నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రధాన పోర్టుల సామర్ధ్యం
Posted On:
28 JUL 2023 3:17PM by PIB Hyderabad
పోర్టుల రంగంలో మౌలికసదుపాయాల అభివృద్ధి అనేది నిరంతరాయ ప్రక్రియ. ఈ ప్రక్రియలో కొత్త బెర్తులు, టెర్మినళ్ల నిర్మాణం, ప్రస్తుత బెర్తులు ,టెర్మినళ్ల యాంత్రీకరణ, పోర్టులలోకి భారీ నౌకలు వచ్చేందుకు వీలుగా మార్గాన్ని లోతు చేయడం, నౌకాశ్రయాలకు రోడ్డు, రైలు అనుసంధానత, తదితరాలు ఉన్నాయి. ఈ మౌలిక సదుపాయాలు ప్రధాన పోర్టుల సామర్ధ్యాన్ని పెంచడానికి దోహదపడతాయి. ఫలితంగా ప్రధానపోర్టులలో సరకు రవాణా సామర్ధ్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ప్రధాన పోర్టులలో సరకురవాణా సామర్ధ్యం 31.03 2023 నాటికి 1617 ఎం.టి.పి.ఎలు. ప్రధాన పోర్టులలో ప్రస్తుత కార్గో రవాణాకు ఈ సామర్ధ్యం సరిపోతుంది. ప్రధానమంత్రి గతి శక్తి కింద, డిపిఐఐటి ,సమగ్ర పోర్టు అనుసంధానత ప్రణాళిక (సిపిసిపి) ని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలు, రైల్వే, రోడ్ ట్రాన్స్పోర్ట్, జాతీయరహదారుల మంత్రిత్వశాఖలు, రాష్ట్రాల సముద్రయాన బోర్డులను సంప్రదించి 2022 సెప్టెంబర్న ప్రకటించింది.
సిఆర్సిపి 298 అనుసంధానత ప్రాజెక్టులను చేర్చగా అందులో 191 ప్రాజెక్టులు (101 రోడ్డు, 90 రైలు ప్రాజెక్టులు). ఈప్రాజెక్టులు చిట్టచివరి ప్రాంతం వరకు అనుసంధానత కల్పించేందుకు ఉద్దేశించిన పోర్టులు.
ఇది పోర్టుల సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా సరకు రవాణా మెరుగుదలకు దోహదపడుతుంది.
ఈ రోడ్డు, రైలు మౌలికసదుపాయాల గ్యాప్ ప్రాజెక్టులు, ప్రధానంగా రైల్వేమంత్రిత్వశాఖ, రోడ్డు రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రాధాన్యతా ప్రాతిపదికపై చేపట్టినవి.
ఈ సమాచారాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ లోక్సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1944105)