా పథకంగా పేరు మార్చింది ప్రస్తుతం ఇ-మెడికల్ వీసా , ఇ-మెడికల్ అటెండెంట్ వీసాలను ఇ-వీసా ఉప కేటగిరీలుగా కలిగి ఉంది.

 

ఇ-మెడికల్ వీసా, ఇ-మెడికల్ అటెండెంట్ వీసా విషయంలో ట్రిపుల్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. సంబంధిత ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఆర్ఒ)/ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ ఒ) ప్రతి కేసు మెరిట్ ఆధారంగా 6 నెలల వరకు పొడిగించవచ్చు. మెడికల్ అటెండెంట్ వీసా అనేది ప్రిన్సిపల్ ఇ వీసా హోల్డర్ చెల్లుబాటుతో సమానత కలిగి ఉంటుంది.

 

దేశంలో వైద్య విలువ కలిగిన ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఆస్పత్రులు, మెడికల్ వాల్యూ ట్రావెల్ (ఎం వి టి ) ఫెసిలిటేటర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎన్ ఎ బి హెచ్ వంటి ఇతర మంత్రిత్వ శాఖలు, భాగస్వాములతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తోంది.

 

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్ సభలో ఒక లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.

 

***


(Release ID: 1944481) Visitor Counter : 101


Read this release in: English , Urdu