మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రాంచీలో బాలల రక్షణ, భద్రత, సంరక్షణపై మూడవ ప్రాంతీయ సదస్సు నిర్వహించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సదస్సులో పాల్గొన్న 800 కు పైగా సిడబ్ల్యుసి,జెజెబి,గ్రామ స్థాయి పిల్లల సంరక్షణ కమిటీల ప్రతినిధులు,
అంగన్‌వాడీ కార్యకర్తలు
సంస్థాగత, ఇతర సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న పిల్లల ఆధార్ వివరాలు సేకరించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.. డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్
కేంద్ర మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడంతో పీఎం కేర్స్ పథకం ద్వారా 4418 మంది పిల్లలకు ప్రయోజనం.. డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్
Posted On:
31 JUL 2023 11:02AM by PIB Hyderabad
బాలల రక్షణ, భద్రత, శిశు సంక్షేమం పై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 4వ ఒకరోజు ప్రాంతీయ సదస్సు సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ దర్భంగా హాల్‌లో జరిగింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలు సదస్సులో పాల్గొన్నాయి. సదస్సులో 800కు పైగా బాలల సంక్షేమ కమిటీలు (సిడబ్ల్యుసిలు), జువైనల్ జస్టిస్ బోర్డులు (జెజెబిలు), గ్రామ స్థాయి పిల్లల సంరక్షణ కమిటీ (విసిపిసి) సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.బాలల భద్రతా, సంరక్షణ, సంక్షేమం అంశాలపై అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సదస్సుల్లో భాగంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాంచీలో ప్రాంతీయ సదస్సు నిర్వహించింది.
సదస్సులో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి అదనపు కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ చద్దా, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ శ్రీ ప్రియాంక్ కనూంగో పాల్గొన్నారు.
బాల్య న్యాయం చట్టం నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలపై సదస్సులో ప్రత్యేకంగా చర్చలు జరిగాయి.
2022 సెప్టెంబర్ నెలలో దత్తతకు సంబంధించి చట్టంలో సవరణలు చేశారు. సవరణల వల్ల దత్తత ప్రక్రియ సులభతరం అయింది. దీనివల్ల దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కలిగిన ప్రయోజనాలను సదస్సులో ప్రస్తావించారు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి అదనపు కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ చద్దా స్వాగతోపన్యాసం చేశారు. పిల్లల దత్తత కోసం గతంలో కోర్టుల ద్వారా చర్యలు అమలు జరిగేవని ఆయన పేర్కొన్నారు. పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను క్రమబద్ధీకరించి, పటిష్టం చేశామని ఆయన వివరించారు. జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా దత్తత సర్టిఫికెట్ జారీ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని ఆయన చెప్పారు. చైల్డ్ హెల్ప్‌లైన్ సామర్థ్యాన్ని పెంపొందించి, అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించడం లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. దీనికోసం చైల్డ్ హెల్ప్‌లైన్ అన్ని రాష్ట్రాల్లో అత్యవసర నంబర్ 112 ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
ఎన్‌సిపిసిఆర్ చైర్‌పర్సన్ శ్రీ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ద్వారా తొలిసారిగా 23 ఏళ్లలోపు పిల్లలకు స్పాన్సర్‌షిప్ అందిస్తున్నామని తెలిపారు. గతంలో బాలల సంరక్షణ సేవల కింద నాన్-ఇన్‌స్టిట్యూషనల్ చైల్డ్ కేర్ కోసం నెలకు 2000 రూపాయలు అందించిన ప్రభుత్వం ఇప్పుడు దీనిని నెలకు 4000 అందిస్తోందని తెలిపారు. మిషన్ వాత్సల్య కింద జిల్లాకు 40 మంది పిల్లలు మాత్రమే ఉండాలన్న పరిమితిని తొలగించామని శ్రీ ప్రియాంక్ కనూంగో తెలిపారు .
కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు మంత్రిత్వ శాఖ చేస్తున్న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం వల్ల సుమారు 4418 మంది పిల్లలకు ప్రయోజనం కలిగిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ తెలిపారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యాశాఖ, గిరిజన వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల తో సహా పలు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం సాధించి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
మిషన్ వాత్సల్య పథకం కింద పిల్లలకు కలుగుతున్న ప్రయోజనాలను డాక్టర్ ముంజపర మహేంద్ర భాయ్ వివరించారు. 'బాలల రక్షణ సేవలు' పథకం స్థానంలో మిషన్ వాత్సల్య పథకం అమల్లోకి వచ్చిందన్నారు. 2021-22 నుంచి 2025-26 వరకు 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో 'బాలల రక్షణ సేవలు' పథకం అమలు జరిగింది. సంస్థాగత,నాన్-ఇన్‌స్టిట్యూషనల్ సంరక్షణలో పిల్లలందరి ఆధార్ వివరాలు సేకరించాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించిందని డాక్టర్ ముంజపరా తెలియజేశారు.
మిషన్ వాత్సల్య పదకం కింద అమలు జరుగుతున్న కార్యక్రమాల వివరాలను పంచుకోవడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడింది.
(Release ID: 1944339)
Visitor Counter : 134