ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గ్రామీణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు చర్యలు

Posted On: 28 JUL 2023 3:28PM by PIB Hyderabad

సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఇప్పటికే ఉన్న సబ్ హెల్త్ సెంటర్స్(ఎస్హెచ్సీ)లు మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్స్(పీహెచ్సీ)లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా భారతదేశంలో మొత్తం 1,60,480 ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు నిర్వహించబడ్డాయి.
పోస్ట్ చేసిన తేదీ: 28 జూలై, 2023 పీఐబీ, ఢిల్లీ
దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క మూడు స్తంభాలుగా సబ్ హెల్త్ సెంటర్ (గ్రామీణ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పట్టణ మరియు గ్రామీణ) మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (అర్బన్ మరియు రూరల్)తో మూడు-స్థాయిల్లో వ్యవస్థలను కలిగి ఉంటుంది.

వ్యవస్థాపక నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో 5,000 (సాధారణ) మరియు 3000 (కొండలు మరియు గిరిజన ప్రాంతంలో) జనాభాకు ఉప ఆరోగ్య కేంద్రం, 30,000 (సాధారణ) మరియు 20,000 (కొండలు మరియు కొండ ప్రాంతాలలో) జనాభాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు 1,20,000 (సాధారణ) మరియు 80,000 (కొండలు మరియు గిరిజన ప్రాంతంలో) జనాభా కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూచించబడింది. అంతేకాకుండా  పట్టణ ప్రాంతం కోసం 15,000 నుండి 20,000 పట్టణ జనాభా కోసం ఒక అర్బన్ హెల్త్ వెల్నెస్ సెంటర్ సిఫార్సు చేయబడింది, 30,000 నుండి 50,000 పట్టణ జనాభాకు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, నాన్-మెట్రో నగరాల్లో ప్రతి 2.5 లక్షల జనాభాకు ఒక అర్బన్కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిఫార్సు చేయబడింది. మెట్రో నగరాల్లో ప్రతి 5 లక్షల జనాభాకు ఒక అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించబడింది. అంతేకాకుండా మొదటి రెఫరల్ యూనిట్, సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (ఎస్డీహెచ్) మరియు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (డీహెచ్) గ్రామీణ & పట్టణ ప్రాంతాలకు సెకండరీ కేర్ సేవలను అందిస్తాయి.

గ్రామీణ ఆరోగ్య గణాంకాలు (ఇర్హెచ్ఎస్) అనేవి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటివ్ డేటా ఆధారంగా వార్షిక ప్రచురణ. గ్రామీణ & పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా సబ్-సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, సబ్-డివిజనల్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ & మెడికల్ కాలేజీల వివరాలతో పాటు గ్రామీణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని సగటు జనాభా వివరాలతో పాటుగా కింది వాటిలో చూడవచ్చు.

రూరల్ హెల్త్ సెంటర్ 2021–-22 లింక్:
https://hmis.mohfw.gov.in/downloadfile?filepath=publications/Rural-Health-Statistics/RHS%202021-22.pdf

జాతీయ ఆరోగ్య మిషన్ (నేషనల్ హెల్త్ మిషన్) ప్రజల అవసరాలకు జవాబుదారీగా మరియు ప్రతిస్పందించే సమానమైన, సరసమైన & నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు సార్వత్రిక ప్రాప్యతను సాధించాలని భావిస్తుంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ (పీఐపీలు) రూపంలో అందిన ప్రతిపాదనల ఆధారంగా ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నిబంధనలు మరియు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్  రూపంలో ప్రతిపాదనలకు భారత ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది.

24.07.2023 నాటికి, మొత్తం 1,60,480 ఆయుష్మాన్ భారత్ – హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు (ఏబీహెచ్డబ్ల్యూసీలు) భారతదేశంలో ఇప్పటికే ఉన్న సబ్హెల్త్సెంటర్లు మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (సీపీహెచ్సీ)ని అందించడం ద్వారా నివారణ, ప్రోత్సాహక, ఉపశమన మరియు పునరావాస సేవలు సార్వత్రికమైనవి. ఈ సేవలు ఉచితంగా అందించడంతోపాటు నివాసాలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తారు.

పదిహేనవ ఆర్థిక సంఘం (ఎఫ్సీఎక్స్వీ) ఆరోగ్య రంగంలోని నిర్దిష్ట భాగాల కోసం స్థానిక ప్రభుత్వాల ద్వారా రూ. 70,051 కోట్ల గ్రాంట్‌లను సిఫార్సు చేసింది. దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. స్థానిక ప్రభుత్వాల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన ఈ గ్రాంట్లు 2021–-22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-–26 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలంలో విస్తరించబడతాయి. అట్టడుగు స్థాయిలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి వీలు కల్పిస్తాయి.

భారత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో అంతరాన్ని తగ్గించడంపై దృష్టి సారించే అనేక పథకాలను అమలు చేస్తుంది. ప్రధానమంత్రి- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎంఏబీహెచ్ఐఎం)ని గౌరవనీయులైన ప్రధానమంత్రి రూ.64,180 కోట్లతో ప్రారంభించారు. ప్రధానమంత్రి- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎంఏబీహెచ్ఐఎం) కింద చర్యలు ప్రస్తుత మరియు భవిష్యత్తులో వచ్చే మహమ్మారి/విపత్తులకు ప్రభావవంతంగా ప్రతిస్పందించడానికి ఆరోగ్య వ్యవస్థలను సిద్ధం చేయడానికి, ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ అన్ని స్థాయిలలో నిరంతరాయంగా ఆరోగ్య వ్యవస్థలు మరియు సంరక్షణ సంస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ శుక్రవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

***

 



(Release ID: 1943880) Visitor Counter : 102


Read this release in: English , Tamil